పండుమిర్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

వంట చేస్తున్నాం, కూర వండుతున్నాం అంటే అందులోకి ఏం ఉన్నా లేకపోయినా ఉప్పు, కారం మాత్రం కచ్చితంగా ఉండాలి. మన రోజువారీ జీవితంలో మిరపకాయలు లేనిదే అసలు పనిజరగదు. ఇంట్లో బోలెడు కూరగాయలు ఉన్నా మిరపకాయలు లేకపోతే వంట చేయలేము. కారంగా ఉండే మిరపకాయలు మన వంటల్లో అంతగా బాగమైపోయాయి. వంటకాల్లో ఎండుకారం కంటే మిరపకాయలు వేసుకోవడమే ఆరోగ్యమని నిపుణులు సూచిస్తుంటారు.

Health Benefits Of Black pepperఆయుర్వేదపరంగా కూడా మిర్చిని మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ప్రతి ఇంట్లో ఉన్న పండుమిర్చితో కాస్త పండుమిర్చి పచ్చడి లేక సాదారణంగా చేసుకునే టమాటా పండు మిర్చి, గోంగూర పండుమిర్చి ఇలాంటి కాంబినేషన్లు చూస్తూ ఉంటాం. పచ్చి మిర్చితో చేసే వంటలకంటే కూడా పండు మిరపకాయలతో చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది.

Health Benefits Of Black pepperఅయితే ఈ మిరపకాయల్లో కొన్ని అలా ఇంట్లోనే పండిపోయి ఎర్రగా మారి పండు మిర్చి అయిపోతుంటాయి. చాలామంది వాటిని ఎండబెట్టేసి ఎండుమిర్చి లాగా ఉపయోగిస్తుంటారు. కానీ పండుమిర్చిని ఎండబెట్టకుండా అలాగే వంటల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలోని కొవ్వుపదార్థాలను విడగొట్టి ఊబకాయం దరిచేరకుండా చేయగల సమర్థత మిర్చికి ఉంది.

Health Benefits Of Black pepperఒంట్లో కొవ్వు పేరుకోకపోతే గుండె కూడా దృఢంగానే ఉంటుంది. అలాగే పండు మిర‌ప‌కాయ‌ల‌ను బాగా తినేవారికి హార్ట్ ఎటాక్‌లు, ప‌క్ష‌వాతం వ‌చ్చే అవకాశాలు కూడా చాలా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. ఇక బ‌రువును త‌గ్గించే ఆహారాల విష‌యంలో పండు మిర‌ప‌కాయ‌లు ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. పండు మిర‌ప‌కాయ‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

Health Benefits Of Raw Bananasపండు మిరపకాయలు ఆకర్షణగా ఎర్రగా ఉండే రంగు వల్ల బీటా కెరోటిన్ లేదా ప్రో-విటమిన్ ఎ యొక్క అధిక కంటెంట్‌ను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ ను యాంటీ ఇన్ఫెక్షన్ విటమిన్ అని పిలుస్తారు, ఆరోగ్యకరమైన శ్లేష్మ పొరలకు విటమిన్ ఎ అవసరం, ఇది శ్వాశ నాళాలు, ఊపిరితిత్తులు, పేగు మరియు మూత్ర మార్గాలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

Health Benefits Of Black pepperపండు మిర‌ప‌కాయ‌ల్లో ఉండే క్యాప్సెయిసిన్ అనే స‌మ్మేళ‌నం ర‌క్త స‌ర‌ఫరాను మెరుగు ప‌రుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేసి శరీరంలో ఉండే బాక్టీరియా, ఇత‌ర క్రిముల‌ను నాశ‌నం చేస్తుంది. ఆర్థరైటిస్, సోరియాసిస్ మరియు డయాబెటిక్ న్యూరోపతితో సంబంధం ఉన్న నొప్పితో సహా మన శరీరంలో అన్ని అవయవాల నరాల సమస్యలకు క్యాప్సైసిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది.

Health Benefits Of Black pepperక్యాప్సైసిన్ నొప్పిని తగ్గించడమే కాక, దానిలోని ఘాటు మొండి జలుబు, శ్వాస నాళం ఇబ్బంది, ఊపిరితిత్తులలో నిండిన శ్లేష్మం మొదలైనవి నిర్మూలించడంలో సహాయపడుతుంది. దీంతో మ‌న‌కు ఆయుష్షు కూడా పెరుగుతుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. పండు మిరపకాయలు చేకూర్చే కారం రక్తంలోని కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను మరియు ప్లేట్‌లెట్ అగ్రిగేషన్‌ను తగ్గిస్తుంది.

Home tips to purify the bloodరక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థమైన ఫైబ్రిన్‌ను కరిగించి శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. కాకపోతే ఏదైనా మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. అలాగే మోతాదుకి మించి కారాన్ని తీసుకుంటే నానారకాల ఆరోగ్యసమస్యలూ దరిచేరక తప్పవంటున్నారు వైద్యలు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR