షుగర్ పేషంట్లకు ఔషధంగా పనిచేసే బ్లాక్ రైస్ గురించి తెలుసా ?

0
380

కృష్ణ వ్రీహీ లేదా బ్లాక్ రైస్ అనేది ప్రాచీన భారతీయ వరి వంగడం, సుశృత సంహితలో కూడా దీని గురించి ప్రస్తావించారు. అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి మతపరమైన ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. జీవోత్పత్తి వ్యవస్థను పెంపొందించే గుణాలు కృష్ణ బియ్యంలో పుష్కలమని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు

Health Benefits of Black Riceబ్లాక్ రైస్ వీటిని చూస్తే అన్నం మాడిపోయిందా అనే విధంగా ఉంటుంది. కానీ ఇవి షుగర్ పేషంట్లకు చాలా మంచిది. అంతేకాదు ఇది కొన్ని రకాల వంటల కోసం ప్రత్యేకంగా వాడతారు. సాధారణ రైస్ లాగా నేరుగా తినకపోయినా కొన్ని రకాల ఫుడ్స్ తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు.

Health Benefits of Black Riceబ్లాక్ రైస్ తో మణిపూర్ కి అరుదైన గుర్తింపు లభించింది. చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది, ఈ రైస్ మనకు కూడా మార్కెట్లో దొరుకుతాయి. కాని దీనిని పెద్దగా మనవాళ్లు ఇంకా అలవాటు చేసుకోలేదు. శతాబ్దాలుగా మణిపూర్లో సాగులో ఉన్న చాఖవో అనే గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది.

Health Benefits of Black Riceదీనితో ఏ వంటకం చేసినా మంచి సువాసన వస్తుంది. అయితే ఈ విత్తనాలు కావాలి అంటే మాత్రం మణిపూర్ వెళ్లాల్సిందే. ప్రత్యేకమైన ఫంక్షన్లు కార్యక్రమాలలో మాత్రమే వీటిని వాడుతూ ఉంటారు.

Health Benefits of Black Riceమామూలు బియ్యం కిలో 35-40 రూపాయలకే దొరుకుతుంటే మణిపూర్ చాఖావో కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్ స్థానిక మార్కెట్లో లభిస్తుంది.హోల్ సేల్ గా మనకు కావాలి అంటే ఇంఫాల్ నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇక నాణ్యమైన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 300 రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. విదేశీ మార్కెట్లలో కూడా బ్లాక్ రైస్ అందుబాటులోకి రావడం గొప్పవిషయం. తొలిసారి ఆస్ట్రేలియాకు పంపిన కృష్ణవ్రీహీ బియ్యం కిలో 850 రూపాయలుగా నిర్ణయించారు.

 

SHARE