ఎడారి ప్రాంతాల్లో పెరిగే బ్రహ్మజెముడు మొక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఔషధ మొక్క ఇది నీటి ఎద్దడిని తట్టుకుని ఇసుక నేలల్లో 10 నుంచి 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. సాధారణంగా ఈ ఎడారి మొక్కలు నీటిని తమ కాండంలో నిల్వ వుంచుకునే శక్తి కలిగి ఉంటాయి. నిలువెల్లా ముళ్లుండే మొక్క బ్రహ్మజెముడు మొక్కలను వ్యవసాయ పంట రక్షణ కొరకు పొలం చుట్టూ కంచెగా పెంచుతారు.
ఈ మొక్కలు ఒకసారి నాటితే చాలు. తీవ్ర కరువొచ్చినా, తుపాన్లు వచ్చినా తట్టుకొని బతికి పండ్లను అందించే మొక్కలివి. భూసారం లేని, ఇసుక నేలల్లో, అటవీ భూముల్లో తనంతట తానే పెరిగే కరువు నేలల మొక్క. దీనికి ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొని బ్రహ్మజెముడు మొక్క తన ఆకుల్లోనే నీటిని నిల్వ ఉంచుకుంటుంది.
ఏ మొక్క ఆకుల్లోనైనా సూక్ష్మ పత్ర రంధ్రాలుంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారా ఏ మొక్కయినా నీటి తేమను వాతావరణంలోకి వదులుతూ ఉంటుంది. అందుకే ఆ మొక్కలు బతకడానికి నీటి అవసరం ఉంటుంది. బ్రహ్మజెముడు అలా కాదు. పత్రరంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి నీటి అవసరం కూడా ఈ మొక్కకు తక్కువగానే ఉంటుంది.
విత్తనాలు కూడా అవసరం లేదు. మొక్క (ఆకులు) భాగాలు తీసి పక్కన పాతితే ఈ చెట్లు పెరుగుతాయి. అంగోలా, మెక్సికో, మొరాకో, సిసిలీ, పొర్చుగల్ దేశాల్లో ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. మెక్సికోలో జన్యుపరంగా అభివృద్ధి చేసి ముళ్లు లేని బ్రహ్మజెముడు వంగడాన్ని రూపొందించి సాగు చేస్తున్నారు. బీట్‌రూట్ అందించే పోషక విలువలను ఇది అందిస్తుంది.
అంతేకాదు డ్రాగన్ ప్రూట్ కన్న అధిక పోషక విలువలు కల్గిన బ్రహ్మజెముడు పంటకు ఎలాంటి ఖర్చూ ఉండదు. బ్రహ్మజెముడు పండు ఎరుపు, గులాబి రంగులో ఉంటాయి. వాటితో జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు. పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు.ఇందులో B12, A, C విటమిన్లు ఉన్నాయి. అమెరికన్లు ఈ పండ్లని బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకుంటారు.ఈ పండులో కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు బ్రహ్మజెముడు పండ్లు ఉపయోగపడతాయి. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఇందులో ఉన్నాయి. అయితే ఈ పండుని అప్పుడప్పుడూ అయినా తీసుకోవాలని అంటున్నారు నిపుణులు.
బ్రహ్మజెముడు పండు ఉత్పత్తులను ఆహార శుద్ధి పరిశ్రమల్లో కూడా ఉపయోగించవచ్చు. ఈ పండులో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయని, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇవి దోహదపతాయన్నారు. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తాయి.