మానవుడికి ప్రకృతిలోని జీవ జాలానికి ఉన్న అనుబంధం చాటిచెప్పే విశిష్టమైన పండగ వినాయక చవితి. బొజ్జ గణపయ్యకు ప్రసాదాలు అంటే ఎంత ప్రీతిపాత్రమో పాత్రలు కూడా అంతే ఇష్టం. పెద్దగా ఖర్చు పండ్లు ప్రసాదాలు చేసి పెట్టలేని వారు ప్రకృతి ఒడిలో దొరికే ఆకులతో పూజ చేసి కూడా విగ్నేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
- బృహతీ పత్రం నీళ్ళలో బాగా కాచి, ఆకులను ఉప్పుతో కలిపి నూరి ఒక గుడ్డలో తీసుకొని కీళ్లనొప్పులు ఉన్న చోట కట్టుకడితే నొప్పులు తగ్గుతాయి.
- బృహతీ పత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది.
- బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరచకుంటే నోటిదుర్వాసన తొలగిపోతుంది.
- రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీ పత్రానికి ఉంది.
- ఎక్కిళ్ళను తగ్గిస్తుంది కఫ వాత దోషాలను ఆస్తమా దగ్గు సైన్సెస్ తగ్గిస్తుంది.
- జీర్ణశక్తిని పెంచుతుంది.
- గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.