క్యాప్సికం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

క్యాప్సికం ఒకరకరకమైన మిర్చి కానీ కారం మాత్రం ఉండదు. ఖరీదైన వంటకాల్లో మిసమిసలాడుతూ ఉంటుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభ్యమయ్యే క్యాప్సికంలో చాలా రకాలు ఉంటాయి. బెంగళూరు మిర్చి, సిమ్లా మిర్చి, బెల్ పెప్పర్‌ పేరు అనే పేర్లతో కూడా పిలుస్తారు. మార్కెట్లలో ఆకుపచ్చ రంగు కాప్సికమ్ దొరుకుతుంది. నేటి షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లలో ఎరుపు, పసుపు రంగు బెల్ పెప్పర్లు కూడా లభిస్తున్నాయి.

క్యాప్సికంఅయితే.. క్యాప్సికంలో చాలా రకాలు ఉన్నట్టే.. చాలా పోషకాలు కూడా ఉంటాయి. ఈ విషయం తెలియక చాలామంది అస్సలు క్యాప్సికంనే ముట్టుకోరు. కొందరికైతే క్యాప్సికంను తింటే ఏదో వెగటుగా ఉంటుందని.. పచ్చి మిర్చీని తిన్నట్టే ఉంటుందని దాన్ని కొనరు. కానీ.. క్యాప్సికంలో ఉన్న పోషకాల గురించి తెలుసుకున్నారంటే ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు కచ్చితంగా క్యాప్సికం తీసుకుంటారు.

క్యాప్సికంరెండు మూడు రంగుల్లో లభించే క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్స్ లో విటమిన్ సి, బి, ఇ, ఫోలిక్ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇండియన్ డిషెష్ లో క్యాప్సికమ్ తో తయారుచేసే వంటలు చాలా ఫేమస్. దీన్ని వెజిటేబుల్ గానే కాదు ఫ్రూట్ గా కూడా పిలుచుకుంటారు అందుకే అనేక రకాల సలాడ్స్, వంటల్లో వినియోగిస్తుంటారు. విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, ఫైబర్, కేరోటినాయిడ్స్ మొదలైనవి పుష్కలంగా లభించే క్యాప్సికంతో ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

క్యాప్సికంకోబాల్ట్, జింక్, కాపర్, మెల్డినిమ్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి అనేక మినిరల్స్ క్యాప్సికమ్ లో నిండి ఉన్నాయి. కాప్సికంలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కొల్లజన్ ఉత్పత్తిని పెంచుతుంది. మన ఎముకల మధ్య జాయింట్స్ అనగా కీళ్ళకు అవసరమయ్యే విటిక్మిన్-కె ను అందించి రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తకణాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

క్యాప్సికంరెడ్ కలర్ లో ఉండే క్యాప్సికంలో లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని బి6 మరియు ఫోలేట్ గుండెకు హాని కలిగించే హీమోసైటనిన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. మనం తీసుకునే ఆహారం నుండి ఐరన్ ను సులువుగా గ్రహించడంలో క్యాప్సికం దోహదం చేస్తుంది. అనిమియా సమస్యతో బాధపడేవారు క్యాప్సికం ను ఆహారంలో భాగం చేసుకుంటే తొందరగా సమస్య నుండి బయటపడచ్చు.

క్యాప్సికంమన కళ్ళ ఆరోగ్యానికి విటమిన్-ఎ ఎంతో అవసరం. అలాంటి విటమిన్ ఎ కాప్సికంలో పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది రేచీకటి సమస్యను నివారిస్తుంది. క్యాప్సికం ను రోజు తినడం వల్ల ఇందులోని కెరోటినాయిడ్స్ వయసు రీత్యా వచ్చే దృష్టిలోపాలను తగ్గిస్తుంది. ఐ కాంటరాక్ట్ కు వ్యతిరేకంగా మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది.

క్యాప్సికంమధుమేహం ఉన్నవాళ్లకు కూడా క్యాప్సికం అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చెక్కెర స్థాయిలు క్రమబద్దీకరించి మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు.. క్యాన్సర్ కణాలతో పోరాడుతారు. దాని వల్ల క్యాన్సర్ ను రాకుండా అడ్డుకోవచ్చు.

క్యాప్సికంక్యాప్సికమ్ తినడం వల్ల రక్తం గడ్డకట్టదు. ఎందుకంటే ఇందులో ఉండే విటమిన్ సి రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. దాంతో స్ట్రోక్ ను నివారించుకోవచ్చు. క్యాప్సికమ్ లో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి . ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ మరయిు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

క్యాప్సికంకాప్సికంలో ఫైబర్ పాళ్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తి సామర్త్యాన్ని పెంచి, గ్యాస్ సమస్యలను, కడుపు అల్సర్ లను, కడుపులో వికారం వంటి వాటిని నివారిస్తుంది. క్యాప్సికమ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల, దీన్నిస్కిన్ బెనిఫిట్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. క్యాప్సికమ్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ డ్యామేజ్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది. ఇంకా క్యాప్సికమ్ లో ఔషధగుణగణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, క్యాప్సికమ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR