కొత్తిమీరతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ?

ప్రతి వంటకానికి మరింత రుచిని అందించడానికి కొత్తిమీరను ఉపయోగిస్తుంటాం. ఎంతంటి రుచికరమైన వంటకం చేసినా.. దానికి కొత్తిమీర జతచేయకపోతే.. సరిపడా రుచి వచ్చినట్లుగా అనిపించదు. అలాంటి కొత్తిమీరను పండించడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా మన ఇంటి పెరట్లో.. లేదా చిన్న చిన్న కుండీల్లో దీనిని సులభంగా పెంచుకోవచ్చు.

Health Benefits of Corianderఇంట్లో పెంచుకోవడం కుదరకపోతే మార్కెట్ లో నుండి తెచ్చుకోవచ్చు. ఎవరైనా కూరలు కొనుక్కుని వస్తున్నారు అంటే చివరగా కొత్తిమీర కొనాల్సిందే. అన్నీ కొనేశాక ఒక కట్ట కొత్తిమీర కూడా తీసేసుకుంటే ఇంక రైతు బజారులో పనైపోయినట్లే. అలాంటి కొత్తిమీర కేవలం వంటకాల్లో రుచికే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తూ, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. కొత్తిమీరతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటిచూపు:

Health Benefits of Corianderకొత్తిమీర కళ్లకు మంచిదని అంటుంటారు. ఇందులో విటమిన్ ఏ, సీ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫాస్పరస్ విజన్ డిసార్డర్స్‏ని ప్రివెంట్ చేస్తాయి. అలాగే కళ్లకు ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో ఉండే బీటా కెరొటిన్ వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే డీజెనరేటివ్ ఎఫెక్ట్స్‏ని కొత్తిమీర రివర్స్ చేయగలదు. కండ్ల కలక రాకుండా ప్రివెంట్ చేస్తుంది.

బ్లడ్ ప్రెజర్ కంట్రోల్:

Health Benefits of Corianderహైబీపీ తో బాధ పడుతున్న వారికి కొత్తిమీర సలాడ్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ ని బాగా రెడ్యూస్ చేస్తుంది.

మెన్స్ట్రువల్ క్రాంప్స్ తగ్గిస్తుంది:

Health Benefits of Corianderకొత్తిమీర చెట్ల నుంచి వచ్చిన ధనియాల్లో ఎసోర్బిక్ యాసిడ్, పామిటిక్ ఆసిడ్, లైనోలిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి హార్మోన్స్ సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. దీంతో మెన్ట్స్రువల్ సక్రమంగా పనిచేయడంతోపాటు నొప్పి కూడా తగ్గిస్తుంది. రాత్రింతా నానాబెట్టిన ధనియాలను ఉదయాన్నే తీసుకోవడం వలన ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

జీర్ణక్రియ మెరుగు:

Health Benefits of Corianderకొత్తిమీర ఆకులు వికారానికీ, అజీర్ణ సమస్యలకీ మంచి విరుగుడు. ఇది తీసుకోవడం వల్ల పొట్టలో అరగడానికి హెల్ప్ చేసే డైజెస్టివ్ జ్యూసులు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

యాంటీ ఆక్సిడెంట్స్:

Health Benefits of Corianderకొత్తిమీర లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. న్యూరో డీజెనరేటివ్ డిసీజెస్ ని ప్రివెంట్ చేస్తాయి. రెగ్యులర్ గా కొత్తిమీర తీసుకోవడం వల్ల కాన్సర్, అల్జైమర్స్, డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు భారీగా తగ్గుతాయి.

ధృడమైన ఎముకలు:

Health Benefits of Corianderఆస్తియోపొరాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని కొత్తిమీర తీసుకోమని చెబుతారు. ఎముకలు బలంగా, ఆరోగ్యం గా ఉండాలని కోరుకునే వారందరూ కొత్తిమీరని వారి రోజువారీ ఆహారంలో తప్పని సరిగా భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే కాల్షియం, ఇంకా ఇతర మినరల్స్, బోన్ డిగ్రడేషన్ ని ప్రివెంట్ చేస్తాయి, బోన్ రీగ్రోత్ కి హెల్ప్ చేస్తాయి.

నోటి దుర్వాసన పొగొడుతుంది:

Health Benefits of Corianderనోటి దుర్వాసన చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఎన్ని రకాల టూత్ పేస్ట్ వాడినా నోటి దుర్వాసను పొగోట్టలేనివారుంటారు. ఇప్పటికీ ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి చాలా మంది ధనియాలు నములుతుంటారు. కొత్తిమీర యాంటీ సెప్టిక్ టూత్ పేస్ట్‏లో తప్పనిసరిగా ఉంటుంది. ఇది నోటి దుర్వాసననే కాకుండా.. నోటి పూతను కూడా తగ్గించడంలో సహయపడుతుంది.

కొలెస్ట్రాల్ రెగ్యులేట్:

Health Benefits of Corianderప్రస్తుత కాలంలో చాలామంది చెడు కొలెస్ట్రాల్ తో బాధ పడుతున్నారు. కొత్తిమీర మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచి చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గడం కూడా సులభమవుతుంది.

కొత్తిమీరతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, బ్యూటీ బెనిఫిట్స్ కూడా చాలానే ఉన్నాయి. అవేంటో కొత్తిమీర స్కిన్ కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం…

జిడ్డు చర్మం:

Health Benefits of Corianderకొత్తిమీర ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, డిస్ఇంఫెక్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి అనేక రకాల చర్మ సమస్యల నుండి రిలీఫ్ ని ఇస్తాయి. ఈ ఆకుల్లో ఉండే విటమిన్స్ ఈ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. తాజా కొత్తిమీర రసాన్ని ఫేస్ మీద డైరెక్ట్ గా అప్లై చేయండి. గంట తరువాత కడిగేయండి. లేదంటే కొత్తిమీర ఆకులూ, పాలు కలిపి థిక్ పేస్ట్ లా కూడా చేయవచ్చు. ఈ పేస్త్ ని ముఖానికి పట్టించి పట్టించి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి. ముఖం మీద నుండి ఆయిల్ ని అబ్జార్బ్ చేసే లక్షణం కొత్తిమీర‏కి ఉంది కాబట్టి చర్మాన్ని నిగారింపజేస్తుంది.

యాక్నే, బ్లాక్ హెడ్స్:

Health Benefits of Corianderముఖం మీది యాక్నే, బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి కొత్తిమీర చక్కగా పనిచేస్తుంది. దానికోసం ఒక టీ స్పూన్ కొత్తి మీర ఆకుల పేస్ట్ తీసుకోండి. అందులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపండి. సమస్య ఉన్న చోట ఈ మిశ్రమంతో మసాజ్ చేసి ఒక గంట తరువాత చల్లని నీటితో కడిగేయండి. కొత్తిమీర ఆకుల పేస్ట్, నిమ్మరసం యాక్నే, బ్లాక్ హెడ్స్ నుండి రిలీఫ్ ని ఇస్తాయి.

గ్లోయింగ్ లిప్స్:

Health Benefits of Corianderపెదవుల మీద నుండి డెడ్ సెల్స్ ని తొలగించి మీ లిప్స్ చక్కగా మెరుస్తూ ఉండేలా చేస్తుంది కొత్తిమీర. రెండు టీ స్పూన్ల కొత్తిమీర జ్యూసులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలపండి. రోజూ రాత్రి నిద్ర కి ముందు పెదవులకి అప్లై చేసి పడుకోండి. ఇలా కనీసం ఒక వారం పాటు చేయండి.

ముడతలు తగ్గిస్తుంది:

Health Benefits of Corianderకొత్తిమీర ఆకులు ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి పిగ్మెంటేషన్, రింకిల్స్, లూజ్ స్కిన్ వంటి అనేక స్కిన్ ప్రాబ్లమ్స్ ని ప్రివెంట్ చేస్తాయి. దానికోసం కొత్తిమీర ఆకులూ, అలోవెరా జెల్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR