కరివేపాకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కరివేపాకు ఒక సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. కరివేపాకును తెలంగాణల కళ్యామాకు అంటారు. ఇది ఎక్కువగా ఇండియా, శ్రీలంకలలో కనిపిస్తుంది. కూర, చారు, పులుసు, వగైరా వంటకాలలో సువాసనకోసం దీనిని వాడుతారు. క‌రివేపాకు లేకుంటే కూర‌కు రుచి, వాస‌న రాదు. అందుకే చాలామంది గృహిణులు క‌రివేపాకు లేకుండా వంట చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కేవ‌లం రుచి, వాస‌న‌కే కాదు. క‌రివేపాకులో ఎన్నో పోష‌కాలు ఉంటాయి.

కరివేపాకుఅయితే వాటి గురించిన అవగాహన లేక తినేప్పుడు తేలిగ్గా క‌రివేపాకును తీసిపారేస్తుంటాం. కానీ క‌రివేపాకు తింటే క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే అలా తీసిపారేయాలంటే ఆలోచిస్తారు. రోజూ ఆహారంలో తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అధిక చెమటతో తడిసి ముద్దయ్యేవారు పెరటి మొక్క “కరివేపాకు” ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. కరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. అలాగే చెమట చెడువాసను కూడా తగ్గిస్తుంది.

కరివేపాకుక‌రివేపాకులో ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. ఫోలికామ్లం, నియాసిన్‌, బీటా కెరోటిన్‌, ఇనుము, కాల్షియం, పీచు, మాంస‌కృత్తులు, కార్బొహ్రైడేట్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి. జీర్ణ‌క్రియ స‌జావుగా సాగేందుకు, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించేందుకు పీచు స‌హ‌క‌రిస్తుంది. కొద్దిగా క‌రివేపాకు మిశ్ర‌మాన్ని గ్లాసులో మ‌జ్జిగలో చిటికెడు ఇంగువ‌, క‌రివేపాకు, కాస్త సొంపు క‌లిపి తాగితే అజీర్తి స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.

కరివేపాకుకరివేపాకు చెట్టులోని ఆకులు, బెరడు, వేరు, గింజలు, పువ్వులు.. అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినట్టివే. వగరుగా ఉన్నప్పటికీ సువాసనా భరితంగా ఉన్న కరివేపాకులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది. ఇది శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ముఖ్యంగా అనీమియా (రక్తహీనత) వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు. కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది.

కరివేపాకుక‌రివేపాకులో విట‌మిన్ ఏ పుష్కలంగా ల‌భిస్తుంది. ఇది కంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. ప్ర‌తిరోజూ తినే ఆహారంలో క‌రివేపాకు వేయ‌డం వ‌ల్ల వ‌య‌సు పెరిగే కొద్దీ వ‌చ్చే క్యాట‌రాక్ట్ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. క్ర‌మం త‌ప్ప‌కుండా క‌రివేపాకును తిన‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర‌స్థాయులు అదుపులో ఉంటాయి. కరివేపాకులోని యాంటీ హైప‌ర్ గ్లెసెమిక్.. ర‌క్త‌నాళాల్లోని గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. త‌ద్వారా మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది. రోజూ ఆహారంలో క‌రివేపాకును తిన‌డం వ‌ల్ల బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. రోజూ నాలుగు ప‌చ్చి క‌రివేపాకు ఆకుల్ని న‌మ‌ల‌డం వ‌ల్ల కొవ్వుస్థాయులు త‌గ్గుతాయి.

కరివేపాకుకరివేపాకు పొడిని తేనెతో కలిపి తీసుకుంటే రక్తవిరేచనాలు, జిగట విరేచనాల్లో ఉపశమనం లభిస్తుంది. కడుపుబ్బరింపు, కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరింపు, మంట వంటివి తగ్గుతాయి. కరివేపాకు కాయల రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి కీటకాలు కుట్టినచోట ప్రయోగిస్తే నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి లక్షణాలు తగ్గుతాయి. దద్దుర్లు కూడా తగ్గుతాయి.

కరివేపాకు‌క‌రివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యూరిన్‌, బ్లాడ‌ర్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. క‌రివేపాకు రసంలో కొంచెం దాల్చిన చెక్క పొడి క‌లుపుకుని తాగ‌డం ద్వారా మూత్ర సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారించ‌వ‌చ్చు. కిడ్నీ స‌మ‌స్య‌ల‌ను కూడా క‌రివేపాకు దూరం చేస్తుంది. వేపాకు, క‌రివేపాకును స‌మ‌పాళ్ల‌లో తీసుకుని ఒక ముద్ద చేసుకుని.. రోజూ అర‌క‌ప్పు మ‌జ్జిగ‌తో తీసుకుంటే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్యలు దూర‌మ‌వుతాయి. చ‌ర్మంపై ద‌ద్దులు త‌గ్గుతాయి. క‌రివేపాకు మిశ్ర‌మానికి ప‌సుపు క‌లిపి చ‌ర్మానికి పూసుకోవ‌డం ద్వారా చ‌ర్మ‌పు మంట‌లు త‌గ్గుతాయి.

కరివేపాకులేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆర్శమొలల్లో ఉపశమనం లభిస్తుంది. లేదా కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచిదే. దీనివల్ల మలబద్ధకం తగ్గిపోయి ఫైల్స్ బాధ తగ్గుతుంది. కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది.

కరివేపాకుకొబ్బ‌రి నూనెలో క‌రివేపాకు వేసి వేడి చేయాలి. దీన్ని చ‌ల్లార్చి త‌ల‌కు ప‌ట్టించి మ‌ర్ద‌న చేయాలి. 20 నిమిషాల త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల జుట్టు ఊడే స‌మ‌స్య త‌గ్గుతుంది. కొంద‌రిలో చిన్న‌ప్పుడే తెల్ల జుట్టు వ‌స్తుంది. ఆ స‌మ‌స్య‌కు కూడా క‌రివేపాకు చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. కొంచెం కొబ్బ‌రి నూనెలో మెంతికూర‌, వేపాకు, క‌రివేపాకు వేసి చిన్న మంట‌పై వేడిచేయాలి. దీన్ని చ‌ల్లార్చి ప‌డుకునే ముందు త‌ల‌కు ప‌ట్టించాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల జుట్టు నెర‌వ‌కుండా న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR