Home Health మందారం టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మందారం టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

మందారం జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని తెలిసిందే. మందారంలోని ఔషద గుణాల వల్ల అద్బుత ప్రయోజనాలున్నాయి. మందారం అందానికి, ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మందారం పువ్వులు , ఆకులు మాత్రమే కాదు మందారం టీ కూడా మంచి ఔష‌దంగా ప‌ని చేస్తుంది. మరి మందారం టీ ఉపయోగాలు ఏంటో అది ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Benefits of Drinking Hibiscus Teaమందార టీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి గుండె వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతాయి.

మందార టీలో విటమిన్ సి, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మందార టీ షుగర్ వ్యాధితో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

మందార టీ బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి మందార టీని సేవిస్తారు. మలబద్దకాన్ని తగ్గించి జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో బరువు తగ్గుతారు.

మందార టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ తో పోరాడి కాన్సర్ ను రాకుండా చేస్తుంది. హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో మందారం టీ ఒక నేచురల్ రెమెడీ. కొన్ని వారాల పాటు ప్రతి రోజు మూడు కప్పుల టీని త్రాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

మందార పువ్వుల టీ తాగ‌డం వ‌ల్ల లివ‌ర్ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇది లివర్‌లో ఉన్న కొవ్వు కరిగిస్తుంది. మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

 

Exit mobile version