Home Health ఆస్తమా వచ్చినప్పుడు కనపడే లక్షణాలు మరియు నివారణ మార్గాలు

ఆస్తమా వచ్చినప్పుడు కనపడే లక్షణాలు మరియు నివారణ మార్గాలు

0

ఆస్తమా ఉన్న వ్యక్తులు ముఖ్యంగా ఊపిరి ఆడకపోవడం, శ్వాస రాకపోవడం వాటిని సాధారణంగా అనుభూతి చెందుతారు. ఆస్తమా స్వల్పంగా ఉన్న సందర్భంలో, ఒక వ్యక్తి నిద్రలో ఊపిరి పీల్చుకున్నప్పుడు సాధారణంగా గురక వస్తుంది. ఆస్తమా ఎక్కువగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఊపిరి తీసుకున్నప్పుడు కూడా గురక శబ్దం వస్తుంది.

Symptoms of asthmaసిస్టిక్ ఫైబ్రోసిస్, గుండె ఆగిపోవడం, మరియు స్వర తంత్రి పనిచేయకపోవడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలలో కూడా గురక ఉంటుంది. అందువల్ల, వేర్వేరు పరిశోధనలు ద్వారా ఆస్తమాను నిర్ధారించడం ముఖ్యం.

దగ్గడం అనేది ఆస్తమా యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి, ముఖ్యంగా వ్యాయామం ప్రేరిత ఆస్త్మా మరియు నిద్రలో వచ్చే ఆస్తమాలలో. ఇది పొడిగా ఉంటుంది.

ఛాతిలో బిగుతైన అనుభూతి లేదా ఛాతిలో నొప్పి అనేది కొన్నిసార్లు ఆస్తమా యొక్క ఏకైక లక్షణం, ముఖ్యంగా నిద్రలో వచ్చే ఆస్తమాలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

ఆస్తమాకు ఎటువంటి నివారణ చికిత్స లేదు, దానికి కారణమైన ఆ వ్యాధి కారకాలను అన్వేషించి – వాటిని నియంత్రించటానికి & పరిమితం చేయడం ద్వారా ఆస్తమాకు దూరంగా ఉండవచ్చు. ఆస్తమాను నివారించడానికి ఆచరణీయమైన అనేక విషయాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆస్తమాను నివారించ గల కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేమిటో మనము చూద్దాం.

తేమను నివారించండి :

ఆస్తమాను నివారించడానికి నాణ్యమైన గాలి చాలా ముఖ్యం. అధిక వేడి, తక్కువ నాణ్యతను కలిగిన గాలి & తేమను కలిగిన వాతావరణం చాలా మంది ప్రజలలో ఆస్తమా లక్షణాలను ప్రేరేపించగలవు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చగలదు, కాబట్టి మీరు గదిలో ఉన్న తేమను తగ్గించడానికి ఎయిర్ కండీషనర్ను ఉపయోగించడం చాలా అవసరం.

దుమ్ముకు దూరంగా ఉండాలి:

ఆస్తమాను కలుగజేసే వాటిలో ధూళి అత్యంత సాధారణమైన అంశాలలో ఒకటి ఎందుకంటే, ఇది పుప్పొడి రేణువులు అనబడే చిన్న కణాలను ఫైబర్ను కలిగిన దుస్తులలోనూ, మోల్డ్ & డిటర్జెంట్ల వాటిలోనూ కలిగి ఉంటాయి. ధూళిని కలిగి ఉన్న దుప్పట్లు, ఫర్నిచర్ వంటి మొదలైనవి ఆస్తమాకి కారణమయ్యే మరొక అలెర్జీలని చెప్పవచ్చు. మీ పడకగదిలో ధూళికి ఆవాసంగా ఉన్న తివాచీలను, పరుపులను, భారీ కర్టెన్లను శుభ్రపర్చడానికి వేడి నీటిలో బాగా ఉతకండి, అలానే ఆస్తమాను నివారించడానికి మీ ఇంటిని వారంలో 2సార్లు బాగా శుభ్రం చేసుకోండి.

మోల్డ్ & బూజులను నివారించండి :

మోల్డ్ & బూజులు వంటివి ఆస్తమాను కలగజేసే ప్రతికూల లక్షణాలుగా ఉంటాయి. మోల్డ్ అనేది కర్టన్లు, తొట్టెలు, హరివాణాలు, టైల్స్ & స్నానపు గదిలో వాడే వస్తువుల వల్ల విజృంభిస్తోంది. మీరు మీ వంటగది, బాత్రూం వంటి తడి ప్రదేశాలకు దూరంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. మీరు బాత్రూం, వంటగది & ఇంటి చుట్టూ తడిగా ఉన్న ప్రదేశాలను క్రమం తప్పకుండా శుభ్రపరచుకోవాలి.

స్మోకింగ్ మానుకోండి :

మీరు ఆస్తమాతో బాధపడుతున్న వారైతే, స్మోకింగ్ అనేది ఊపిరితిత్తులను చికాకు పెడుతుంది. స్మోకింగ్ ఆస్తమాను ప్రేరేపించగలదు కాబట్టి, ఎక్కువగా పొగతాగేవారికి మీరు దూరంగా ఉండటం మంచిది. స్మోకింగ్ వల్ల దగ్గు, గురక వంటివి ఏర్పడి, మీ పరిస్థితిని మరింత అధ్వానంగా మారుస్తుంది. ధూమపానానికి అనుమతించే బహిరంగ ప్రదేశాలకు, స్మోకింగ్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి. మీరు వంటలు చేసేటప్పుడు వచ్చే పొగను నివారించడానికి వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ను ఉంచడం చాలా మంచిది.

పెంపుడు జంతువులకు దూరంగా ఉండండి :

పెంపుడు జంతువులు ఆస్తమాతో ప్రేరేపించగలవు. అది ఎలాగో మీకు తెలుసా? ఎందుకంటే వాటి జుట్టు, బొచ్చు, ఈకలు & లాలాజలం వంటివి ఆస్తమాను కలుగజేసే సాధారణ కారకాలు. మీ గదికి దూరంగా – మీ పెంపుడు జంతువులను ఉంచుకోవడం చాలా అవసరం, అలాగే మీ ఇంట్లో ఉన్న ఫర్నిచరు పై పెంపుడు జంతువులు ఉండకుండా చూసుకోవడం వంటివి ఆస్తమాను నిరోధించే కొన్ని చిట్కాలు.

మీరు తీసుకునే ఆహారంలో మార్పులు :

ఆస్తమాతో ఉన్నవారు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ C, విటమిన్ E, బీటా-కెరోటిన్, ఫ్లేవానాయిడ్స్, మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు & సెలీనియములు అధికంగా ఉండే ఆహారాలు ఆస్తమాతో బాధపడుతున్న వారికి చాలా మంచిది. సేంద్రీయమైన పండ్లను, కూరగాయలను పుష్కలంగా తీసుకోండి, అవిసె గింజలు, సాల్మన్ & ట్యూనా చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగిన వాటిని ఆహారంగా తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహారాలను & పాల ఉత్పత్తులను తినడం మానుకోండి.

కఠినమైన వ్యాయామం తగ్గించండి :

వ్యాయామం చేసే వారిలో చాలామంది ఆస్తమాతో బాధపడుతున్నారు. తీవ్రమైన & కఠినమైన దీర్ఘకాలిక వ్యాయామాలు ఆస్తమాను ప్రేరేపించగలవు, కాబట్టి మీ గుండె మరియు ఊపిరితిత్తులలో ఒత్తిడిని తెచ్చే వ్యాయామాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. యోగా, చురుకైన వాకింగ్, సున్నితమైన బైకింగ్, స్విమ్మింగ్, వెయిట్ ట్రైనింగ్ల వంటి వాటిని సాధన చేయడానికి ప్రయత్నించండి.

 

Exit mobile version