మునగాకులో ఉండే ఔషద గుణాలు గురించి తెలుసా ?

0
283

అద్భుతమైన పోషక విలువలు వుండటంతోపాటు అమోఘమైన ఔషధ లక్షణాలు కూడా వున్న మునగ ఆకు గొప్పతనం చాలామందికి తెలియదు. ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనం తరచూ తీసుకునే ఆకుకూరల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వాటిలో మునగాకు ముందుంటుంది. మునగాకు లోని ఔషధోపయోగాల గురించి తెలుసుకుందాం.

Drumstick treeమునక్కాయలు సాంబారులోనో, టమాటాలోనే వేసుకుని తింటాం. వాటివల్ల కొన్ని ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మునక్కాయ కంటే మునగాకే చాలా మంచిదని తెలుసుకోవాలి. ములక్కాయలో రుచి మాత్రమే వుంది. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మునగాకుతో వండిన కూరలు మరీ అంత రుచిగా వుండకపోవచ్చు. కానీ, అది అందించే ఆరోగ్యం మాత్రం అపారం.మునగాకులు 300 రకాల వ్యాధులను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నాయి.

Drumstick treeవీటిని పొడి చేసుకునో లేక, కూరల్లో కలుపుకుని వండుకునే అలవాటు చేసుకుంటే మంచిదంటున్నారు. అంతెందుకు మన పూర్వీకులు ఈ ఆకులను నాలుగువేళ ఏళ్ల క్రితం నుంచి ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి.

Drumstick treeబాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లో కలుపుకుని తాగితే మూత్రవిసర్జనలో మంట, మూత్ర పిండాల వ్యాధులు, మలబద్దకం తగ్గిపోతాయి.

ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును .

మునగాకు రసములో నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంత వరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి, దురద వంటి చర్మవ్యాధులకు పైపూత మందుగా రాస్తే చర్మవ్యాధులు తగ్గిపోతాయి.

Drumstick treeమునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు, బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును. మునగాకు రసములో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అవుతాయి.

మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది.

మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి.

 

SHARE