Home Health నల్ల నువ్వులు తినడం వలన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా ?

నల్ల నువ్వులు తినడం వలన ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా ?

0
నల్ల నువ్వులు

పురాతన రోజుల్లో పల్లెల్లో నువ్వుల నూనెను వంటల తయారీలో వాడేవారు. నువ్వులతో మనం అనేక రకాల స్వీట్లు తయారు చేసుకుంటాం. నువ్వుల నూనెను వంటకాల్లో, దీపారాధనకు ఉపయోగిస్తాం. కానీ ఇపుడు నూనె కాదు కదా కనీసం నువ్వులు కూడా కంటికి కనిపించడం లేదు. నువ్వుల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో నువ్వులు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో సైతం అరుదుగా కనిపిస్తున్నాయి.

నువ్వులు తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నల్ల నువ్వులు తింటే ఇంకా మంచిది. వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో పోషకాలు మెండు. అందుకే వీటిని ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటుంది.

నువ్వుల్లో అధిక శాతం జింక్, కాల్షియంలు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అందుకే ఎముకుల దృఢత్వం కోసం నువ్వులను ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఓ టీ స్పూన్ నువ్వులను బెల్లంతో ఆరగించినట్టయితే ఎముకలకు, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలు పూర్తిగా మటుమాయమైపోతాయి.

చాలా మందిలో విటమిన్ బి, ఐరన్ లోపం వల్ల జ్ఞాపకశక్తి మందగించడం, జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుంటుంది. వీటిని తగ్గించడానికి నల్ల నువ్వులు దోహదపడుతాయి. నల్ల నువ్వులు తింటే కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. పేగు కేన్సర్ రాకుండా ఉంటుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును తగ్గిస్తూ కేన్సర్ కణాలను వృద్ధి చెందకుండా చేస్తుంది.

నువ్వుల్లోని సిసేమిన్ లివర్ దెబ్బతినకుండా రక్షిస్తుంది. దీనిలోని పీచు, అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇందులోని నూనె పేగులు పొడిబారకుండా చూస్తాయి. వీటిని మెత్తగా రుబ్బి తీసుకున్నట్లయితే కడుపులోని నులిపురుగులు బయటకు వెళ్లిపోతాయి. నువ్వులలోని మెగ్నీషియం బీపీని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది. నువ్వులు ఫైబర్‌ను కలిగి ఉంటాయి. వీటినే లిగ్నిన్స్ అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులు రోజు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది.

నువ్వుల నూనె వాడటం వల్ల చాలా తక్కువగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఇందులోవుండే మినరల్స్ హృదయనాళాలను చురుకుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానటంలో చాలా సహాయం చేస్తుంది. నువ్వులల్లో ఉండే మూలాశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్‌ని నల్ల నువ్వలు తగ్గిస్తాయి.

నువ్వుల విత్తనాలనుండి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను, మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఈ నువ్వుల్లో ఉండే పోషకాల వల్ల వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.

స్త్రీలలో హార్మోన్ల సమస్యకు నువ్వులు చక్కని పరిష్కారం. నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటి పెంచడంలో గ్రేట్ గా సహాపడుతాయి. ఇవి ఆస్త్మా, బ్రొకైటిస్, జలుబు, దగ్గు, వంటి అనారోగ్య సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

సాధారణంగా ఆడవారిలో 35 యేళ్లు దాటితే ఎముక బరువు క్రమంగా తగ్గుతుంది. మెనోపాజ్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే కాల్షియం, జింక్ ఎక్కువగా ఉండే నల్లనువ్వులను ఆహారంలో భాగంచేసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులు నల్ల నువ్వులు తింటే చాలా మంచిది.

 

Exit mobile version