క్యాబేజీ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ?

కొంతమంది క్యాబేజి పేరు వినగానే ముఖం చిత్లించుకుంటారు. దాన్ని తినడాన్ని ఇష్టపడరు. కానీ ఇందులోని పోషకాల గురించి తెలిస్తే క్యాబేజీని వదిలిపెట్టరు. రెగ్యులర్‌గా క్యాబేజీని తినడం వల్ల ఎన్నో సమస్యలను అదుపులోకి తెచ్చుకోవచ్చు. విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉన్న క్యాబేజీ గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా కలిగి ఉన్న క్యాబేజీ గుండెజబ్బుల నుంచి రక్షిస్తుంది.

health benefits of eating cabbageక్యాబేజీలో విటమిన్ ఎ, రిబోఫ్లేవిన్, ఫోలేట్, బి౬లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండా చేస్తుంది. రక్తములో చక్కెర స్థాయి సమతుల్యము చేస్తుంది. ముఖ్యంగా కాన్సర్ నిరోధకంగా క్యాబేజీ తినొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

health benefits of eating cabbageక్యాబేజీని తినడం వల్ల అధికబరువు, కండరాల నొప్పులు తగ్గించి జుట్టు పెరుగుదల పెరుగుతుంది. క్యాబేజ్ లోని బీటా కెరోటిన్ కంటెంట్ కళ్ళులోపల మచ్చల క్షీణత నివారణకు సహాయపడుతుంది. క్యాబేజ్ లో అమినో యాసిడ్స్ గొప్పగా ఉండటం వల్ల ఇది మంటను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అంతేకాదు పొటాషియం ఎక్కువగా ఉన్న క్యాబేజీని తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య తగ్గుతుంది.

health benefits of eating cabbageక్యాబేజీని ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని వైద్యులు చెబుతున్నారు. క్యాబేజ్ మొత్తాన్ని ఉడికించినా అందులో 33 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. క్యాబేజ్ లో అధికంగా ఫైబర్ కంటెంట్ మలబద్దకం నుండి ఉపశమనం అంధించడంలో సహాయపడుతుంది.

health benefits of eating cabbageక్యాజేజీ దగ్గుకు కూడా మంచి మందుగా పనిచేస్తుంది. క్యాబేజీ ఆకులను నమిలినా లేదా క్యాబేజీ ఆకుల రసం తీసి తాగిన దగ్గు మటుమాయమవుతుంది. క్యాబేజీ ఆకుల రసాన్ని అలాగే తాగలేనివారు కాస్త పంచదార కలుపుకుంటే సరి.

health benefits of eating cabbageపిల్లలకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా క్యాబేజీని తిన్నట్లయితే పాలు బాగా పడతాయి. క్యాబేజ్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, వృద్ధాప్య గుర్తులకు దారితీసే ఫ్రీరాడికల్స్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. కంటి శుక్లాలు రాకుండా దూరంగా ఉంచతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR