చేపలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0
217

చికెన్, మటన్ వంటి మాంసాహారంతో పోలిస్తే చేపల్లో ఉండే కొవ్వులు మంచి గుణాలను కలిగి ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు మన శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా ప్రోత్సహిస్తాయి. రోజూ చేపలు తినటం మధ్యవయసు దాటిన పురుషులకు ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పుడప్పుడు మాత్రమే చేపలు తినేవారితో పోలిస్తే.. రోజూ చేపలు తీసుకునేవారిలో గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం వంటి ముప్పు కారకాలు తక్కువగా ఉంటున్నాయని అంటున్నారు.

Health Benefits of Eating Fishవయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.

Health Benefits of Eating Fishచేపలలో శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉండవు. అందువల్ల ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. చికెన్, మటన్లలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొలెస్ట్రాల్ ఉంటుంది. అందుకే ఇతర మాంసాహారాల ద్వారా అందే ప్రోటీన్లు కాకుండా, చేపల ద్వారా అందే ప్రోటీన్లను తీసుకోవడం మంచిది. చేప నూనె మాత్రలు అధిక రక్తపోటుతో పాటు గుండెజబ్బు మూలంగా వచ్చే మరణాలనూ తగ్గిస్తాయని చెబుతున్నారు.

Health Benefits of Eating Fishసాల్మన్, ట్రౌట్, సార్డినెస్, ట్యూనా, మాకేరెల్ వంటి చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి అందుతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్లు మెదడు, కళ్ల పనితీరును మెరుగుపరుస్తాయి.

Health Benefits of Eating Fishగర్భిణులు తరచూ చేపలను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. గర్భిణీలు, పిల్ల తల్లులు వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. ముఖ్యంగా.. డెలివరీ అయినవారు తినడం వల్ల పిల్లలకు పాలు సరిపడనంతగా వస్తాయి. అదే విధంగా వారికి శక్తి అందుతుంది. వీటిని తీసుకోవడం వల్ల పాలవృద్ధితో పాటు వ్యాధి నిరోధక శక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది.

SHARE