బెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వర్షాకాలం వచ్చేసింది ఎన్నో ఆరోగ్య సమస్యలను మోసుకొస్తుంది. శరీరంలో వేడి తగ్గి, చలికి అనేక వ్యాధుల బారిన పడుతుంటారు. దీనికి తోడు చల్లటి వాతావరణం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు పొంచి ఉంటాయి. వీటినుండి బైటపడడానికి వేడిసూప్ లు, శరీరంలో వేడి పుట్టించే ఆహారపదార్థాలు తినాల్సి ఉంటుంది. అందులో పల్లి పట్టి ముందుటుంది. పల్లీల్లో ఉండే సుగుణాలు, బెల్లంలోని ఆరోగ్య లక్షణాలు వర్షాకాలంలో శరీరంలో వేడి పుట్టించి జబ్బులకు దూరంగా ఉండేలా చేస్తుంది. పల్లీల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సినన్ని పోషకాలు ఉంటాయి. బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలవడం వల్ల శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. పల్లీల చిక్కి ఎంతో రుచికరమైన స్నాక్ ఐటమ్. ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు చెయ్యండి. వారు చాలా పుష్టిగా అవుతారు. ఇక ఈ పల్లీల చిక్కి వల్ల ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.

పల్లి పట్టిబెల్లం, వేరుశనగలు కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. బెల్లంతో కలిపి వీటిని తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది. పల్లీలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటంతోపాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

పల్లి పట్టిషుగర్ పేషెంట్లు మినహా మిగతావారు రోజుకు 20 గ్రాముల బెల్లం తింటే శరీరానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఇనుము, కాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. ఈ కాలంలో బెల్లం, వేరుశనగ కలిపి తింటే బోలెడు ప్రయోజనాలుంటాయి.

పల్లి పట్టిబెల్లం, వేరుశనగలను తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా తినొద్దు.

పల్లి పట్టిపల్లీ ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. దీంతో మీ ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. వేరుశనగలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు దూరం అవుతాయి.

పల్లి పట్టిబెల్లంలో ఉండే కాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృడంగా మారతాయి. కాబట్టి ఏంచక్కా పల్లీ చిక్కీలను తినేయండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. డాక్టర్ వద్దంటే మాత్రం వీటి జోలికి వెళ్లకండి.

పల్లి పట్టిఇంతకూ ఈ వేరుశనగ ఉండలు చేసుకోవడం ఎలాగో తెలీదా? చాలా సింపుల్.. అర కిలో వేరుశనగలు, అర కిలో బెల్లం తీసుకోండి. వేరుశనగ గింజలను వేయించి పొట్టు తీసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి దళసరిగా ఉండే గిన్నె పెట్టి.. అందులో బెల్లం.. కొద్ది మోతాదులో నీరే వేసి.. చిక్కగా పాకం పట్టుకోండి. తర్వాత వీటిలో వేరుశనగ గింజలు కలిసేలా తిప్పాలి. ఓ ప్లేట్‌కి నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని అందులోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండల్లా చుట్టుకోవాలి లేదా ముక్కల్లా కత్తిరించుకోవాలి. చల్లారిన తరువాత స్టోర్ చేసుకొని రోజు తినొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR