రామఫలం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

సీజనల్ పండ్లలో కొన్ని పండ్లది ప్రత్యేక స్థానం. మామిడి పండ్లు, సీతాఫలాలు అందులో ముందు వరసలో ఉంటాయి. వీటి రుచి ఆస్వాదించడానికి సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ కోవకే చెందుతాయి. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణఫలాలు. ఈపేర్లు చూస్తే మన పురాణ పురుషులకు ఇష్టమైన పండ్లేవో అనిపించకమానదు. అంతేకాదు, ఇవి అచ్చంగా మనకి మాత్రమే ప్రత్యేకమైన పండ్లేనేవో అనిపిస్తుంది.

Health Benefits Of Eating Ramphalకానీ వీటి స్వస్థలం మనదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికన్‌ దేశాల్లో పెరిగే ఈ వెుక్కల్ని మనదేశానికి తొలిసారిగా పోర్చుగీసువాళ్లు పదహారో శతాబ్దంలో తీసుకొచ్చారట. ముఖ్యంగా మనరాష్ట్రంలో ఎక్కువగా పండే సీతాఫలాలతో మనకి అనుబంధం ఎక్కువ. కానీ ఉత్తరాంధ్ర, కొన్ని తెలంగాణా జిల్లాల్లోనూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ రామాఫలాలు, లక్ష్మణఫలాలు ఎక్కువగా పండుతాయి.

Health Benefits Of Eating Ramphalఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలుచోట్ల ఈ ఫలాలు విరివిగా దొరుకుతున్నాయి. సూపర్‌మార్కెట్ల పుణ్యమా అని ఇప్పుడిప్పుడు ఇవి అన్ని మార్కెట్లిలోనూ కనిపిస్తున్నాయి. గుండ్రంగా హృదయాకారంలో ఎరుపురంగులో ఉండే ఈ పండ్ల తొక్క సీతాఫలంకన్నా నునుపుగా ఉంటుంది. దీన్ని నెట్టెడ్‌ కస్టర్డ్‌ యాపిల్‌, బుల్లక్‌ హార్ట్‌, బుల్‌ హార్ట్‌ అని కూడా పిలుస్తారు. సీతాఫలంతో పోలిస్తే ఇందులో గింజలు తక్కువ. ఆయుర్వేద వైద్యులు కూడా ఈ ఫలంలో వైద్యగుణాలు ఉన్నాయని, మానసిక ఉత్తేజాన్ని పెంచుకోవడం కోసం దీనిని భుజించవచ్చని చెబుతుంటారు. అలసిన శరీరానికి ఉత్తేజాన్ని కలిగించడానికి ఈ బులక్స్ హార్ట్‌ని పశ్చిమదేశాల్లో క్రీడాకారులు జ్యూస్‌గా చేసి తాగుతుంటారట.

Health Benefits Of Eating Ramphalమిగిలినవాటితో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్‌ వ్యాధులకు కారణమైన కణాలను నివారించే గుణం కూడా ఈ పండుకి ఎక్కువే. 100 గ్రా. రామాఫలం నుంచి 75 క్యాలరీల శక్తి, 17.7గ్రా. కార్బొహైడ్రేట్లు, 1.5గ్రా. ప్రొటీన్లు, 3గ్రా. పీచూ లభ్యమవుతాయి. సి- విటమిన్‌తో పాటు బి-కాంప్లెక్స్‌లోని పైరిడాక్సిన్‌ ఇందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్‌ మెదడు కణాలకు అవసరమైన రసాయనాల్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి వంటివి రాకుండా కాపాడేందుకు తోడ్పడుతుంది.అలాగే రామఫలం ఆకులను యాంటీ అల్సర్ ట్రీట్‌మెంట్‌కి వాడుతుంటారు.

Health Benefits Of Eating Ramphalరామ ఫలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ, జుట్టు సమస్యలను నివారించడంలో నిజంగా రామఫలం దానికదే సాటి. రామ ఫలంలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు తలలో దురద తగ్గిస్తుంది. దాంతో తలలో దురద, చీకాకును తొలగిస్తుంది. రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల ఇది తలలో దురద తగ్గిస్తుంది. తలను శుభ్రం చేసి, చుండ్రు సమస్యను నివారించడంలో రామఫలం గ్రేట్ గా పనిచేస్తుంది. రామఫలంను పేస్ట్ చేసి, తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు చుండ్రును ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

Health Benefits Of Eating Ramphalమొటిమలను నివారించడంలో రామ ఫలంగా గ్రేట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు, చర్మ సమస్యలను నివారిస్తుంది. స్కిన్ కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ముఖంలో ముడతలు, మచ్చలు, చారలు వంటి ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవాలంటే రెగ్యులర్ స్కిన్ కేర్ లో రామఫలం చేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఫలంలో ఉండే యాంటీఆక్సిడెంట్ ఏజింగ్ లక్షణాలకు దారితీసే ఫ్రీరాడికల్స్ తో పోరాడటంలో ముఖ్య పాత్రపోషిస్తుంది.

Health Benefits Of Eating Ramphalరామఫలం ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అయినా నివారిస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ లేదా ఎగ్జిమాను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కొద్దిగా రామఫలం పేస్ట్ తీసుకుని, లేదా రామఫలం వాటర్ తీసుకుని,ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. రామ ఫలంలో విటిమన్ సి మరియు ఆస్కార్బిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఇది చర్మం కాంతి పెంచడంలో, హైపర్ పిగ్మెంటేషన్ నివారిచండంలో ప్రధాణ పాత్ర పోషిస్తుంది. మీ చర్మం నల్లగా మారినా ఇతర సమస్యలున్నా, రామఫలం జ్యూస్ కు కొద్దిగా కొబ్బరినూనె మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. రాత్రుల్లో అప్లై చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది, తర్వాత రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR