ఎప్సమ్ సాల్ట్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కరోనా విజృంభిస్తున్న వేళ చాలా మందికి ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకడం లేదు. చాలా వరకు ఇంట్లోనే ఉండి మెడిసిన్ వాడుతున్నారు. అయితే కరోనా రోగుల్లో సగం మందికి వొంటి నొప్పులు అనేది ఉంటుంది. నొప్పులు భరించలేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. కానీ పెయిన్ కిల్లర్స్ మన ఆరోగ్యానికి మంచివి కాదు కాబట్టి నేచురల్ గా నొప్పులు తగ్గించుకొనే ప్రయత్నాలు చేయాలి. అందులో భాగమే ఈ ఎప్సమ్ ఉప్పు.

ఎప్సమ్ సాల్ట్ఉప్పు గురించి తెలియని వారు ఉండరు ప్రతిఒక్కరికి ఉప్పు మీద అవగాహన ఉంటుంది. ఉప్పు లేకుండా ఆహారాన్ని తినలేం. అయితే సాధారణ ఉప్పు కాకుండా ఎప్సమ్ ఉప్పు గురించి చాలా మందికి తెలియదు ఆయుర్వేదపరంగా ఈ ఎప్సమ్ ఉప్పు చాలా మేలు చేస్తుంది. అదేంటో తెలుసుకుందాం.

ఎప్సమ్ సాల్ట్మెగ్నీషియం లోపం, ఆస్తమా దాడులు విరామం లేకుండా ఒక దాని తర్వాత మరొకటి, మలబద్ధకం, క్రమం లేని హృదయ స్పందన, గర్భం సమయంలో అధిక రక్తపోటు, నొప్పి మరియు బెణుకులు నుండి వాపు, మూత్రపిండాలు ఆకస్మికంగా మంట, మూర్ఛలు, బేరియం క్లోరైడ్ విషం, హెర్పెస్ వ్యాప్తి లక్షణాలు చికత్సకు మరియు ఇతర పరిస్థితులకు ఎప్సం సాల్ట్ ను సూచిస్తారు.

ఎప్సమ్ సాల్ట్చాలా తక్కువ రక్తపోటుతో బాధపడుతున్న రోగులలో రక్తపోటును పెంచడానికి మెగ్నీషియం సల్ఫేట్ (Magnesium Sulphate) ప్రధానంగా సూచించబడుతుంది. రక్తంలో తక్కువ మెగ్నీషియం స్థాయిలు, మూర్ఛలు మరియు ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఆరోగ్య సమస్యలతో బాధపడే ఆడ రోగులకు ఇది ఆహార పదార్ధంగా కూడా ఇవ్వబడుతుంది. మూత్రపిండాల వాపుల చికిత్స కోసం లేదా ముఖ్యంగా చిన్న పిల్లలలో మెదడు మరియు నరాల యొక్క సరైన పనితీరు కోసం మెగ్నీషియం సల్ఫేట్ (Magnesium Sulphate) ను ఉపయోగించవచ్చు.

ఎప్సమ్ సాల్ట్ఎప్సమ్‌ సాల్ట్‌ – మెగ్నీషియం సల్ఫేట్ దీన్ని వంటకాలలో వాడరు. మందులషాపులలో దొరుకుతుంది. స్నానం చేసే నీటిలో కలిపి వాడితే శారీరక నొప్పులు తగ్గుతాయి. కండరాలను సడలిస్తుంది. చర్మముపై మృతకణాలను తొలగిస్తుంది.

ఎప్సమ్ సాల్ట్ఎస్పమ్ సాల్ట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అందులో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. హానికరమైన టాక్సిన్స్ ను తొలగించి ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. ఎప్సమ్‌ సాల్ట్‌లో మెగ్నీషియం సల్ఫేట్‌ ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఒత్తిడిని అరికడుతుంది. ఎప్సమ్‌ సాల్ట్‌ ఆందోళనను తగ్గించి, మనస్సును రెగ్యులేట్‌ చేస్తుంది. ప్రశాంత పరుస్తుంది. గోర్చువెచ్చని నీటిలో ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి, స్నానం చేస్తే ఆందోళన తగ్గి, ఉపశమనం కలుగుతుంది.

ఎప్సమ్ సాల్ట్ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.

ఎప్సమ్ సాల్ట్ఎప్సమ్‌ సాల్ట్‌ ముఖ్యంగా పాదాల వాపును తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఎప్సమ్‌ సాల్ట్‌ను వేసి దాంట్లో కాటన్‌ టవల్‌ను ముంచి పాదాలపై నెమ్మదిగా మర్దన చేస్తే సరిపోతుంది. ఇలా రోజుకు ఓ సారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సమ్ సాల్ట్ఎస్సమ్ సాల్ట్ లోని మెగ్నీషియం సల్ఫేట్ ను తీసుకోవడం వల్ల మంచి జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్యను వారిస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఎప్సమ్ సాల్ట్అయితే ఏదైనా అతిగా వాడకూడదు నొప్పులు ఎక్కువగా ఉంటే కచ్చితంగా డాక్టర్ సలహా మేరకు దీన్ని ఉపయోగించాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,640,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR