Home Health కరోనా మందులో వాడిన గాజు తీగ గురించి తెలుసా?

కరోనా మందులో వాడిన గాజు తీగ గురించి తెలుసా?

0

మన ఇంటి ఆవరణలో పెరిగే ఎన్నో మొక్కల గురించి వాటి ప్రయోజనాల గురించి మనకు తెలియని తెలియదు. కలుపు మొక్కలుగా, పిచ్చి మొక్కలుగా భావించి పీకి పారేస్తుంటాం. కానీ వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అలాగే వాటిని ఆయుర్వేద మందులలో వాడుతూ ఉంటారు. ఆయుర్వేదం మీద నమ్మకం ఉన్న వారికి ఇటువంటి మొక్కల మీద కూడా శ్రద్ధ నమ్మకం కలుగుతాయి.

Health Benefits Of Gaju Teegaఅలా మన ఇంటి చుట్టుపక్కల పెరిగే ఒక మొక్క ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి కానీ వాటి గురించి తెలియక మనం పిచ్చి మొక్కలు అని భావిస్తాం. గాజు తీగ దీనిని బంగారు తీగ లేదా బుట్ట బుడస,తెల్ల జుంకి అని ప్రాంతాన్నిబట్టి పిలుస్తారు. కరోనా కోసం మందు కనిపెట్టిన ఆనందయ్య దానిలో ఈ మొక్కను ఉపయోగించడంతో అందరి దృష్టి దీనిపై పడింది.

ఈ మొక్క ఫాసి ఫ్లోరోసి కుటుంబానికి చెందినది.ఈ మొక్క శాస్త్రీయ నామం ఫ్యాసి ఫ్లోరిడా ఫ్లోరా అని కూడా పిలుస్తారు. ఈ మొక్క హిందీలో జుంకీ లతా అని పిలుస్తారు.ఈ మొక్కకు కాయలు కూడా ఉంటాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులోనూ, పండినప్పుడు ఆరెంజ్ రంగులోనూ ఉంటాయి. జుట్టు వంటి రక్షణ కవచం లోపల కాయలు ఉంటాయి.

మీ చెట్టు పువ్వులు చాలా అందంగా ఉంటుంది పిల్లలు వీటితో ఆడుకుంటూ ఉంటారు ఈ చెట్టు పచ్చికాయలు విష ప్రభావం ఉంటుందని చెబుతున్నారు కానీ కాయలను చికిత్సలో వాడినప్పుడు ఎటువంటి ప్రభావాలు కనిపించకపోవడం గమనించవచ్చు. తీగ వలె పెరిగే ఈ మొక్కలో ఆకులు మరియు వేర్లలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ చెట్టు ఆకుల కషాయాన్ని తాగితే నిద్రలేమి సమస్య తొలగిపోతుంది. ఈ మొక్క ఆకులతో పాటు వేర్లను కూడా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారు. దాదాపు అన్ని ఆయుర్వేద మందుల్లో ఈ మొక్కకు ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే.. ఈ మొక్కను ఆనందయ్య.. ఆయుర్వేద మందులో ఉపయోగించారు. చర్మ వ్యాధులకు, దురదకు, అతి సార వ్యాధికి.. ఈ మొక్క ఆకులనే ఉపయోగిస్తారు.

తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆకును మెత్తని పేస్ట్లా తయారు చేసి నుదుటిపై రాస్తే వెంటనే తల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే చర్మ వ్యాధులు తగ్గటానికి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఆకులతో తయారుచేసిన కషాయాన్ని తాగితే దగ్గు,జలుబు,ఊపిరితిత్తులలో నిమ్ము వంటి సమస్యలు తొలగిపోతాయి.

ఈ ఎండిన మొక్క యొక్క కషాయాన్ని, జలుబు ఛాతిలో పేరుకున్న కఫాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులు మరియు వేర్లలో ఉండే యాంటీబయాటిక్ లక్షణాల వలన అనేక అంతర్గత వ్యాధులను తగ్గిస్తాయి.ఆయుర్వేద మందుల్లో ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది అయితే ఇటువంటి మొక్కలను వాడే ముందు ఆయుర్వేద వైద్య నిపుణున్ని ఒక్కసారి సంప్రదిస్తే మంచిది.

Exit mobile version