Home Health నాలుక రంగును బట్టి ఆరోగ్య సమస్యను ఎలా తెలుసుకోవాలి?

నాలుక రంగును బట్టి ఆరోగ్య సమస్యను ఎలా తెలుసుకోవాలి?

0

ఆరోగ్యం బాగాలేక ఎప్పుడైనా డాక్టర్ దగ్గరకు వెళితే ముందు కళ్ళు, నాలుక చూపించమంటారు. స‌హ‌జంగానే వారు మ‌న క‌ళ్లు, గోర్లు, నాలుక‌ల‌ను ప‌రిశీలించి మ‌న ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఆయా భాగాల్లో వ‌చ్చే మార్పులు, అవి క‌నిపించే రంగుల‌ను బ‌ట్టి వారు రోగి స్థితి గ‌తుల‌ను అంచ‌నా వేస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు రోగుల‌కు చికిత్స చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్ట‌ర్లు నాలుక‌ను చూసే చాలా విష‌యాలు తెలుసుకుంటారు.

Problems That Can Occur If The Tongue Changes Colorsనాలుక రంగును బట్టి మన ఎంత ఆరోగ్యంగా ఉన్నామో చెప్పవచ్చు. అందరూ రోజూ ఉదయాన్నే బ్రష్ చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం నాలుకను పరిశుభ్రం చేసుకోవడం పట్ల అంత శ్రద్ధ వహించరు. ఫలితంగా నోట్లో బ్యాక్టీరియా పెరిగిపోయి అనారోగ్యానికి దారి తీస్తుంది. చూయింగ్‌ గమ్ నమలడం, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నాలుకపై బ్యాక్టీరియా పెరిగి రంగు మారే అవకాశం ఉంది.

నాలుక రంగును బట్టి ఆరోగ్యాన్ని ఎలా అంచనా వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా నాలుక లేత గులాబీ రంగులో ఉండి, తేమగా, మృదువుగా ఉంటుంది. అలా ఉంటే సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అలా కాకుండా నాలుక పాలిపోయి తెల్లగా కనిపిస్తుంటే.. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయి తక్కువగా ఉందని అర్థం. అలాగే ఐరన్ లోపం, ప్రొటీన్ల లోపంతో బాధపడుతున్నారని చెప్పవచ్చు. అలాగే బాడీ డీహైడ్రేషన్ కు గురి అవుతుందన్నమాట.

నాలుక పసుపు రంగులో ఉంటే శరీరానికి కాకావాల్సిన పోపోషకాలు అందడం లేదని అర్థం. నాలుక ఈ రంగు ఉన్నవారికి అజీర్తి సమస్యలు మరియు లివర్ కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. నాలుక ఊదా రంగులో ఉంటే రక్త ప్రసరణ లోపాలు ఉన్నాయని భావించవచ్చు. కొన్ని సందర్భాల్లో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా అవుతుంది. రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఈ సమస్య నుంచి కొంత వరకు బయటపడొచ్చు.

ఒకవేళ మీ యొక్క నాలుక చీజ్ లా ఉంటే లిపల్పిక ఉన్నట్లు అర్థం. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు. స్మోకింగ్ చేయడం వల్ల మన నాలుక బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. దీని వల్ల ఆ నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం. నీలం రంగు నాలుక ఉన్న వారిలో ఎక్కువగా గుండె సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో ఆక్సిజన్ సరిగా లేకపోవడంతో నాలుక నీలం రంగులోకి మారుతుంది

ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉన్నవారికి నాలుక నలుపు రంగులోకి మారుతుంది. అతిగా యాంటీ బయాటిక్స్‌ తీసుకొనే వారిలోనూ నాలుక నలుపు రంగులోకి మారే అవకాశం ఉంది. ధూమపానం, అతిగా టీ, కాఫీలు తాగడం.. నోటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. వీరికి క్యాన్సర్, అల్సెర్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి.

B-12 విటమిన్ లోపం, ఫోలిక్‌ యాసిడ్‌ లోపం వల్ల నాలుక ఎరుపు రంగు లోకి మారుతుంది. దీనివల్ల మన నోరు రుచిని కోల్పోతుంది. నాలుక ఎరుపు మారితే వైరల్ ఇన్ఫెక్షన్లతో జ్వరం వచ్చే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలి. సరైన పోషకాహరం తీసుకోవడమే కాకుండా విటమిన్స్ బాగా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.అప్పుడే బి-12 లోపం పోతుంది.

నాలుక మీద, నోట్లో పుండ్లు ఏర్పడటం రోగ నిరోధక శక్తి తగ్గడానికి సంకేతం. పాల ఉత్పత్తులు, నిమ్మరసం తీసుకోవడం వల్ల అల్సర్లు తగ్గుముఖం పడతాయి. దీర్ఘకాలంపాటు నాలుకకు సంబంధించిన సమస్యలు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అల్సర్లు చాలా కాలం తగ్గకపోవడం ఒక్కోసారి కేన్సర్‌కు సంకేతం కావచ్చు.

 

Exit mobile version