Home Health కీరదోస వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

కీరదోస వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

0

కీరదోస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచు దీనిని తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. దోసకాయలో ఎక్కువగా నీరు, తక్కువ శాతం కేలరీలు ఉంటాయి. అదేవిధంగా ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

Health Benefits of Keeradosaముఖ్యంగా డయాబెటిస్ డైట్‌ లో కీరదోసకాయ ఒకటి. కీరదోస కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను, చక్కెరను తగ్గిస్తుంది. ఈ కారణంగా రక్తంలో చక్కెర ద్వారా వచ్చే సమస్యలను నివారిస్తుంది. బీటాకెరొటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కంటి, చర్మ ఆరోగ్యాన్ని సైతం పరిరక్షిస్తుంది. కీరదోస విత్తనాల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. అలాగే ఖనిజ లవణాలు సైతం దీనిలో ఉంటాయి.

కీరదోస ప్రతి భాగంలో పోషకాలతో నిండి ఉంటుంది. గింజలు, తొక్కలోనూ ఇవి అధికంగా ఉంటాయి. అలాగే కాలరీలతో పాటుగా కార్భోహైడ్రేట్స్, సోడియం, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ ఉంటాయి. కాబట్టి కీరదోస ఆహారంగా తీసుకొంటే.. ఇవన్నీ మన శరీరానికి లభిస్తాయి.

అన్నింటికంటే ముఖ్యంగా కీరదోసలో పిండి పదార్ధాలు తక్కువగా ఉంటాయి, అందుకే ఇది డయాబెటిస్ డైట్ ‌లో భాగం కావడానికి ప్రధాన కారణం. దోసకాయ చల్లని, రిఫ్రెష్ రుచిని అందిస్తుంది. అందుకే దీనిని తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇంకా కీరదోసను సూప్ లా కానీ, సలాడ్, శాండ్‌విచ్, రైతా ఇలా రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

 

Exit mobile version