Home Health పాల‌కూర తింటే ఈ రోగాలు అన్నింటికీ చెక్ పెట్టొచ్చు

పాల‌కూర తింటే ఈ రోగాలు అన్నింటికీ చెక్ పెట్టొచ్చు

0

ఆరోగ్యం స‌రిగా లేకుంటే సిరి సంప‌ద‌లు ఎన్ని ఉన్నా వేస్టే. అందుకే సంపాదనలో ఎంత బిజీ గా ఉన్నా ఆరోగ్యం, తీసుకునే ఆహరం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. రోజూ తింటున్నాం కదా సరిపోదా అనుకుంటే ఖచ్చితంగా సరిపోదు. ఏదో ఒకటి తినడం కాదు మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఆకుకూర‌లు ఎక్కువ‌గా తినాలి.

Health Benefits Of Palakuraఆకు కూరల్లోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందులో పాల‌కూర ప్ర‌త్యేకం. వారానికి ఒక‌సారి పాల‌కూర తింటే పెద్ద రోగాల‌ను సైతం త‌రిమికొట్టొచ్చు అంటున్నారు వైద్యులు. పాలకూరలో ఎంతో మేలైన పోషకాలు ఉంటాయి, ముఖ్యంగా ఇందులోయాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలం గా ఉంటాయి. బర్గర్లు, సలాడ్లు, శాండ్విచ్లు, రాప్స్, సూప్స్లో ఎక్కువగా వాడేది పాలకూరమాత్రమే, పాలకూర తింటే చాలా ఈజీగా జీర్ణం అవుతుంది.

అస‌లు పాల‌కూర‌తో క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

*ఓ కప్పు పాలకూర లో 5 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో సోడియం కూడా ఉంటుంది. అంతేకాదు ఫ్యాట్ ఉండదు అస్సలు కొలెస్ట్రాల్ రాదు. కాబట్టి బరువు తగ్గాలి అని భావించేవారు తరుచూ పాలకూర తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* పాల‌కూర‌లో ఫైబ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. త‌ర‌చూ పాల‌కూర‌ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. దీనివ‌ల్ల మ‌ల‌బ‌ద్దకం కూడా దూరం అవుతుంది.

*ఇక శరీరం బాగా వేడి చేసింది అనిపిస్తే వెంటనే పాలకూర తీసుకుంటే చలువచేస్తుంది.

*కీళ్లనొప్పులు, అస్థియోడైనియా పోగొడుతుంది. కండ‌రాల స‌మ‌స్య ఉన్న‌వాళ్లు పాల‌కూర తిన‌డం మంచిది.

*ఇది తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగుప‌డుతుంది. శ‌రీరానికి ఆక్సిజ‌న్ అందేలా చూస్తుంది. శరీరానికి ఐరన్ బాగా అందుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది.

*సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

*పాలకూరలో ఉండే విటమిన్ కె, జుట్టు ఊడిపోకుండా బలం గా ఉండేలా చేస్తుంది.

* అలాగే గుండె స‌మ‌స్య‌లు రాకుండా చేస్తుంది.

* గర్భిణీ మ‌హిళ‌లు పాల‌కూర‌ తింటే ఆరోగ్యంగా ఉంటారు.

* పాల‌కూర నిద్ర‌లేమి స‌మ‌స్య‌ల‌ను ద‌రిచేర‌కుండా చేస్తుంది.

* అన్నింటి క‌న్నా ముఖ్యంగా పాల‌కూర క్యాన్స‌ర్‌కు దూరంగా ఉంచుతుంది. అందుకే దీనిని ప్ర‌తిరోజూ తినాల‌ని సూచిస్తున్నారు వైద్యులు.

 

Exit mobile version