ఉల్లిపాయలో ఉండే వైద్యపరమైన విలువైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసా ?

ఉల్లిగడ్డ కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది. కానీ… ‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అని సామెత. ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది ఈ సామెత. కొన్ని శతాబ్దాలుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అతి తక్కువ ధరకు దొరికే వీటిని పేదల ఆహారంగా కూడా చెబుతారు. ఉల్లిపాయలో ఘాటైన వాసనే కాదు, శక్తివంతమైన ఆహారవిలువలు కూడా ఎన్నో ఉన్నాయి.

Health Benefits Of Onionsఇంతటి పోషకవిలువలు ఉన్న ఉల్లిగడ్డలను భారతీయులు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచే వాడుతున్నారు. భారతదేశంలో ప్రత్యేకంగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్‌లలో ఈ ఉల్లిగడ్డలు ఎక్కువగా పండుతున్నాయి. పచ్చివి తిన్నా, ఉడకబెట్టి తిన్నా, ఫ్రైం చేసుకున్నా, రోస్ట్ చేసుకున్నా… కూరలకు అదనపు ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది ఉల్లిగడ్డ. సూప్స్ తయారీలో కూడా ఉల్లిది ప్రధాన పాత్ర.

Health Benefits Of Onionsశరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్త్మా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు… రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అందుకే అతి తక్కువ ధరలో దొరికే ఉలిగడ్డలను వైద్య, ఆరోగ్య సంస్థలు ట్యాబ్లెట్స్ తయారీలో వాడుతున్నాయి. అంతేకాదు బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్, డయేరియా రాకుండా కాపాడుతుంది. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.

Health Benefits Of Onionsఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి. నోటి నుంచి దుర్వాసన వస్తుందని కొద్దిమంది తినడానికి అంతగా ఇష్టపడరు. అటువంటి వారు ఇందులోని వైద్యపరమైన విలువైన ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకుంటే ఉల్లిపాయ తినకుండా ఉండరు.

Health Benefits Of Onionsదంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయల ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిముషాలు నమలడం వల్ల నోటి నలమూలల్లో ఉన్న జర్మ్స్(సూక్ష్మక్రిములు)దంత సంబంధ క్రిముల్ని నశింప చేస్తాయి. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.

Health Benefits Of Onionsఉల్లిపాయ శరీరంలోని రక్తం పల్చగా ఉండి కణాలన్నింటికి ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. మరియు రక్తం గడ్డకట్టకుండా, రక్తకణాల నుండి ఎరరక్తకణాలను నిరోధిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే గుండె లోపాలు లేదా కార్డియో వాస్కులార్ వ్యాధులు దాడి తీయవచ్చు. గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడే వాళ్లు రోజూ 100 గ్రాముల ఉల్లిని తీసుకోవటం చాలా మంచిది. కీటకాలు కుట్టినప్పుడు ఉదా: తేలు కుట్టినప్పుడు తక్షణ నొప్పి నివారినిగా ఉల్లిపాయ రసాన్ని ఆ ప్రదేశంలో అప్లై చేయాలి. తాజా ఉల్లిపాయ రసం లేదా పేస్ట్ పురుగులు కుట్టడం మరియు తేలు కుట్టిన భాగంలో బాహ్యంగా అప్లై చేయడం వలన నొప్పిని నియంత్రిస్తుంది. ఉల్లిపాయ రసం కొన్ని చుక్కలు తీవ్రమైన చెవినొప్పి తో బాధపడుతున్న వ్యక్తులకు అత్యంత ప్రయోజనకరమైనది.

Health Benefits Of Onionsమూత్రవిసర్జన సమయంలో మూత్రంలో మంట, నొప్పితో బాధపడే వారికి, ఉల్లిపాయలు గణనీయమైన ఉపశమనం అందిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఉల్లిపాయలు నీటిలో వేసి బాగా మరిగించి 6-7గ్రాముల నీటిని రోజు తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. పైల్స్‌తో బాధపడుతున్న వారు 30 గ్రాముల ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్లలో వేసి, అందులో 60 గ్రాముల పంచదార కలుపుకుని రోజుకు రెండుసార్లు చొప్పున తీసుకుంటే కొద్ది రోజుల్లోనే మంచి ఉపశమనం లభిస్తుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడితే ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి ప్రతిరోజూ ఉదయంపూట తింటే రాళ్లు కరిగిపోతాయి.

శరీరంలో ఉన్నట్లుండి ఏర్పడే వేడిని వెంటనే తగ్గించుకోకపోతే చాలా ప్రమాదం. ముఖ్యంగా వేసవి కాలంలో వేడి చేస్తే ఉల్లిపాయ గుజ్జును మీ పాదాలకు మరియు మెడ మీద అప్లై చేయాలి. ఇది మొత్తం శరీరానికి చలవ చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR