శనగలుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు

0
406

శనగలు.. సంప్రదాయానికి, పూజలకు పెట్టింది పేరు. ఏ ఆలయంలోనైనా.. ఏ ఇంట్లోనైనా ప్రత్యేక పూజలు చేశారంటే శనగలు ప్రసాదంగా, నైవేద్యంగా సమర్పిస్తారు. ఉడికించి నైవేద్యంగా సమర్పించే ఈ శనగలంటే ఇష్టపడని వారుండరు. అంతేకాదు సాయంకాలం స్నాక్స్ రూపంలో ఇస్తే పిల్లలు గంతులేస్తూ తినేస్తారు. ఉడికించుకుని తీసుకున్నా, కూర్మాలో వేసుకున్నా.. ఫ్రై రూపంలో తీసుకున్నా.. సలాడ్ రూపంలో లాగించినా.. శనగల రుచే వేరు. అంతేకాదు మొలకెత్తిన శనగలతో గారెలు వేసుకున్నా భలే రుచికరంగా ఉంటాయి. ఇవి రుచినే కాదు.. ఎన్నో పోషక విలువలను కలిగి ఉన్నాయి.

health benefits of peasశనగల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంది. ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందించడానికి సహాయపడతాయి. పిల్లలకు ఉడకబెట్టిన శనగలు పెట్టడం చాలా మంచిది. కనీసం వారానికి రెండు రోజులైనా శనిగలు వారి ఆహారంలో ఉండేట్లు చూడవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది.

health benefits of peasశనగల్లో ఉండే పైథో న్యూట్రియంట్స్, ఆస్టియో ఫ్లోరోసిస్ తో పోరాడతాయి. అంతేకాకుండా క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శనగలు స్ర్తీలకు చాలా అవసరం. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. దీనివల్ల రక్త హీనత దూరం అవుతుంది. రక్తపోటుతో బాధపడే వాళ్లు రెగ్యులర్ డైట్ లో శనగలు చేర్చుకోవడం మంచిది. ఇవి రక్త పోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

health benefits of peasనానబెట్టి మొలకలు వచ్చిన శనగలలో పీచుపదార్ధం అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఏ వయస్సు వారు శనగలు తీసుకున్నా.. త్వరగా అరుగుతాయి. అలాగే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వంద గ్రాముల శనగలలో 61.2 శాతం పిండిపదార్ధాలు, 5.3 శాతం కొవ్వు, 17.1 శాతం మాంసకృత్తులు, 190 మిల్లీగ్రాముల కాల్షియం, 168 గ్రాముల మెగ్నీషియం, 9.8 శాతం ఐరన్ , 71 మిల్లీగ్రాముల సోడియం, 322 మి.గ్రా.పొటాషియం, 3.9 మి.గ్రా పీచుపదార్ధం, 361 కేలరీలు ఉంటాయి.

SHARE