Home Health రావి ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

రావి ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

0

భోది వృక్షంగా పిలిచే రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. రావి చెట్టును భారతదేశంలో పవిత్రమైందిగా కూడా భావిస్తారు. దీన్నే వృక్షశాస్త్రంలో ‘ఫెకస్ రిలిజియోసా’ అని అంటారు. ఇది భారతదేశ సంస్కృతిలో లోతుగా వేళ్లను పాతుకుని ఉంది, ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నమ్ముతారు. కాబట్టి, దీనిని ‘బోధి చెట్టు’ గా సూచిస్తారు. సాంప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని ‘అశ్వత్త’ వృక్షంగా కూడా వర్ణిస్తుంది, ఫికస్ రిలిజియోసాను సాధారణంగా పవిత్రమైన అశ్వత్థము (the sacred fig) అని కూడా పిలుస్తారు. ఇది ఆసియా, ముఖ్యంగా భారతదేశం మరియు చైనా, యొక్క ఉష్ణమండల భాగాలకు చెందింది.

రావి ఆకు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుఇది విస్తృతమైన కాండంతో పెద్దగా ఉండే చెట్టు. దీని యొక్క వ్యాసం 3 మీటర్ల వరకు ఉంటుంది. చెట్టు యొక్క ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి మరియు విలక్షణమైన ఆకుచివరను (టిప్) ను కల్గి ఉంటుంది. చెట్టు యొక్క పండ్లు సాధారణంగా చిన్న చిన్న అత్తి పండ్లను లేదా చిన్న మేడిపండ్లను పోలి లేతగా ఉన్నపుడు ఆకుపచ్చగా మరియు మాగి పండైనపుడు ఊదా రంగులోకి కూడా మారుతాయి. రావిచెట్టు యొక్క జీవిత కాలం సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలోని “జయ శ్రీ మహా బోధి” రావిచెట్టు, మత ప్రాముఖ్యత కలిగిన అతిపురాతనమైన చారిత్రక చెట్టు’ అని కూడా చెప్పబడింది. వాస్తవానికి దీని వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోనే పురాతనమైన చెట్టు అని కూడా చెప్పబడుతోంది. అంతే కాదు ఔషధాలలో కూడా రావి చెట్టు మేటి!

ఆకలి పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన రావి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల దగ్గు, రక్త సంబంధ సమస్యలు, పిత్త దోషాలు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గుతాయి. అధిక బరువుతో బాధపడేవారు నాలుగు రావిఆకులను గ్లాసున్నర నీటిలో వేసి ఒక గ్లాసు నీరు అయ్యే వరకు మరిగించి తాగడం వల్ల బరువు తగ్గుతారు.

ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకొని రోజూ రెండు పూటలా 2-3 గ్రాముల చొప్పున రెండు వారాలపాటు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆస్తమా త్వరగా తగ్గుతుంది

నపుంసకత్వం సమస్య నుంచి బయటపడటానికి కూడా రావి ఉపయోగపడుతుంది. అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి, నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు.

రావి పండ్లను, ఆకులను మలబద్దకం తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి. దానికి సోంపు గింజలు, బెల్లం సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. రోజుకు 5-10 రావి పండ్లను తిన్నా సమస్య పూర్తిగా దూరం అవుతుంది.

రక్త శుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.

పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది.

డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం ఉపకరిస్తుంది. రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి 3-4 గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది.

పూర్వం చిన్న పిల్లలకు సరిగా మాటలు రాకపోతే రావి చిగురు ఆకును తినిపించేవారు. సైన్స్ పరంగా చూస్తే ప్రతి మనిషికి ఆరా అనేది వుంటుంది. ఇది దాదాపు మానవ శరీరం చుట్టూ ౩ ఫీట్లు వుంటుంది. ఋషులు, మునులకు ఆరా 5 నుండి 6 ఫీట్లు ఉంటుందని ఒక అంచనా. కానీ రావి చెట్టు ఆరా మాత్రం 10 ఉంటుందని సైంటిఫిక్ ఆధారాలతో సహా కనుగొన్నారు. అందుకే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయమని అంటారు. అలా చేసినపుడు మన ఆరా సైజు కూడా పెరుగుతుంది.

రావి ఆకు కషాయం తీసుకోవడం వల్ల వీర్య కణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆడవారి నెలసరి సమస్యలకు మంచి ఔషధంగా ఈ కషాయం బాగా పని చేస్తుంది. రావి ఆకును అలాగే తినడం వల్ల 50% ఉపయోగం మరియు , కషాయంగా తీసుకోవడం వల్ల 75% ఉపయోగం వుంటుంది.

 

Exit mobile version