స‌బ్జా గింజ‌లతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

0
416

ఒకప్పుడు ఒంట్లో వేడి చేసిందంటే చాలు, చాలా మంది సబ్జా గింజలను నానబెట్టుకుని వాటిలో చక్కెర వేసుకుని ఆ పానీయాన్ని తాగేవారు. ఇప్పుడు చాలా మంది వేడి చేస్తే మజ్జిగా నిమ్మరసం తాగుతున్నారు. కానీ వేసవిలో ఒంటికి చలవ చేసే పానీయాల్లో సబ్జా చాలా మేలు. కూల్‌డ్రింకులు, ఎనర్జీ డ్రింకుల వంటివి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. వాటి బదులు సబ్జా గింజల్ని తాగితే అన్నీ ప్రయోజనాలే. ఇంట్లో, ఆఫీస్‌లో, ప్రయాణాల్లో ఉన్నప్పుడు… ఎప్పుడైనా సరే… దాహం తీర్చడంలో సబ్జా గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. జిగురులా ఉండే ఈ సబ్జ గింజల్లో బోలెడు ఔషధగుణాలు ఉంటాయి, పైగా శరీర ఉష్ణోగ్రతను సైతం తగ్గించి మల, మూత్ర సమస్యల్ని నివారిస్తాయి.

sabja seedsఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయడం మాత్రమే కాదు మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోస వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి.

sabja seedsస‌బ్జా గింజ‌ల‌ను నీటిలో క‌లిపి తింటే త‌ల‌నొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. మైగ్రేన్‌తో బాధ ప‌డుతున్న వారు ఇలా చేయడం వల్ల స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే గోరు వెచ్చని నీటిలో తేనె, అల్లం ర‌సం క‌లిపి దాంతో పాటు కొన్ని స‌బ్జాగింజ‌ల‌ను కూడా అందులో వేసి ఆ మిశ్ర‌మం తాగడం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. సబ్జా గింజలు అసిడిటీని దూరం చేస్తుంది. ఈ గింజలు క్రీడాకారులకు బాగా ఉపయోగపడతాయి. ఆటలు ఎక్కువగా ఆడటం వల్ల శరీరంలో తేమ తగ్గి నీరసించిపోతారు. అందుకే ఈ విత్తనాలను రోజూ తీసుకుంటే శరీరంలో తేమను పోనీకుండా నిలిపి ఉంచుతాయి..

sabja seedsగొంతులో మంట, ఆస్తమా, తీవ్రమైన జ్వరం, తలనొప్పి.. లాంటి సమస్యలు పీడిస్తున్నప్పుడు ఈ గింజల్ని నీళ్లలో నానబెట్టి నేరుగా తినేస్తే ఎలాంటి చిరాకునైనా ఇట్టే తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు పంచదార వేసుకోకుండా సబ్జా వాటర్ తాగితే సమస్య కంట్రోల్ అవుతుంది.

sabja seeds బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ సెట్ అవుతాయి. చర్మ సమస్యలును ఎదుర్కునే వారు సబ్జా గింజలు మరియు కొబ్బరి నూనె కలిపి వాడితే చర్మ సమస్యలను ఎదుర్కొవచ్చు.

 

SHARE