సీమ చింతకాయ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

సీజనల్ గా దొరికే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆ సీజన్లో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను ఎదుర్కోడానికి దోహదపడతాయి. అందులో ఒకటే సీమ చింతకాయ.వేసవిలో 4 నెలల పాటు అందుబాటులో ఉండే సీమ చింతకాయ గురించి సిటిల్లో పుట్టి పెరిగిన వారికి పెద్దగా పరిచయం లేకున్నా, పల్లెటూళ్లలో దీని పేరు, రుచి తెలియని వారుండరు. సీమ చింతకాయ తక్కువగా దొరుకుతుంది. కానీ దీని రుచి కారణంగా చాలా మంది ఇష్టపడతారు. ఇందులో గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉండే పదార్ధం రుచికి తియ్యగా, వగరుగా ఉంటుంది. జిలేబీ ఆకారంలో చుట్టలుగా ఉండే ఈ పండుని జంగిల్ జిలేబీ అని కూడా అంటారు.

Seema Chintakayaమంచి రుచి మాత్రమే కాదు సీమ చింతకాయలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా పల్లెటూళ్లలో దొరికినప్పటికీ వీటికి ఎక్కువ కాలం నిల్వ ఉండే శక్తి ఉండడంతో పట్టణాల్లో బండ్లపై అమ్ముతూ ఉంటారు. సీమ చింతకాయల్లో నూనె, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. వీటిలో మూడవ వంతు వరకు ప్రోటీన్‌లు లభ్యమవుతాయి. విటమిన్ ఎ, బి1, బి2, బి6లతోపాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. పలు ఖనిజ లవణాలు కూడా ఈ పండులో మెండుగా ఉన్నాయి. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Seema Chintakayaసీమ చింతకాయలో మెగ్నీషియం, పొటాషియం, కాపర్, ఐరన్, ఫాస్పరస్, థైమిన్ ఫుష్కలంగా ఉన్నాయి. వీటిలో ప్రోటీన్స్, మినరల్స్, సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శ్యాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఉండవు. కరోనా సమయంలో విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు కాబట్టి దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలానే దీని వల్ల వచ్చే ప్రోటీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.

బరువు తగ్గుతుంది:

Health Benefits of Seema Chintakayaఒక కప్పు సీమ చింతకాయ తినడం వల్ల 40గ్రాములు ప్రోటీనులు శరీరానికి అందుతాయి. ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్‌ ఉన్న ఆహారం తీసుకునేవారు అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్‌లు,లోఫ్యాట్ ఫుడ్స్ తీసుకునే వారికంటే త్వరగా బరువు తగ్గించుకోగలరని అధ్యయనాలు వెల్లడించాయి.

ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది:

Health Benefits of Seema Chintakayaసీమ చింతకాయ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి మరియు దంతాలు కూడా శుభ్రంగా మెరుస్తూ ఉంటాయి. దీనిలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది.

ఆకలిని తగ్గిస్తుంది:

Health Benefits of Seema Chintakayaఈ పండులో ప్రోటీన్స్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల, వీటిని తిన్నప్పుడు, ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో ఆకలిపై ధ్యాస తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్యా ఔషధం అని చెప్తారు.

కళ్ళకి మంచిది:

Health Benefits of Seema Chintakayaసీమ చింతకాయ కంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది. దీనిలో ఉండే మంచి గుణాలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గర్భిణీలకు దివ్యౌషధం:

Health Benefits of Seema Chintakayaసాధారణ మహిళల కంటే గర్భిణీ స్త్రీలకు ఐరన్, క్యాల్షియం అధికంగా అవసరం అవుతుంది. కాబట్టి, గర్భిణీలు సీమ చింతకాయలు తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో, పాలు పట్టే సమయంలో శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నీరసాన్ని తగ్గిస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల తల్లితో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఎముకలు బలంగా ఏర్పడతాయి. ఇందులో ఉన్న ఫైబర్ అధికంగా గర్భిణీ స్త్రీలలో ఉండే మలబద్దకాన్ని నివారిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

Health Benefits of Seema Chintakayaఈ సీమ చింతకాయలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఉండే విటమిన్ బి1 ప్రధాన నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేయడానికి, కాపర్ శరీరంలో వ్యాధినిరోధకశక్తి పెంచడానికి, రక్తనాళాలు సక్రమంగా పనిచేసేలా చూడడానికి సహాయపడుతుంది.

డిప్రెషన్ తగ్గిస్తుంది:

Health Benefits of Seema Chintakayaపరిశోధకులు చెప్తున్న మాటల ప్రకారం వీటిలోలో అమినో యాసిడ్ డొపమైన్ పుష్కలంగా లభిస్తుందట. దీని వల్ల ఒత్తిడి తగ్గిస్తూ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. దాంతో డిప్రెషన్ కండీషన్ నివారిస్తుంది.

బ్లడ్ షుగర్ నియంత్రణ:

Health Benefits of Seema Chintakayaఒక కప్పు సీమ చింతకాయలో 36గ్రాములు సోలబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ , బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా ఈ ఫైబర్ వేరియంట్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం వల్ల గుండె సమస్యలుండవు.

చర్మ రక్షణ:

Health Benefits of Seema Chintakayaసీమ చింతకాయల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది కొంత మందిలో చిన్న వయసులో వచ్చే ఏజింగ్ లక్షణాలు తగ్గిస్తుంది. అంతేకాకుండా మొహంపై వచ్చే ముడతలను తగ్గించి చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR