సీతాఫలం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

సీతాఫలము.. శీతాకాలం పండుగా పరిగణించే ఈ సీతాఫలం పోషకాల సమాహారం. ఎన్నో అనారోగ్యాల నివారణకు పనిచేస్తుంది.. అలాగే . మరెన్నో సుగుణాలున్న ఈ పండు గురించి వివరింగా తెలుసుకుందాం. చలి కాలంలో మూడు నెలలకు పైగా లభిస్తుంది సీతాఫలం. ఈ పండు రామాఫలం, లక్ష్మణఫలం రకాల్లోనూ దొరుకుతుంది. చూడడానికి ఒకే విధంగా ఉన్నా.. రుచి, వాసనలో కాస్త తేడా ఉంటుంది. అమృతఫలాన్ని తలపించే సీతాఫలాన్నే కస్టర్డ్‌ యాపిల్‌ అనీ షుగర్‌ యాపిల్‌ అనీ పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా దేశాలతోపాటు మనదేశంలోనూ విరివిగా పండుతుంది. పండుగా తినడంతోపాటు స్వీట్లు, జెల్లీలు, ఐస్‌క్రీములు, జామ్‌లు చేస్తుంటారు.

Seethaphalదీని ఆకులు, బెరడు, వేరు… ఇలా అన్ని భాగాలూ పలు వ్యాధుల నివారణ మందులలో వాడతారట. చాలామంది సెగ్గడ్డలకు వీటి ఆకుల్ని నూరి కట్టుకడతారు. వీటి ఆకులకు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. బెరడుని మరిగించి తీసిన డికాక్షన్‌ డయేరియాని తగ్గిస్తుందట. అలాగే ఆకుల కషాయం జలుబుని నివారిస్తుందట. దీనితో పోషకాలు, పిండిపదార్థాలు, ప్రొటీన్లు, పీచూ లభ్యమవుతాయి. ఇంకా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌, విటమిన్‌-సి వంటి విటమిన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఈ ఫలాన్ని రసంరూపంలో కాకుండా నేరుగా తినడమే మంచిది. ఎందుకంటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండు గుజ్జును తీసుకుని రసంలా చేసి.. పాలు కలిపి.. పిల్లలకు తాగించాలి. తద్వారా సత్వర శక్తి లభిస్తుంది. ఎదిగే పిల్లలకు రోజూ ఒకటి, రెండు పండ్లు తినిపిస్తే మంచిది. బలవర్థకమే కాదు.. దీనిలోని ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి.

health benefits of seethapalamమలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండు దివ్యౌషధంలా పనిచేస్తుంది. రోజూ తినగలిగితే.. ఎంతో మార్పు కనిపిస్తుంది. హృద్రోగులు, కండరాలు, నరాల బలహీనత ఉన్నవారు.. దీన్ని అల్పాహారంగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది, డైటింగ్‌ నియమాలు పాటించే వారు సైతం ఈ ఫలాన్ని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చు. పండులోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. సీతాఫలం గుజ్జు శరీరంలోని క్రిములు, వ్యర్థపదార్థాలను వెలుపలికి పంపించి వేస్తుంది. సీతాఫలం పండే కాదు.. ఆకులు ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోస్తెనిక్‌ ఆమ్లం చర్మసంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి.. కాస్త పసుపు కలిపి.. మానని గాయాలు, గజ్జి, తామర ఉన్న చోట పూతగా రాస్తే సరిపోతుంది. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్‌ పౌడర్‌ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే.. నల్లుల బెడద ఉండదు. సీతాఫలం బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు.

health benefits of seethapalamసీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే ఇది కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. గర్భిణులు ఈ పండును సాధ్యమైంత తక్కువగా తినాలి. పొరబాటున గింజలు లోపలికి పోతే గర్భస్రావం అయ్యే ప్రమాదముంది. ఈ ప్పందు మోతాదుకు మించి తింటే కడుపులో మంట, ఉబ్బరం సమస్యలు బాధిస్తాయి. అలాంటప్పుడు వేడినీరు తాగినా.. అరచెంచా వాము లేదా ఉప్పు నమిలినా ఉపశమనం లభిస్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులు, వూబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలో బాధపడేవారు.. సీతాఫలాన్ని పరిమితంగా తీసుకోవడం మంచిది. . సీతాఫలంలో సి విటమిన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. నోటిలో జీర్ణరసాలను ఊరేలా చేసే శక్తి అధికం ఈ పండుకు. ఇందులో ఉండే మెగ్నీషియం శరీరంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కాల్షియం ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. పీచుపదార్థాలు… మలబద్ధకంతో బాధపడేవారికి మంచి మందు. ఇన్ని లాభాలున్నా మధుమేహ రోగులు వీటికి దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిలో ఉండే చక్కెరల శాతం చాలా ఎక్కువ.

health benefits of seethapalamఉబ్బసం రోగులు వైద్యుల సలహా తీసుకుని తినాలి. సీతాఫలాలను ఖాళీ కడుపుతో తినకూడదు, భోజనం చేశాకే తినాలి. తిన్నాక మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. ఇక మహిళలకి సీతాఫలం దేవుడిచ్చిన వరం అని చెప్పాలి. పీసీఓడి ఉన్న మహిళలకి ఐరన్ చాల అవసరం.సీతఫలంలో ఐరన్ శాతం అధికంగా ఉన్నందున, సీజన్ రాగానే ఈ పండుని ప్రతి మహిళా సంతోషంగా ఆస్వాదించవచ్చు. అదేవిధంగా సంతానం లేనివారు ఇది తీసుకుంటే..సత్పలితాలు పొందుతారు. అలసట,చిరాకు, డిప్రెషన్ చాల వరకు తగ్గుతాయని వైద్యనిపుణులు పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR