ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికీ కూడా గంజి అద్భుతంగా పని చేస్తుందా ?

అన్నం వండేట‌ప్పుడు బియ్యం ఉడ‌క‌గానే అందులోని నీటి(గంజి)ని పార‌బోస్తారు. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు గాని ఒకప్పుడు ఈ గంజిని తాగేవారు. గంజిలోనూ అనేక ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయ‌న్న సంగ‌తి ఇప్ప‌టి వారికి చాలా మందికి తెలియ‌దు. ఇప్ప‌టికీ మ‌న ఇండ్ల‌లో ఇలా గంజిని పార‌బోసే వారు ఉన్నారు.

starchఒక గ్లాస్‌లో గంజి నీటిని తీసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఆ మిశ్ర‌మాన్ని తాగితే డ‌యేరియా వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గంజిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అత్యంత కీల‌క‌మైన 8 ర‌కాల అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి మ‌న‌కు త‌క్ష‌ణ శ‌క్తిని అందిస్తాయి. కండ‌రాల‌ను పున‌రుద్ధ‌రిస్తాయి. మ‌న‌ల్ని ఉత్తేజంగా ఉండేలా చేస్తాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికీ గంజి అద్భుతంగా పని చేస్తుంది.

starchగంజిలో ఓ కాట‌న్ బాల్ ముంచి దాన్ని ముఖానికి రాసి కొంత సేప‌టి త‌రువాత క‌డిగేస్తే ముఖ సౌంద‌ర్యం పెరుగుతుంది. ఇలా రోజూ అయినా చేయవచ్చు, టైం సరిపోదు అనుకుంటే కనీసం వారానికి రెండు సార్లైనా చేస్తే మీ స్కిన్ కి అవసరమైన విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి. గంజి నీళ్లు అద్భుతమైన టోనర్ లా పని చేస్తుంది. ఇవి ముఖాన్ని కాంతివంతం చేస్తాయి. వృద్ధాప్యం కార‌ణంగా వ‌చ్చే ముడత‌ల‌ను దూరం చేస్తాయి.

starchగంజి కి ఉండే సూదింగ్ ఎఫెక్ట్ వల్ల అది యాక్నే కి మంచి ట్రీట్మెంట్ లా పని చేస్తుంది. అది యాస్ట్రింజెంట్ లా కూడా వర్క్ చేసి ముఖం మీద ఎర్రదనాన్ని తగ్గిస్తుంది. ఫ్యూచర్ బ్రేకౌట్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎగ్జిమా తో వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడానికి గంజి లో ఉండే స్టార్చీ క్వాలిటీస్ హెల్ప్ చేస్తాయి. రైస్ వాటర్ లో ఒక క్లీన్ వాష్ క్లాత్ ముంచి ఆ తడి క్లాత్ తో ఎఫెక్టెడ్ ఏరియా ని పాట్ చేయండి. రెండు మూడు నిమిషాలు ఇలా చేసిన తరువాత స్కిన్ ని గాలికి ఆరనివ్వండి

starchఎగ్జిమా ఒక్కటే కాకుండా స్కిన్ ఇరిటేషన్స్ కి కూడా రైస్ వాటర్ పనికొస్తుంది. స్కిన్ బాగా దురదగా, ఇరిటేటింగ్ గా ఉన్నప్పుడు మీ బాత్ వాటర్ కి ఒకటి రెండు కప్పుల రైస్ వాటర్ యాడ్ చేసి స్నానం చేయండి. సన్ బర్న్ వల్ల వచ్చే రెడ్ నెస్ నీ, ఇన్‌ఫ్లమేషన్ నీ రైస్ వాటర్ తగ్గిస్తుంది. బాగా రిలీఫ్ గా అనిపించాలంటే, ఫ్రిజ్ లో నుండి తీసిన రైస్ వాటర్ వెంటనే కాటన్ పాడ్ మీద వేసి ఎఫెక్ట్ అయిన ఏరియాస్ మీద అప్లై చేయండి. మొటిమ‌లు ఉన్న ప్ర‌దేశంలో గంజి నీటిని రాస్తే మొటిమ‌లు త‌గ్గిపోతాయి. అక్క‌డ ఏర్ప‌డే వాపు కూడా పోతుంది. చ‌ర్మంపై వ‌చ్చే దుర‌ద‌ను, మంటను త‌గ్గించేందుకు కూడా గంజి ఉప‌యోగ‌ప‌డుతుంది. కొద్దిగా గంజిని తీసుకుని బాగా చ‌ల్లార్చి దాన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాయాలి. దీంతో దుర‌ద‌, మంట నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

starchఇక షాంపూతో త‌ల‌స్నానం చేశాక గంజి నీటిని వెంట్రుక‌లకు ప‌ట్టించి కొంత సేప‌టి త‌రువాత మళ్లీ స్నానం చేస్తే వెంట్రుకల‌కు ఆరోగ్యం చేకూరుతుంది. శిరోజాలు కాంతివంత‌మ‌వ‌డ‌మే కాదు, అవి దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. గంజి నీటిలో దుస్తుల‌ను కొంత సేపు నాన‌బెట్టి అనంత‌రం వాటిని ఉతికితే దుస్తులు మెరుస్తాయి. వాటికి ఉండే మురికి కూడా పోతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR