చెరుకు రసం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వేసవి ఎండల్లో బైటికి వెళ్ళినప్పుడు చెరకు రసంలో కాస్త నిమ్మరసం ఐస్ ముక్కలు వేసి త్రాగితే ఆహా… ఎంత రుచిగా ఉంటుంది. ఎండా తాపాన్ని యిట్టె తగ్గించేసినట్టుగా అనిపిస్తుంది. గతంలో చెరకు లేదా చెరకు రసాన్ని పల్లెటూర్లలోనే చూసేవాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో పట్టణాలు, నగరాల్లో కూడా షుగర్ కేన్ స్టాల్స్ ఏర్పడ్డాయి. అప్పటికప్పుడు చెరకు నుండి రసాన్ని వేరు చేసి అమ్ముతున్నారు. ఎండాకాలం వేడికి తట్టుకోవాలంటే పండ్ల రసాలు ఎక్కువగా తాగుతూ ఉండాలి. మిగతా రసాలన్నీ పక్కన పెడితే కాస్త చౌకగా ఆరోగ్యానికి ఇంపుగా ఉండే చెరుకు రసం ఎన్నో లాభాలు అందిస్తుంది.

చెరకు రసంఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉండేవారు చెరకు రసం తాగితే శరీరంలోని నీటి స్థాయి సమతుల్యంగా ఉంటుంది. తద్వారా ఎండదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. వేడి చేసిన వారు చెరుకు రసం తాగడం వల్ల వేడి త్వరగా తగ్గి ఒంటికి చలువు చేస్తుంది. చెరకు రసాన్ని పది చుక్కల మోతాదుగా రెండు ముక్కు రంధ్రాల్లోనూ వేసుకుని పీల్చితే ముక్కు నుంచి రక్తం కారడం తగ్గుతుంది.

చెరకు రసంఅర గ్లాస్‌ తాజా చెరకు రసానికి అర గ్లాస్‌ లేత కొబ్బరి నీళ్లు, చిటికెడు సున్నం, అర టీస్పూన్‌ అల్లం రసం కలిపి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది. చెరకురసం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది, తద్వారా మూత్రవిసర్జనకు తోడ్పడుతుంది. చెరకు రసాన్ని సంప్రదాయక మూత్రవిసర్జనకారిగా ఉపయోగిస్తారు.

చెరకు రసంఅంతేకాక మూత్రపిండాలకు సంబంధించిన రుగ్మతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో ప్రోటీన్ స్థాయిని పెంచి మూత్రశాయ ఇన్ఫెక్షన్ల భారి నుంచి కాపాడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించడానికి చెరకు రసం చాలా ప్రభావవంతమైన ఆరోగ్య ప్రయోజనం. డీహైడ్రేషన్ వల్ల మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడుతాయి. చెరకు రసాన్ని తాగడం వల్ల మూత్రపిండంలో రాళ్ళు విచ్చిన్నం చేయడానికి, కరిగిపోవడానికి ఉపయోగపడుతుంది.

చెరకు రసంపచ్చ కామెర్లతో బాధపడే వారికి చెరుకు రసం దివ్య ఔషధంలా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెప్తారు.వాతావరణ మార్పిడితో ఏర్పడిన జలుబు, ఇతర ఇన్‌ఫెక్షన్లను తగ్గించడంలో కూడా చెరుకు రసం సమర్ధవంతంగా పనిచేస్తుంది. డయోరియా, మూత్ర మార్గ అంటువ్యాధులు, కడుపు(జీర్ణ) లేదా గుండె సంబంధించిన వ్యాధులు, లైంగిక సంక్రమణ, వాపు వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్ వ్యాధులను చెరకు రసంతో నయం చేయవచ్చు.

చెరకు రసంమలబద్దకంతో బాధపడే వారు చెరుకు రసం రోజూ తాగితే కొద్ది రోజుల్లోనే సమస్య తొలగిపోతుంది. చెరుకు రసంలో సహజసిద్ధమైన లాక్సేటివ్ గుణాలు ఉండటం వల్ల కడుపులో మంట, అసిడిటీ వంటి సమస్యలను తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాస్‌ చెరకు రసానికి 2 టీస్పూన్ల ఉసిరికాయల రసం, 2 టీస్పూన్ల తేనె కలిపి తీసుకుంటుంటే రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.

చెరకు రసంచెరకు రసంలో ఖనిజాలు అధిక పరిమాణంలో ఉంటాయి, ఇది అలసటకు లేదా నీరసానికి ఒక అద్భుతమైన ముందుగా పనిచేస్తుంది. బలహీనంగా ఉండేవాళ్లు లేదా ఒత్తిడికి గురైయ్యేవారు ఒక గ్లాసెడు చెరకు రసాన్ని తరచుగా తాగాలని సిఫారసు చేయబడుతుంది. చెరకు రసం ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లను అందింస్తుంది అంతేకాక బరువు పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలు మరియు ఖనిజాలు కూడా చెరకు రసంలో ఉంటాయి. బరువు చాలా తగ్గిపోయినప్పుడు చెరకు రసం బరువును పెంచే దివ్యౌషధంలా పని చేస్తుంది అలాగే బరువు పెరగాలనుకునే వారికి ఇది ఒక సమర్థవంతమైన బరువు పెంచే మందు.

చెరకు రసంమధుమేహం ఉన్నవారికి షుగర్ కేన్ బాగా సహాయపడుతుంది. ముడి షుగర్ కన్నా లేదా ఆర్టిఫిషియల్ షుగర్ కన్నా ఈ షుగర్ కేన్ జ్యూస్ చాలా మంచిది. బరువు తగ్గించుకోవాలనుకునేవారు లేదా డయాబెటిక్ పేషేంట్స్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం చాలా ఆరోగ్యకరం. ఈ జ్యూస్ వల్ల శరీరంలో రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ ను క్రమబద్దీకరిస్తుంది. చెరుకు రసం తాగడం వలన రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి తో పాటు బి2 (రైబోఫ్లావిన్‌) పుష్కలంగా అందుతుంది. అదనంగా మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, పాస్ఫరస్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కెలొరీలు తక్కువ.. పోషకాలెక్కువ.

చెరకు రసంచెరకు రసం కాలేయం ఆరోగ్యానికి చాలా మంచిది. చెరుకు ఆల్కలీన్ ఆహార పదార్థం అయినందున, ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను తగ్గిస్తుంది. తద్వారా చెరకురసం కాలేయ సమస్య తగ్గి వ్యాధి నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. చెరకురసం ఊపిరితిత్తుల, మెలనోమా , పెద్దప్రేగు, ప్రోస్టేట్, అండాశయం మరియు మూత్రపిండాల క్యాన్సర్ వంటి అనేక క్యాన్సర్ కణాలపై వ్యతిరేక చర్యలను చూపినట్లు పరిశోధనలు కనుగొన్నాయి. చెరకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మరియు అందువల్ల ఇది యాంటీ-క్యాన్సర్ ఎజెంట్ గా పనిచేస్తుంది. చెరకు రసంలో ఉండే అనేక సమ్మేళనాలు రాడికల్-స్కావెంజెన్ సామర్ధ్యం కలిగి ఉంటాయి.

చెరకు రసంజలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ జ్యూస్ తీసుకోవడం హానికరం అని భావిస్తే అది తప్పే. ఇటువంటప్పుడు ఒక గ్లాస్ షుగర్ కేన్ జ్యూస్ తాగడం వల్ల ఈ జబ్బులను నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు చెరకు రసానికి ఒక టీస్పూన్‌ ఆవు నెయ్యి కలిపి కాచి తీసుకోవాలి. బలహీనత వల్ల వచ్చే దగ్గు తగ్గుతుంది. అలాగే చెరకు రసం పొటాషియం యొక్క గొప్ప వనరుగా చెప్పొచ్చు.ఇది కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్ల పై పోరాడటానికి సహాయపడుతుంది మరియు వాటి వలన కలిగే సమస్యల నుండి కూడా కాపాడుతుంది. పొటాషియంకు మంచి వనరుగా, చెరుకు రసం pH స్థాయిలను సమతుల్యంలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

చెరకు రసంపిల్లలు, పెద్దలు స్వీట్స్ , ఆహారం తీసుకొన్న తర్వాత చిగుళ్లలో ఉండిపోయి వాటి ద్వారా పళ్ళు సందుల్లో బ్యాక్టీరియా వ్యాపించి, ఈ బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలతో పళ్ళకు రంధ్రాలు పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి చెరకు రసం తీసుకోవడం వల్ల దంతాలు శుభ్రపడి, దంత క్షయాన్ని పోగొడుతుంది. చెరకు గడను దంతాలతో కొరికి, చీల్చి బాగా నమిలి తింటూ ఉంటే దంతాలు, చిగుళ్లు దృఢంగా మారుతాయి. చెరకు గడలను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. లాలాజల గ్రంథులు ఆరోగ్యంగా ఉంటాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR