చింత గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

తరచు వంటలలో చింతపండు వాడుతూ ఉంటాము. కేవలం చింతపండు వలన మాత్రమే కాకుండా చింత గింజల వలన కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.

Health Benefits of Tamarind Seedsచింత గింజల పొడిని పళ్ళూ, చిగుళ్ళ మీద రుద్దడం వల్ల మేలు జరుగుతుంది, ప్రత్యేకించి పొగ తాగే అలవాటున్న వారికి ఇది మరీ మంచిది. స్మోక్ చేయడం, ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల పంటి మీద ప్లేక్ ఏర్పడుతుంది, చింత గింజల పొడి దీన్ని తొలగిస్తుంది.

Health Benefits of Tamarind Seedsచింత గింజల రసాన్ని ఇండైజెషన్ ని క్యూర్ చేయడానికి వాడతారు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది.

Health Benefits of Tamarind Seedsచింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన స్కిన్ కి వచ్చే ఇన్‌ఫెక్షన్స్ ని ప్రివెంట్ చేయవచ్చు. అంతే కాక, ఇంటెస్టైనల్, యూరినరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్స్ రాకుండా కూడా ప్రొటెక్ట్ చేయవచ్చు.

Health Benefits of Tamarind Seedsచింత గింజలు పాంక్రియాస్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. చింత గింజల నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నాచురల్ గా మ్యానేజ్ చేయగలుగుతారు.

Health Benefits of Tamarind Seedsచింత గింజల్లో ఉండే పొటాషియం హైబీపీ, ఇంకా ఇతర కార్డియో వాస్యులర్ డిసీజెస్ తో బాధపడే వారికి మేలు చేస్తుంది

Health Benefits of Tamarind Seedsవయసు పెరగడం, అధిక బరువు వంటి కారణాల వల్ల మోకాలిలో కీళ్లు అరిగిపోయి మోకాలి నొప్పి కలుగుతుంది. దీనిని తగ్గించటానికి చింతగింజల పొడి అద్భుతంగా పనిచేస్తుంది. చింతగింజలను తీసుకొని పుచ్చులు లేకుండా బాగా శుభ్రపరచుకోవాలి. వీటిని బాగా వేయించిన తర్వాత మంచి నీటిలో రెండు రోజులపాటు నానబెట్టాలి. ప్రతిరోజు రెండు పూటలా నీటిని మారుస్తుండాలి. ఇలా నానిన చింతగింజలను పొట్టు తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

Health Benefits of Tamarind Seedsచింత గింజల పొడిని రోజుకు రెండుసార్లు అర టీ స్పూన్ చొప్పున పాలు లేదా నీటితో నెయ్యి లేక చక్కెర కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే రెండుమూడు నెలల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. మోకాలి నొప్పి పూర్తిగా తగ్గుతుంది. చింతగింజల చూర్ణం కీళ్ల నొప్పులకే కాక డయేరియా, డయాబెటిస్, గొంతులో ఇన్ఫెక్షన్లు ఇంకా దంత సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR