తెల్లగలిజేరు మొక్క వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వర్షాలు ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశాలు, ముఖ్యంగా పల్లెప్రాంతాల్లో ఎన్నో మొక్కలు విరివిగా పెరుగుతుంటాయి. అయితే చాలా మంది ఈ మొక్కలను చూసి పిచ్చిమొక్కలుగా అనుకుంటారు. కానీ నిజానికి కొన్ని మొక్కల్లో ఉన్న ఔషధగుణాల గురించి తెలిస్తే ఆ మొక్క ఎక్కడ ఉందా అని వెతుకుంటూ వెళ్లి మరి ఇంటికి తెచ్చుకుంటారు. అలాంటిదే గలిజేరు మొక్క.

Health Benefits Of Tella Galijeruవర్శకంలో ఎక్కువగా కనిపించే అద్భుతమైన మూలిక మొక్క ఇది. గలిజేరు మొక్కని ఔషధాల గని అని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పల్లెల్లో దానిని అటుక మామిడి అనీ, గలిజేరు, ఎర్రగలిజేరు అనీ పిలుస్తారు. గలిజేరు మొక్కను ఆయుర్వేదం ప్రకారం పునర్నవ అంటారు. పునర్‌ అంటే తిరిగి, నవ అంటే కొత్తగా అని అర్థం. దీని శాస్త్రీయ నామం బోరేవియా డిఫ్యూసా. సంస్కృతంలో స్వనాడిక, రక్తపుష్ప, పునర్నవ అంటారు.

Health Benefits Of Tella Galijeruఇందులో మూడు రకాలు ఉంటాయి. తెల్లపూలు ఉంటే తెల్ల గలిజేరు, ఎర్రపూలు ఉంటే ఎర్ర గలిజేరు అని పిలుస్తారు. వాటికి పూచే చిన్న చిన్న పువ్వుల రంగు బట్టి అది ఏ రంగుదో నిర్ణయిస్తారు. నేలమీద పాకే ఈ మొక్కకు ఆకులు గుండ్రంగా, అర్థ రూపాయంత ఉంటాయి. ఔషధ గుణాలు మూడింటికీ ఒకటేలా ఉన్నా తెల్ల గలిజేరు ఉత్తమమని అంటారు. ఆయుర్వేద మందుల్లో నొప్పిని తగ్గించే ఔషదంగా, రక్తాన్ని వృద్ధి పరచటానికి వాడే ముందుగా తయారు చేసేది ఈ మొక్కతోనే.

Health Benefits Of Tella Galijeruతెల్ల గలిజేరును వేడి నీటిలో మరిగించి తాగితే కఫము, దగ్గు, విషము, పాడు రోగాలు, శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకి సంబంధించిన వ్యాధులు, కాలేయ వాపుని మరియు గుండె బలహీనత వల్ల వచ్చిన వాపుని పోగొడుతుంది. మూత్రపిండాలను బాగు చేసి సక్రమంగా పని చేసేలా చేస్తుంది. శరీరంలో అధికంగా నీరు పట్టినప్పుడు ఆ నీటిని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూర ఇది. దీనిలోని విటమిన్‌ సి,డి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

Health Benefits Of Tella Galijeruతెల్లగలిజేరు ఆకులు పిడికెడు తీసుకొని శుభ్రపరిచి పావు లీటర్ మంచినీటిలో వేసి పది నిమిషాలుమరగనివ్వాలి. అనంతరం చల్లార్చి వడపోసిరోజు ఉదయం పరగడుపు ఒక గ్లాసు తీసుకున్నట్లయితే కిడ్నీలు శుద్ధితో పాటు మూత్ర నాళ సమస్యలు పూర్తిగా దూరం అవుతాయి. కానీ ప్రక్రియను 21 రోజులు చేయివలసి వుంటుంది. ఇది తీసుకున్న తరువాత అరగంట ఏమీ తీసుకోకూడదు. ఈ వేరు నీటిలో అరగతీసి కంటికి పెడితే రేచీకటి తొలగిపోయి కంటి చూపు మెరుగు పడుతుంది.

Health Benefits Of Tella Galijeruఈ ఆకు వండుకుని తింటూ ఉంటే రక్తం శుభ్రపడి వృద్ది చెందుతుంది. ఈ తెల్ల గలిజేరు ఆకు రసం పది గ్రాములు పెరుగులో కలిపి ఉదయం, సాయంకాలం తీసుకుంటే కామెర్లు నయమవుతాయి. అలా మూడు రోజులు తినాలి. గలిజేరు ఆకు వేడి చేసి కడితే బోదకాలు తగ్గుతుంది. నల్ల గలిజేరు కారం, చేదు రుచి ఉండి వాతాన్ని పోగొడుతుంది. ఇది దొరకటం అరుదు. మనకి సామాన్యం గా అందుబాటులో ఉండేది తెల్ల గలిజేరె. దీన్ని పప్పులో కలిపి వండుకుంటారు.

Health Benefits Of Tella Galijeruతెల్ల గలిజేరు వేడి చేసి, కఫము, దగ్గు, విషము, హృద్రోగాలను, శరీరానికి కలిగే వాపులు, వాత వ్యాధులు, కడుపుకి సంబంధించిన వ్యాధుల్ని పోగొడుతుంది. బాగా ముదిరిన ఈ మొక్క వేరులను సేకరించి పాలు కాచేటప్పుడు వచ్చే ఆవిరి మీద ఉడికించి ఎండబెట్టి పొడి చేసి బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే మూల వ్యాధి, శ్వాస సంబంధిత అనారోగ్యాలు, అరుచి, వాతము, కఫము, ఉబ్బు పోగొడుతుంది. శరీరాన్ని డేటాక్సీఫై చేయటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Health Benefits Of Tella Galijeruఈ ఆకులు నెల రోజులు తింటే కుష్టు రోగమును కూడా హరిస్తుందని వస్తు గుణ దీపిక చెప్తుంది. తెల్లగలిజేరు వేరు, నీరు, పాలు సమంగా కలిపి పాలు మిగిలే దాకా కాచి వడకట్టి తాగితే సర్వ జ్వరాలు హరిస్తాయని సుశ్రుత సంహిత చెప్తుంది. తెల్ల గలిజేరు వేరు, ఉమ్మెత వేరు కలిపి ముద్ద చేసి తింటే పిచ్చి కుక్క కరిచినప్పటి విషం విరిగిపోతుంది. ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి.

Health Benefits Of Tella Galijeruఅయితే ఈ ఆకు కూరని అతిగా తినకూడదు. తీవ్రమైన హృద్రోగం ఉన్నవారు వైద్యుడి సలహా తీసుకుని తీరాలి. డయాబెటిస్, అధిక రక్త పోటు ఉన్నవారు చలువ చేసే పదార్ధాలు అధిక గా తింటూ ఈ ఆకు కూరని మితంగా తినాలి. పాలిచ్చే తల్లులు, గర్బిణీలు ఈ ఆకు కూర తినకూడదు. ఆరోగ్యం బాగున్న వారు ఈ కాలంలో వారానికి ఒక సారి తిన్నా సరిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు సార్లు పప్పులో వండుకుని తింటే మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR