ఏ ఆభరణాలు ధరిస్తే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుంది?

అతివల మనసు దోచే వాటిలో బంగారం ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా మన భారతీయ మహిళకు బంగారి ఆభరణాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సాంప్రదాయమనో, అందాన్ని మరింత ఇనుమడింపజేసుకోవడానికో మహిళలు బంగారు ఆభరణాలు వేసుకోవడానికో ఇష్టపడతారు. అయితే మహిళలు బంగారు నగలు ధరించటంలో అందంతో పాటు ఆరోగ్య పరమైన లాభాలు కూడా ఉన్నాయి.
  • మహిళలు ధరించే ఒక్కో ఆభరణం ఒక్కోలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందుకే కాబోలు మన పూర్వికులు ఇలాంటి సాంప్రదాయాలు పెట్టారు. బంగారం మాత్రమే కాదు మహిళలు ధరించే రాగి, వెండి ఆభరణాలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరి నగలు నారీమణులు వేసుకునే నగలు వారి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం…
  • ముక్కు పుడక : ముక్కుపుడక ధరించడం వల్ల మాట్లాడే సమయంలో పై పెదవికి తగిలి వీలైనంత  వరకూ తక్కువగా  మాట్లాడమని సూచిస్తుందట. ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొన పై ఏదోవిధంగా దృష్టి ఉంటుంది.అలా దృష్టి ఉండడం ధ్యానంలో ఒక భాగం. అలా చెడు శ్వాస కలిగిన  గాలిని బంగారం పవిత్రం చేస్తుందట.
  • వడ్డాణము : గర్భకోశము కదలి లోపల ఉన్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.
  • చేతికి బంగారు గాజులు: చేతికి గాజులు వేసుకోవడం వల్ల మణికట్టు మీద ఉన్న నరాలు ఉత్తేజితమవుతాయి. తద్వారా మనల్ని ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.
  • కాలి మెట్టెలు: గర్భకోశంలో ఉన్న నరాలకు, కాలి వేళ్ళలో ఉన్న నరాలకు సంబంధం ఉంటుంది. కాబట్టి అవి నేలను తాకకుండా ఉండేలా చూసుకోవాలి. స్త్రీ  కామాన్ని అదుపులో ఉంచుకోవడానికి కాలివేళ్ల మధ్య  రాపిడి ఉండాలి.  ముఖ్యంగా కామాన్నిపెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉంటాయి. మెట్టెలు పెట్టుకోవడం వల్ల స్త్రీలు తమ కామ కోరికలను తగ్గించుకోవడానికి వీలుగా ఉంటుందని మెట్టెలు పెట్టుకోమని చెప్తారు.
  • చంద్రవంక: చంద్రవంకను తల మధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచి మన జీవనాధారం అయిన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.
  • కంఠాన వేసుకునే హారాలు : హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ కంఠాన నగలు ధరిస్తుంటారు. తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు. అవి గుండె మీద తగులుతూ ఉండడం వలన  అది గుండెకు చేరుతుందట. కాబట్టి బంగారు నగలను ధరించడం వలన గుండె సంబంధిత వ్యాధుల కు కూడా మనం దూరంగా ఉండవచ్చు.
  • వెండి పట్టిలు : వెండి శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా రక్తప్రసరణ సజావుగా సాగుతూ, పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి. వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల, శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యతను సృష్టించడానికి బంగారాన్ని నడుము పైన ధరిస్తారు, మరియు వెండిని నడుము క్రింద ధరిస్తారు.
  • బంగారం వెండి కంటే చేతి వేలికి రాగి ఉంగరం పెట్టుకుంటే 100 రెట్లు ఆరోగ్యానికి లాభం. రాగి ఉంగరం ధరించడం వల్ల శరీరలో వేడి తగ్గుతుంది. అంతేకాదు… రాగి ఉంగరం రక్తపోటు, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఇక తరచూ తలనొప్పితో భావించే వారికి రాగి ఉంగరం వల్ల ఉపశమనం కలుగుతుంది. రాగి ఉంగరం వల్ల సూర్యుని నుంచి వచ్చే నెగటివ్ శక్తిని తరిమి పాజిటివ్ శక్తిని అందిస్తుంది. ఇక రాగి ఉంగరం వల్ల ఒత్తిడి తగ్గి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
ఇక ఈ రాగి ఉంగరంతో వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రాగి ఉంగరం ఎముకలకు కావాల్సినంత బలాన్ని ఇస్తుంది. వాపులు వంటి వాటిని కూడా రాగి ఉంగరం తగ్గించేస్తుంది. అంతేకాదు చర్మ సౌందర్యానికి కూడా రాగి ఉంగరం ఎంతో మంచిది. శరీరంలో ఉండే నొప్పులను పూర్తిగా తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR