పసుపు గ్రీన్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కరోనా కష్టకాలంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరం. కరోనా కాకుండా శరీరాన్ని హనికలిగించే అనేక రకాల క్రిములు, వైరస్ లతో పోరాడేందుకు రోగ నిరోధక వ్యవస్ధ చాలా తోడ్పడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి, వ్యాధుల ప్రమాదాలని తగ్గించడానికి సహాయపడే పదార్థాలు హెర్బల్ టీ, గ్రీన్ టీ లలో ఉంటాయి.

Health Benefits of Yellow Green Teaసాధారణంగా గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం మనందరికీ తెలుసు. గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు అన్న విషయం తెలిసిందే. గ్రీన్ టీలో ఉండే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ కాటెచిన్.. గుండె జబ్బులను తగ్గించడంలో సహాయం చేస్తుంది. గ్రీన్ టీలో పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, కాబట్టి ఇది మీ శరీరంలోని విష మూలకాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

Health Benefits of Yellow Green Teaచాలామందికి కాలేయం సంబంధ సమస్యలు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే.. కాలేయం రోజూ చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మనం తినే ఆహారంలో మంచి, చెడు రెండింటిని వేరు చేసేది కాలేయం మాత్రమే. పోషకాలను ఇతర అవయవాలకు పంపించి చెత్తను, వ్యర్థాలను బయటికి పంపించే ప్రక్రియను కాలేయం నిర్వహిస్తుంది. ఈ పని చేయాలంటే కాలేయం చాలా శుభ్రంగా ఉండాలి.

Health Benefits of Yellow Green Teaఆరోగ్యంగా, దెబ్బ తినకుండా ఉండాలి. మనం తీసుకునే ఫుడ్ హెల్దీగా లేకపోతే కాలేయం దెబ్బ తింటుంది. దాని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం, గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయంలో ఊబకాయం వచ్చే ప్రమాదం 75% తగ్గుతుంది. లివర్ ఆరోగ్యంతో గ్రీన్ టీ మీ శరీర బరువును తగ్గిస్తుంది, జీవక్రియను పెంచుతుంది మరియు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

Health Benefits of Yellow Green Teaఅందుకే.. కాలేయం పనితీరు మెరుగ్గా ఉండాలన్నా.. లివర్ శుభ్రం కావాలన్నా.. గ్రీన్ టీ కన్నా మెరుగైన పసుపు గ్రీన్ టీ తాగాల్సిందే. ఇది నిజానికి ఒక ఆయుర్వేద టీ. ఎందుకంటే.. ఈ టీ తయారీకి ఉపయోగించేవి అన్నీ ఆయుర్వేద గుణాలు ఉన్నవే. పసుపు మన శరీరానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అందుకే దాన్న అన్ని కూరల్లో వాడుతుంటాం. పసుపు శరీరంలోని ఎక్కువ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది, ఇవి శరీరంలోని విష వ్యర్ధాలను తగ్గించి వాటిని బహిష్కరిస్తాయి.

Health Benefits of Yellow Green Teaపసుపు శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుందని కాలేయ ఆరోగ్యాన్ని ఇస్తుందని అంటారు. అలాగే.. గ్రీన్ టీ కూడా. గ్రీన్ టీ కూడా శరీరానికి ఎంతో మంచిది. శరీరంలో ఉన్న విష పదార్థాలను తరిమికొట్టడంలో గ్రీన్ టీ ఎంతో దోహదపడుతుంది. అందుకే.. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిసినా కూడా కొందరు చాయ్ ని వదలలేకపోతున్నారు.

Health Benefits of Yellow Green Teaఅటువంటి వాళ్లు ఆరోగ్యానికి లాభం చేకూర్చే టీలను తాగడం బెటర్. దాని వల్ల వాళ్లకు టీ తాగిన ఫీలింగ్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అలాంటి టీలలో ముఖ్యమైనది పసుపు గ్రీన్ టీ. అది ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టౌవ్ మీద ఒక గిన్నెలో ఒక కప్పు నీరు మరగబెట్టండి.

Health Benefits of Yellow Green Teaనీరు మరిగేటప్పుడు మంట తగ్గించి. అందులో గ్రీన్ టీ ఆకులు మరియు పసుపు పొడి వేసి మూత పెట్టి 3 – 4 నిమిషాలు మరిగించాలి. తయారుచేసిన టీ మిశ్రమాన్ని ఒక కప్పులో తీసుకుని అవసరం అయితే తేనె కలిపి తాగండి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగడం వల్ల మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR