ఎంత వ్యాయామం చేసినా ఎన్ని ఆహార నియమాలు పాటించినా బరువు తగ్గలేదని బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి ఈ టీ ని ట్రై చేసి చుడండి. దాల్చినచెక్క మరియు బిర్యాని ఆకులతో చేసిన టీ, ఆరోగ్యం పెంచడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇది సులభంగా జీర్ణమయ్యే ఆహారం. వంటింట్లో ఉండే ఔషధాలలో బిర్యానీ ఆకు కూడా ఒకటి. ఈ ఆకుని కేవలం బిర్యానీ లోనే కాకుండా ఇతర వంటకాలలో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ బిర్యానీ ఆకు వంటలకు మంచి రుచి ఇవ్వడంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఆయుర్వేద మందుల్లోనూ ఈ ఆకులను వాడతారు. ఈ ఆకులను పొడి చేసి లేదా నేరుగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి, గుండెసమస్యల వంటి ప్రమాదకర సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. బిర్యానీ ఆకు పొడిని నీటిలో కలుపుకొని ఉదయం, సాయంత్రం తాగితే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్ లు విటమిన్ సి బిర్యానీ ఆకులో పుష్కలంగా ఉంటాయి. వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను నివారించడంలోనూ ఈ ఆకు కీలకంగా పనిచేస్తుంది. ఇక దాల్చినచెక్క, ఫ్రెంచ్ ఆకు టీ బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు.
బిర్యానీ ఆకులతో చేసిన టీ శరీరంలోని చెడు కొలస్ట్రాల్ ని కరిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు టీ, కాఫీ లకు బదులుగా బిర్యానీ ఆకులతో చేసిన టీ తాగితే మంచి రిలీఫ్ ఉంటుంది. జలుబు,గొంతు నొప్పి, ఫ్లూ ఉన్నవాళ్లు బిర్యానీ ఆకుని నీటిలో మరిగించి వాడకట్టుకొని తాగడం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ఇక దాల్చిన చెక్క పొడిని కూడా బిర్యానీ ఆకు టీ కలిపి తీసుకుంటే త్వరగా మంచి ఫలితం పొందుతారు. రెండు పదార్థాలు జీర్ణక్రియను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.