కరివేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ కలుగుతాయి అవి ఏంటో తెలుసా ?

కరివేపాకు.. శాస్త్రీయ నామము “మర్రయా కీనిగీ”. ఇంగ్లీషులో curry leaves అని sweet neem leaves అని అంటారు. ఈ ఆకులను వంటకాల్లో సువాసనకోసం వాడుతారు. కరివేప ఆకుల్లో ఖటికం (కేల్సియం), భాస్వరం (ఫాస్ఫరస్), నార (ఫైబర్), విటమిన్-ఎ, విటమిన్-సి ఉండడం వల్ల వీటికి పోషక విలువ ఉంది. కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. అయితే ఇన్ని ఔషధ గుణాలు ఉన్న కరివేపాకును అందరూ తీసిపడేస్తారు.. ఈ కరివేపాకు మన ఆరోగ్యానికి కల్పతరువు అని చెప్పాలి.. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ కలుగుతాయి. అవేంటో మనం ఇపుడు తెలుసుకుందాం.

Kariveapakuశరీరంలోని విష వ్యర్థాల్ని తరిమేయటంలో కరివేపాకు ముఖ్యపాత్ర పోషిస్తుంది.. మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది… మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే డయేరియా సమస్యకు సరైన పరిష్కారం కరివేపాకులు. దీంట్లో ఉండే కారిబాజోల విరేచనాలకు బ్రేక్ వేస్తుంది. అందుకే మన పూర్వీకుల నుండి ప్రతీ కూరలో కరివేపాకులు వేయటం. కరివేపాకు దగ్గు, జలుబులకు చెక్ పెడుతుంది. దీనిలో ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది రక్త హీనతను తగ్గిస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారు కరివేపాకులు తింటే మేలు. కరివేపాకుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. యూరినరీ సమస్యలకు కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకుల్ని ఉడకబెట్టిన నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.. జుట్టు తెల్లబడిన వారికి తిరిగి నల్లబడేందుకు కరివేపాకులు సహకరిస్తాయి…

Kariveapakuదీంతో జుట్టు కూడా పెరుగుతుంది.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేందుకు కరివేపాకులు బాగా పనిచేస్తాయి. చర్మాన్ని కూడా కాపాడతాయి. అనీమియా వ్యాధితో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం పొందవచ్చు. కరివేపాకు పేగులకు, కడుపుకు బలాన్ని ఇవ్వటమే కాకుండా.. శరీరానికి మంచి రంగును, కాంతిని ఇస్తుంది. అజీర్ణాన్ని అరికట్టి ఆకలి పుట్టిస్తుంది. న్యూమోనియా, ఫ్లూ.. లాంటి ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సలో కూడా కరివేపాకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదే విధంగా మలబద్ధకంతో బాధపడేవారికి, మొలల సమస్యతో సతమతం అయ్యేవారికి కూడా కరివేపాకు దివ్యౌషధమనే చెప్పవచ్చు.

Kariveapakuకరివేపాకు శరీరంలో వేడిని తగ్గించటమేగాకుండా, అధిక చెమట బారినుంచి రక్షిస్తుంది. గర్భిణీ స్త్రీలలో వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులకు కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి. కరివేపాకు కాయల రసాన్ని సమాన భాగం నిమ్మరసంతో కలిపి కీటకాలు కుట్టినచోట ప్రయోగిస్తే నొప్పి, వాపు, ఎరుపుదనం వంటి లక్షణాలు తగ్గుతాయి. దద్దుర్లు కూడా తగ్గుతాయి. తాజా కరివేపాకు రసాన్ని కళ్లలో చుక్కల మందులాగా వాడితే క్యాటరాక్ట్ రాకుండా అరికట్టవచ్చు.. లేత కరివేపాకు రసానికి తేనె కలిపి తీసుకుంటే ఆర్శమొలల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Kariveapakuకరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకున్నా మంచిదే. దీనివల్ల మలబద్ధకం తగ్గిపోయి ఫైల్స్ బాధ తగ్గుతుంది. కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంధ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది..

Kariveapakuకరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతోగాని కలిపి కళ్లకింద చర్మంమీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న కరివేపాకుని ఇకపై అయినా తీసి పక్కన పెట్టకుండా తినేయండి..

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR