మానవ శరీరంలో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే విలువ ఉంది. మనిషి జీవించడానికి నీరు చాలా అవసరం అని మనందరికీ తెలిసిందే. చిన్న పిల్లల శరీరంలో 75% నీరు ఉంటుంది, అదే పెద్దలలో అయితే 55% నీరు ఉంటుంది. అయినప్పటికీ, మన శరీరం స్పష్టంగా నీటితో సంయోగం చెందలేదు. కాబట్టి, శరీర అవసరాలను నిర్వహించడానికి తగినంత నీరు మనకు చాలా అవసరం. నీటిని ఎక్కువగా త్రాగడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. నీరు ఎక్కువగా త్రాగటం వలన శరీరంలోని వ్యర్ధాలు తొలిగిపోతాయి. అది అధిక బరువును నియంత్రిస్తుంది. రక్త ప్రసరణ పెంచుతుంది మరియు నాడీ వ్యవస్థను శుభ్రపరుస్తుంది.
చర్మాన్ని క్లీన్ చేసి ఇన్ఫెక్షనల వల్ల కలిగే బాక్టీరియాను తొలగిస్తుంది.
- మలబద్దకన్ని తగ్గిస్తుంది.
- శరీర ఉష్ణోగ్రతలుని తగ్గిస్తుంది.
- డీహైడ్రేషన్ ను నియంత్రిస్తుంది
- గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది
- తలనొప్పిని దూరం చేస్తుంది.
- వ్యాధినిరోధకతను పెంచుతుంది.
- ఆస్తమాను నివారిస్తుంది.
- ఆర్థరైటీస్ ను నివారిస్తుంది.
- బ్రెయిన్ పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
- ఎసిడిటి సమస్యలుండవు.
- చుండ్రు ని నివారించి జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది.
- కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- శరీర ద్రవాలను స్థిరంగా ఉంచుతాయి.
- మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
- శక్తి సామర్ధ్యాలను పెంచుతుంది.
అయితే నీటిని తీసుకోవడం కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. అప్పుడే సరైన ఫలితం ఉంటుంది.
కొన్ని అధ్యయనాల ప్రకారం నీటిని తీసుకోవటానికి సరియైన సమయం వ్యాయామనికి ముందు.
- ప్రొద్దునే లేచిన వెంటనే.
- భోజనం ముందు.
- స్నానానికి ముందు.
- నిద్రకు ముందు.
- అలసిపోయినప్పుడు.
- అల్పాహారానికిముందు.
ఇలా రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని త్రాగటం వలన అనారోగ్యం దరిచేరదు.