చిలకడదుంప వల్ల కలిగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

చిలకడదుంప.. తక్కువ ధరకు సులభంగా అందుబాటులో ఉండే వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే ఇవి అంతే ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో చూద్దాం..

Health Benfits Of Sweet potatoఈ దుంపల్లో బీటా కేరోటిన్, విటమిన్ ఈ, సీ, బీ 6, పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎక్కువగా మేలు చేస్తాయి. ఇందులో ముఖ్యంగా గ్లైకెమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ దుంపల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి చలికాలంలో తినడం వల్ల ఆ సీజన్లో వచ్చే జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఎందుకంటే విటమిన్ సి అనేది జలుబు, ఫ్లూ వంటి సమస్యలను దూరంచేస్తుంది. దీనిని తినడం వల్ల తక్షణ శక్తి కూడా మీ సొంతం అవుతుంది.

Health Benfits Of Sweet potatoనిజానికీ మధుమేహులు దుంపలు తినడం మంచిదని చెబుతారు. వీటిలోని ఎన్నో గుణాలు షుగర్ పేషెంట్స్కి మేలు చేస్తాయని చెబుతారు. ఇవి అధిక బ్లడ్ షుగర్ విరుగుడుకి కారణం కావు..అందుకే దీన్ని ఎక్కువగా తీసుకోవటం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని చెబుతున్నారు. అందుకే షుగర్ పేషెంట్స్ వీటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వీటిలో ఎక్కువగా శరీరంలోని అంతర్గత అవయవాలకు ఆక్సిడేటివ్ ప్రమాదాన్ని తగ్గించే స్పోరామిన్స్ని ఉత్పత్తి చేసే ప్రత్యేక సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

Health Benfits Of Sweet potatoవీటిని తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ దుంపల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ బీట్ని సరి చేసేందుకు సాయపడుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలోని కండరాల, నరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఇందులోని మెగ్నీషియం కూడా గుండె ధమనులకు చాలా మంచిది. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలకు అలసట నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. చిలగడదుంపల్లోని ప్రత్యేక గుణాలు ఏమైనా గాయాలు అయినప్పుడు వాటిని త్వరగా తగ్గించేలా చేస్తాయి. ఈ దుంపల్లో ఎక్కువగా శరీరానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయని తేలింది. అందుకే వీటిని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దుంపలను రెగ్యులర్గా తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. జుట్టు సమస్యలు దూరం అవుతాయి. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల ఎలాంటి స్కిన్, హెయిర్ ప్రాబ్లమ్స్ చెబుతున్నారు నిపుణులు.

Health Benfits Of Sweet potatoచిలగడదుంపల్లో శరీరానికి అవసరమయ్యే మినరల్స్, ఐరన్ శాతాలు అధికంగా ఉంటాయి. ఇవి కణాల సామర్థ్యాన్ని పెంచి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ను సరఫరా చేస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అదే విధంగా తెల్ల రక్త కణాల ఉత్పత్తిలో కూడా ఈ దుంపలు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల తెల్ల రక్త కణాలు పెరుగుతాయని తేలింది. దుంపలు తినడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి. ఇందుకు కారణంలో వీటిలో ఎక్కువగా డి విటమిన్ ఉండడమే. మనం తీసుకునే ఆహారం నుంచి శరీరానికి కావాల్సిన కాల్షియంని సమీకరిస్తుంది. డి విటమిన్ని సన్షైన్ విటమిన్ అంటారు. డి విటమిన్ ఎముకల ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో.. డి విటమిన్ కూడా అలానే.. దీని వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇందులో ఎక్కువగా కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్ ఉంటాయి.

Health Benfits Of Sweet potatoఇవి శరీరంలో విటమిన్ ఏ తయారు చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సెడెంట్స్లా కూడా పనిచేస్తాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తగ్గించి వృద్ధ్యాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఈ కారణంగా యంగ్గా కనిపిస్తారు. ఇందులోని ప్రత్యేక గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR