Home Health జామకాయలు అతిగా తినకూడదా ? ఎటువంటి కాయలు తింటే ఆరోగ్యానికి మంచిది

జామకాయలు అతిగా తినకూడదా ? ఎటువంటి కాయలు తింటే ఆరోగ్యానికి మంచిది

0

బోలెడంత ఆరోగ్యాన్ని ఇస్తూ చౌకగా దొరికే పండ్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా జామకాయలే. చౌకగా దొరికినా కూడా విలువైన పండ్లలో వుండే న్యూట్రీషియన్స్ ఈ జామలోనూ ఉంటాయి. అంతే కాకుండా వీటిని ఇండ్లలో కూడా పెంచుకునేందుకు అనువుగా ఉంటాయి.

జామకాయలుజామపండ్లు ఆరోగ్యానికీ అధిక లాభాన్ని చేకూరుస్తాయి. ఆపిల్ లాగానే జామ అనారోగ్యాన్ని దరిచేరనీయదు. కమలాకన్నా ఐదు రెట్లు ఇందులో విటమిన్‌ సి ఉంటుంది. నిమ్మ, నారింజలలో కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వుంటుంది. ఈ కాయ పండుతున్నకొద్దీ ‘సి’ విటమిన్ శాతం అధికమవుతుంది.

కేవలం విటమిన్‌ సి మాత్రమే కాదు. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, కేల్షియమ్‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. అపరిమిత పోషకాల నిలయం జామ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. కనుకనే దోరగా ఉన్న జామకాయను చూసిన వెంటనే తినేయాలనుకొనే వారుండరు. కొందరికి పచ్చి కాయలు అంటేనే మహా ఇష్టం.

అయితే జామకాయలు తినేటప్పుడు దోరగా పండిన లేదా గింజలు తక్కువగా ఉన్నవాటిని మాత్రమే తినాలట. పచ్చి జామకాయలో పాస్పరిక్,ఆక్సాలిక్ ఆమ్లాలు ఉండటం వలన వాటిని తింటే కడుపు నొప్పి వస్తుంది. ఎక్కువగా గింజలు ఉన్న జామపండ్లను తింటే అపెండిసైటిస్ వచ్చే ప్రమాదం లేకపోలేదు.

కనుక జామకాయలు తినే వారు గింజలు తక్కువగా ఉన్న జామకాయలను తినడం మంచిది. కాస్త పండినవే తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

 

Exit mobile version