డిప్రెషన్‌ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజసిద్ధమైన పద్ధతులు

ప్రస్తుత హడావిడి ప్రపంచంలో అత్యధికంగా కనిపించే సమస్య డిప్రెషన్. ఇది ఒక రకమైన మానసిక సమస్య. ప్రపంచ వ్యాప్తంగా 350 మిలియన్ల మంది డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే కొంతవరకు డిప్రెషన్‍ నుంచి బయట పడొచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Depressionతీవ్రమైన డిప్రెషన్‌ నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని సహజసిద్ధమైన పద్ధతులు వున్నాయి. ఈ పద్ధతులను అనుసరించడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చని అంటున్నారు. శరీరంలో విటమిన్‍ డి లోపం వల్ల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఉదయపు ఎండలో తిరగడం, చేపలు, పుట్టగొడుగులూ తినడం చేయాలి.

Vitamin Dఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాల లోపం కూడా డిప్రెషన్‍కి దారితీస్తుంది. అవిసె, బాదం, పిస్తా, వాల్ నట్స్ లో ‘విటమిన్‍- డి’ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తినొచ్చు. విటమిన్‍ బి 12, విటమిన్‍ బి9 లోపం వల్ల కూడా డిప్రెషన్‍కి గురవుతారు. పాలు, గుడ్లు, చేపలతో పాటు ఆకు కూరలు, పండ్లు, బీన్స్ వంటివి తీసుకోవాలి.

Nutsట్రిప్టోఫాన్‍ అనే ప్రొటీన్‍ ఒత్తిడిని తగ్గించే సెరటోనిన్‍ ని ఉత్పత్తి చేస్తుంది. సెరటోనిన్‌ డిప్రెషన్‌తో యుద్ధం చేసి దాన్ని పారిపోయేలా చేస్తుంది. ఆహారం ద్వారా సెరటోనిన్‌ చేరాలంటే గుడ్లు, కొబ్బరి నూనె, పుల్లటి చెర్రీలు, బీన్సు, పప్పు దినుసులు వంటి వాటిని అధికంగా తీసుకోవాలి.

cheeryఇక చాలా మందికి కాఫీ తాగే అలవాటు విపరీతంగా ఉంటుంది. కాఫీ తాగితే మూడ్‌ని బూస్ట్‌ చేయొచ్చని అంటుంటారు. ఇది నిజమే అయినప్పటికీ… చాలా తక్కువసేపు మాత్రమే మూడ్‌ బూస్ట్‌ అవుతుంది. కానీ కొన్నిసార్లు కాఫీ కూడా డిప్రెషన్‌కి కూడా కారణం అవుతుంది.

coffeకాఫీ తాగడం వల్ల మెదడులోని రసాయనాలు అస్తవ్యస్తమవుతాయి. కాఫీ ప్రభావం సెరటోనిన్‌ మీద ఎక్కువగా ఉంటుంది. అందుకని కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR