Home Life Style Here Is Everything About Bengal Tiger Sourav Ganguly

Here Is Everything About Bengal Tiger Sourav Ganguly

0

సౌరబ్ గంగూలి కి భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకానొక సమయంలో ఇండియన్ క్రికెట్ టీం లో తనని అధికంగా ప్రేమించే వాళ్ళని, ద్వేషించే వాళ్ళని చూసాడు. ఇక వన్డే లో సచిన్ టెండూల్కర్ తో కలసి ఓపెనింగ్ కి వెళితే అపోజిట్ టీం వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి చుక్కలు చూసేవారు. ఇక కెప్టెన్ గా వ్యవహరించి ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన సౌరబ్ గంగూలీ వళర్డ్ వైడ్ సక్సెఫుల్ కెప్టెన్స్ లో ముందు వరసలో ఉంటాడు. తన ఆటతో, యాటిట్యూడ్ తో అలరించిన సౌరబ్ ని అభిమానాలు ముద్దుగా దాదా, బెంగాల్ టైగెర్, కలకత్తా యువరాజు అంటూ పిలుచుకుంటారు. ఇక సౌరబ్ క్రికెట్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు? ఆయన సాధించిన ఘనతలు ఏంటి? సౌరబ్ వ్యక్తి గత విషయాలు, మరియు తన విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sourav Ganguly

సౌరబ్ గంగూలీ 1972 జులై 8 వ తేదీన చండీదాస్, నిరూపా గంగూలీ దంపతులకు జన్మించాడు. సౌరబ్ కి ఒక అన్న ఉన్నాడు అతడి పేరు స్నేహశీష్ గంగూలీ. అయితే సౌరబ్ తండ్రి అప్పట్లో కోలకత్తా నగరంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. సౌరబ్ కి చిన్నతనంలోనే మహారాజ అనే ముద్దు పేరు ఉండేది. ఇక తన బాల్యం అంత కూడా చాలా విలాసవంతంగా గడించింది. కలకత్తాలోని st. xavier’s collegiate school లో అయన చదివారు. తనకి ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టం అయితే తన అన్న స్నేహశీష్ గంగూలీ ప్రోత్సాహంతో క్రికెట్ వైపుకి అడుగులు వేసాడు. అప్పటికే తన అన్న బెంగాల్ ఆటగాడు. నిజానికి గంగూలీ కుడిచేతి వాటం వాడు అయినప్పటికీ తన అన్న పరికరాలు ఉపయొగించుకోవడం కోసం ఎడమ చేతి వాటంతో సాధన మొదలు పెట్టాడు. బ్యాట్స్ మెన్ గా గంగూలీ అద్భుత ప్రతిభ కనపర్చటంతో అతనిని క్రికెట్ అకాడమీలో చేర్చారు. అయితే సౌరబ్ కి ఇంగ్లాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్సమెన్ డేవిడ్ గోయర్ అంటే ఇష్టం ఉండేది. అతడి ఆటని ఎప్పుడు చూస్తుండేవాడు. ఇక అండర్ 15 లో గంగూలీ సెంచరీ సాధించడంతో సెయింట్ జేవియర్స్ పాఠశాల జట్టుకు నాయకుడిగా నియమించారు.

ఇక రంజిలలో మంచి పరుగులు సాధిస్తుండటంతో వెస్టిండీస్ తో జరగబోయే వన్డే సిరీస్ లో జట్టులో స్థానం ఏర్పరుచుకొని. 1992 వ సంవత్సరం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో తన మొదటి వన్డే మ్యాచ్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి తన ఆటపట్ల విమర్శలు ఎదుర్కొని జట్టులో స్థానం కోల్పాయాడు. అయితే దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్ లో 171 పరుగుకు సాధించటంతో ఇక తిరిగి మళ్ళీ జాతీయ జట్టులో స్థానం లభించింది. అప్పుడు తన మొదటి టెస్ట్ 1996 వ సంవత్సరం ఇంగ్లాండ్ తో లార్డ్స్ మైదానం లో ఆడాడు. ఈ ఆటలో గంగూలీ సెంచురీ సాధించి లార్డ్స్ లో అరంగేట్రం లోనే సెంచురీ సాధించిన మూడవ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇలా లార్డ్స్ అరంగేట్రంలో అత్యధిక పరుగుల రికార్డు 131 పరుగులు ఇంకా గంగూలీ పేరు మీదే ఉంది. టెంట్ బ్రిడ్జ్ లో జరిగిన తరువాతి ఆటలో మళ్ళీ సెంచురీ చేసి 136 పరుగులు సాధించటంతో క్రికెట్ చరిత్రలో అలా చేసిన మూడవ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

ఇక 2002 నుండి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహారించాడు. ఇక తన కెప్టెన్సీలో 21 టెస్ట్ లలో గెలిచింది. ఇలా అత్యధిక విజయాలు సాధించిపెట్టిన భారత కెప్టెన్ గా రికార్డ్ సృష్టించాడు. అయితే 2007 వ సంవత్సరంలో పాకిస్థాన్ తో తన లాస్ట్ వన్డే ఆడిన సౌరబ్ గంగూలీ, ఇక 2008 లో అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీసుతో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. తరువాత ఐపీల్ లో అడుగుపెట్టిన సౌరబ్ గంగూలీ 2012 లో ఐపీల్ నుండి కూడా రిటైర్ అయ్యాడు. సౌరబ్ గంగూలీ తన క్రికెట్ హిస్టరీలో మొత్తం 113 మ్యాచ్ లలో 188 ఇన్నింగ్స్ లో ఆడగా 7212 పరుగులు సాధించగా అందులో ఒక డబుల్ సెంచరీ, 16 సెంచరీలు, 35 అర్ద సెంచరీలు ఉన్నాయి. తన బౌలింగ్ తో టెస్టుల్లో 32 వికెట్లను తీసాడు. ఇక మొత్తం 311 వన్డేలు ఆడగా, 11363 పరుగులు చేసాడు. అందులో 22 సెంచరీలు, 72 అర్ద సెంచరీలు సాధించాడు. ఇక వన్డేలలో 100 వికెట్లు తీసాడు.

ఇక సౌరబ్ గంగూలీ సాధించిన రికార్డ్స్ విషయానికి వస్తే, వన్డే మ్యాచ్ లలో వరుసగా నాలుగు మాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన మొదటి క్రికెటర్ సౌరబ్ గంగూలీ. వన్డేలలో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్ లు సాధించిన ఐదుగురు క్రికెటర్ లలో సౌరబ్ గంగూలీ ఒకరు. ఇంకా వన్డే చరిత్రలో 11 వేలకు పైగా పరుగులు సాధించిన వారిలో ఇండియన్ క్రికెటర్స్ లో రెండవ స్థానం మరియు ప్రపంచ వ్యాప్తంగా 8 వ స్థానంలో ఉన్నాడు. అంతేకాకుండా వన్డేలలో అతి తక్కువ సమయంలో 9 వేల పరుగులు సాధించి రికార్డ్ సృష్టించాడు. వరల్డ్ కప్ లో 183 పరుగులు చేసి వరల్డ్ కప్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక స్కోర్ చేసిన ఇండియన్ క్రికెటర్ గా కూడా ఒక రికార్డ్ ఉంది. సౌరబ్ గంగూలీ కెప్టెన్ గా 28 మ్యాచ్ లు ఆడగా అందులో 11 మ్యాచ్ లు విజయం సాధించాయి. దీంతో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇండియన్ కెప్టెన్ గా అప్పట్లో రికార్డ్ సృష్టించాడు. ఇక భారతదేశంలో అత్యున్నత పురస్కారం అయినా పద్మశ్రీ అవార్డ్ అందుకున్నాడు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి 2013 వ సంవత్సరంలో బంగా బిభూషణ్ అవార్డు ని అందుకున్నాడు.

ఇక సౌరబ్ గంగూలీ వ్యక్తిగత విషయానికి వస్తే, ఒడిస్సి డాన్సర్ అయినా డోనా గంగూలీ ని 1997 వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. వీరికి 2001 వ సంవత్సరంలో సనా గంగూలీ జన్మించింది. అయితే సౌరబ్ గంగూలీ కార్స్ అంటే చాలా ఇష్టం, అయన కార్స్ కలెక్షన్ వింటే ఆచ్చర్యపడక తప్పదు. సౌరబ్ గంగూలీ దగ్గర 20 రకాల mercedes benz కార్స్ ఉన్నాయి. ఇంకా 4 BMW కార్స్ , ఆడి కార్ కూడా ఉంది. సౌరబ్ గంగూలీ దగ్గర ఉన్న మొత్తం కార్ల విలువ దాదాపుగా 350 కోట్లు. కలకత్తా లోని బెహలా చౌరస్తాలో ఒక విలాసవంతమైన విల్లా ఉంది. సౌరబ్ గంగూలీకి చాలా ఇష్టమైన క్రికెటర్ డేవిడ్ గోయర్. ఇంకా అప్పర్ కట్ షాట్ తనకి ఫేవరేట్ అని చెప్తాడు.

ఇది ఇలా ఉంటె, తన చురుకైన మాటలతో ఎన్నో విమర్శలు ఎదుర్కున్న సౌరబ్ గంగూలీ ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డ్స్ సాధించి క్రికెట్ అభిమానులలో దాదా గా చెరగని ముద్ర వేసుకున్నారు.

Exit mobile version