Here’s How A Small Communication Gap Destroyed The Relationship Between A Father & A Son

మా నాన్న అంటే పెద్ద మంచి అభిప్రాయం లేదు నాకు. ఇంకా Simple గా చెప్పాలంటే “His existence doesn’t matter to me anymore.”ఎందుకంటే, ఏమి చెప్తాం ఆ మనిషి మొఖంలో జీవం ఉండదు. ఆ కళ్ళు ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాయి.పచ్చి తాగుబోతు మా నాన్న, అలా అని మా అమ్మని నన్ను ఆయన ఏమి హింసించలేదు, అలా అని పెద్ద సుఖంగాను చూసుకోలేదు, ఏదో మూడు పూట్ల తిండి, కట్టుకోడానికి గుడ్డ ముక్క ఇచ్చాడు అంతే , అంతకుమించి ఆయన పీకింది ఏమి లేదు. నాకు ఇవాళ గతంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. ఎందుకో వాడి….కాదు….కాదు…ఆయన… అదే మా నాన్న బాల్యాన్ని , యవ్వనన్నీ తెలుసుకోవాలి అనిపిస్తుంది. అప్పుడు ఎంత మందికి నరకం చూపించాడో ఈ మనిషి కానీ మనిషి…పశువు కానీ పశువు!

Father Sonఇక గతంలోకి వెళ్దాం అయితే…

నాన్న తాగి రోడ్డులో పడి ఉన్నాడు. అబ్బా ఈ దరిద్రం మనకి తెల్సిన బాగోతమే కదా. ఆయన తాగి రోడ్ల మీద పడి నిద్రపోవడం, ప్రకాష్ అంకుల్ ఆయనని ఇంటికి తీసుకురావడం. ఈ దరిద్రం వద్దు, ఆయన కాలేజి రోజుల్లోకి పోదాం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది గ్రౌండ్లో, అయిన ఇక్కడ ఎందుకుంటాడు నాన్న, ఆ కాలేజి దగ్గర్లో ఉన్న బ్రాందీ షాపు దగ్గర ఉంటాడు కానీ. లేదే! ఎవడో బక్క పల్చని వ్యక్తి MRF బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి ఓపెనింగ్ చేయడానికి దిగుతున్నాడు. ఒరేయ్, అది మా నాన్నే, శివ సినిమాలో నాగార్జునలా ఉన్నాడు ఏంటి ఈయన!

ఆ MRF బ్యాట్ మా ఇంట్లో ఉండేది , నేను ఒకసారి దానిని ముట్టుకుంటే ఆయన దానిని నా దగ్గర నుంచి లాగేసి ఎక్కడో దాచేసాడు. దాని తరువాత ఆ MRF బ్యాట్ కోసం చాలా సార్లు వెతికే కానీ దొరకలేదు. బహుశా ఆ MRF బ్యాట్ చూస్తే ఆయనకి ఆయన చేతకాని తనం గుర్తుకువస్తుంది ఏమో! సరే చూద్దాం ఏమి పగలుగొట్టుకుంటాడో, పెద్ద పుడింగిలా ఓపెనింగ్ పోతున్నాడు. మొదటి బంతి square-cut ‘4’ Sehwag గుర్తుకువచ్చాడు. తర్వాత Innings అంత wide range of shots ఆడాడు. Sachin ని తలపించే Straight Drive, Ponting ని తలదన్నే mid-wicket మీదగా pull shots, Brain Lara లాంటి footwork ఒక complete player లా అనిపించాడు. కొంపదీసి “Jersey” సినిమా మా నాన్న కథ కాదు కదా! బొక్కలే మా నాన్నకి నాకు అంత బంధం ఎక్కడ ఏడ్చి చచ్చింది. అసలు ఆయన నన్ను ఇప్పటి దాకా ఒకసారి కూడా నన్ను “తాకాలేదు.” సినిమాలో నాని కుటుంబం కోసం ఆట వదిలేసాడు, మా నాన్న మాత్రం తాగి తాగి ఆటని మరిచిపోయుంటాడు. కానీ క్రికెట్ మాత్రం అద్భుతంగా అడుతున్నాడు.

ఇక కొంచెం ముందుకు వస్తే మా అమ్మ-నాన్న పెళ్లి రోజు. అబ్బా! As it is నేను expect చేసిన విధంగానే పెళ్లి జరుగుతుంది. ఇద్దరి మొహంలో చావు కల మెరిసిపోతోంది. అమ్మ అనాథ బంధువులు దగ్గర పెరిగింది, వాళ్లు అమ్మని ఎవడో ఒక గొట్టం గాడికి ఇచ్చి పెళ్లి చేస్తే చాలు అనుకున్నారు. మొత్తానికి వాళ్లకి ఒక గొట్టం దొరికాడు అది మా నాన్నే. ఏదో ఇదైన ఆయన అదృష్టం కొద్దీ అయ్యింది లేకుంటే ఆయన మొఖం చూసి పిల్లని ఎవడు ఇస్తాడు. మొత్తానికి పెళ్లి అయింది. ప్రేమ కూడా దగ్గర చెయ్యని మనుషులన్ని పడక దగ్గర చేస్తుంది అంటా. అలానే వీళ్లన్నీ దగ్గర చేసింది. అలా ఆ రెండు శూన్యలకి పుట్టిన చిట్టి సున్నాని నేను. మేము అందరం కలిసి వెళ్లిన మొదటి సినిమా టైటానిక్. Rose నగ్నంగా ఉంది Jack తన ఆత్మని గీస్తున్నాడు. అమ్మ నా కళ్ళు మూసేసింది. కానీ నాన్న అమ్మ ఏదో ఆలోచిస్తున్నారు. అమ్మ వచ్చి ఆ రోజు రాత్రికి వండే కూర గురుంచి ఆలోచిస్తుంది. మా అమ్మ జీవితం మొత్తం మాకు ఏమి వండి పెట్టాలో అన్న ఆలోచనాలతోనే గడిచిపోయింది. బహుశా చాలా మంది ఆడవాళ్ల జీవితాలు ఆకుకూర-చేపలకూర అనే ఆలోచనల మధ్యే ముగిసిపోతాయి ఏమో! ఇక నాన్న విషయానికి వస్తే ఆయన ఊహల్లో ఎవరో అమ్మాయి, సరిగ్గా మొఖం కనిపించట్లేదు. కానీ ఖచ్చితంగా తనకి నాన్నకి మధ్య ప్రేమ ఉంది అని అర్థం అవుతుంది. బాబోయ్ ఈయన గారికి మళ్ళీ ప్రేమ కథ కూడా ఉందా. అంటే ఇందాక “Jersey” ఇప్పుడు “Arjun Reddy” నా ఈయన. నా మొహంలే, ఈయన తాగుడు తట్టుకోలేక వదిలి పారిపోయ్యుంటుంది. తెర మీద అంత రొమాంటిక్ సన్నివేశం వస్తుంటే, ఒకరు ఏమో కూర గురుంచి, ఇంకొకరు ఏమో గత కాలపు ప్రియురాలి గురుంచి ఆలోచిస్తున్నారు. అందుకే అన్నింది “రెండు శూన్యలకి పుట్టిన చిట్టి సున్నాని నేను అని.” ఆదర్శ దాంపత్యం. అయిన ఈయనని ఒక అమ్మాయి ప్రేమించడం ఏంటి!

Father Sonఇక ఆయన బాల్యంలోకి వెళ్లే సమయం వచ్చేసింది. ఇది మా సొంత ఇల్లు, మా తాతయ్య కట్టించాడు, తాత ఒక మిలిటరీ ఆఫీసర్. మా నాన్న ఎంత దుర్మార్గడు అంటే మా తాత చనిపోయినప్పుడు తల కొరివి పెట్టడానికి కూడా వెళ్ళలేదు. అసలు దేనికి న్యాయం చేశాడు ఈయన. కొడుకు గా fail, భర్తగా fail, తండ్రిగా fail. పెళ్లి అయిన వెంటనే మా తాతని ఆ సొంత ఇల్లుని వదిలేసి అద్దె ఇంట్లో వచ్చి బతుకుతున్నడు. మా తాతని అలాగే ఆయన కట్టించిన ఇంటిని దగ్గరగా చూద్దాం అని గుమ్మం లోపు అడుగు పెట్టబోయను, గట్టిగా ఏదో శబ్దం, ఏంటా అని చూసాను, నాన్న చెంప పగిలిపోయింది, నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది నాన్న చెంపని చూడగానే, మా నాన్నని కొట్టినవాడు ఎవడో చచ్చాడు నా చేతుల్లో. మా నాన్న నా? అయిన నాకెందుకు కోపం వస్తుంది? మా నాన్నని కొడుతుంది వాళ్ళ నాన్నే అదే మా తాత, ఆయన అలా కొడుతున్నాడు ఏంటి, మెడని విరిచేస్తున్నాడు, గుండెల మీద ఎగిరి ఎగిరి తంతున్నాడు, ఇష్టమొచ్చినట్టు విసిరియెస్తున్నాడు. అయ్యో! నాన్న చచ్చిపోతాడు, నాన్న చచ్చిపోతాడు ఇలా అయితే. నాన్నని కాపాడాలి, నా కొడకా అంటూ మా తాతని బలంగా కొట్టాను , ఆయనికి ఏమి కాలేదు, మళ్ళీ నా బలం అంత ఉపోయోగించి మా తాతని కొడుతున్న కానీ ఆయనికి ఏమి కావట్లేదు…ఇది గతం కదా! నేనేమి మార్చలేను, కానీ నాకు అవేమి గుర్తురావట్లేదు మా నాన్నని కాపాడాలి అంతే లేకుంటే చనిపోతాడు. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది బహుశా నాన్నమ్మ ఏమో! నాన్నమ్మ ని చూడగానే తాత ఆమెపై విరుచుకుపడ్డాడు. ఇప్పటిదాకా దెబ్బలు తింటున్న నాన్న, నాన్నమ్మ మీదకి తాత వెళ్ళగానే, గట్టిగా తాతని ఒక తోపు తోసాడు. నాన్నమ్మని లాక్కెలి గదిలో పెట్టేసాడు నాన్న. ఇక తాత బెల్ట్ తీసి నాన్నని కొడుతున్నాడు, నాన్న వంటి నిండా ఎర్రటి వాతలు… అయ్యో ఇవి ఇలా వచ్చాయా, నేను ఇప్పటిదాకా ఆ వాతలు ఎక్కడో తాగిపడిపోతే యే పోలీసులో కొట్టారు అనుకున్న. నేను ఇక్కడనుంచి పారిపోవాలి, నాన్నని ఇలా చూడడం నా వల్ల కావట్లేదు, అక్కడ నుంచి వెళ్లిపోయే ముందు ఒక్క సారి నాన్నని తిరిగి చూసా, బెల్టు దెబ్బలు పడుతూనే ఉన్నాయి…కానీ నాన్న మొహంలో జీవం లేదు, ఆ కళ్ళు ఏదో వెతుకున్నాయి…ఏమి వెతుకుతున్నాడు?…ఇదంతా జరిగినప్పుడు నాన్న వయసు 10 ఏళ్లు.

నాన్న బాల్యం ఇదా! ఇంతటి హింస…అసలు నాన్న ప్రేమే మా నాన్న కి దక్కలేదు. ప్రేమ సంగతి తరువాత ఆయనికి దక్కింది అల్లా హింస. అవును కేవలం హింస మాత్రమే. ఇందుకేనా నాన్న ఎప్పుడు నన్ను దగ్గరికి తీసుకోలేదు, కనీసం తాకాలేదు కూడా నన్ను ఎప్పుడు. లేదు, నాన్న వేరు నేను అనుకున్న వ్యక్తి కాదు నాన్న. ఇంకా ఏదో తెలుసుకోవాలి ఆయన జీవితంలో….ఏమి తెలుసుకోవాలి….ఏమి తెలుసుకోవాలి…అదే నాన్న ఎందుకు ఇలా అయిపోయాడు…ఈ తాగుడు ఏంటి? అర్థమైంది ఏమి తెల్సుకోవలో…

ఆ రోజు Nellore District లెవెల్ క్రికెట్ selections జరుగుతున్నాయి. నాన్న ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాడు, నాన్నమ్మ వచ్చి MRF బ్యాట్కి పూజ చేసి కుంకుమ పెట్టింది. ఆ తరువాత ఆమెని కలిసాడు అదే మా నాన్నకి భార్య కానీ భార్య, తాను ఏమో బాగా Lipstickతో ఉంది…MRF పై తన పెదాలతో సంతకం చేసింది. నాన్న మొహంలో సిగ్గు…

Father Sonనాన్న అద్భుతంగా ఆడాడు, కానీ select కాలేదు…selection panel already 11 players ని ముందేగానే select చేసుకుంది…నాన్న మొహంలో మొదటిసారి కోపం, కానీ ఎవరిని ఏమి అనగలం మూసుకొని బయటకి రావాల్సిందే. ఇది సినిమా కాదు, వెళ్లి selection panel వాడి ముక్కు పగలు కొట్టడానికి. ఇంకా క్రికెట్ జరిగే పని కాదు అని నీరసంగా ఇంటికి వస్తున్నాడు, నాన్నకి ఇలా ఎప్పుడు అనిపించినా…నాన్నమ్మ ఇంకా ఆయన ప్రియురాలు ఆయనికి మాటలు చెప్పి నమ్మకం ఇచ్చే వాళ్లు ఏమో! నాన్న జీవితంలో నమ్మింది కాస్త దగ్గరగా ఉండింది ఈ ఇద్దరితోనే లా ఉంది. నాన్న తిరిగొచ్చేసారికి, నాన్నమ్మ చనిపోయింది. తాతయ్య చంపేసి పారిపోయాడు అంటా. నాన్న ఇప్పుడు కూడా ఎడవట్లేదు, అలా ఏదో వెతుకున్నాడు…ఏమి వెతుకున్నాడు? ఇంతలోనే ప్రకాష్ అంకుల్ వచ్చాడు, నాన్న చెవిలో ఏదో చెప్పాడు…ఏమి చెప్పాడు? నాన్న ప్రేమించిన ఆమెకి పెళ్లి అంటా… వాళ్ళ ఇంట్లో వాళ్లు వెంటనే ఇల్లు కాళీ చేసి ఏటో వెళ్లిపోయారు అంటా! ఆమె ఆచూకీ ఎవరికి తెలీదు అంటా… ఒక్క రోజులో నాన్న కన్న కళ, కనిపెంచిన తల్లి, కలిసి బతకాలి అనుకున్న అమ్మాయి అందరూ ఒక్కసారిగా దూరం అయిపోయారు. ఇప్పటికి ఆయన ఏమి ఎడవట్లేదు, మళ్ళీ ఏదో వెతుకున్నాడు…ఏమి వెతుకున్నాడు? ఇప్పటికి అదే చూపు…ఇప్పటికి వెతుకుతూనే ఉన్నాడు…

అంటే నాన్నకి తాగుడు అలవాటు అయింది ఈ క్షణం నుంచే లా ఉంది. నాన్నకి “Alcohol oka Escape” అంతే. భార్య కొడుకుల నుంచి Escape, ఆయన గతం నుంచి Escape, ఆయన భవిష్యతు నుంచి Escape. నాన్న అసలు ఇంటికి వచ్చేవాడు కాదు, ఆయనికి భయం ఆయన వల్ల మాకు ఏమి హాని జరుగుద్ద అని…ఎప్పుడు ఒక మాట అనలేదు…అమ్మ చనిపోయినప్పుడు నుంచి ఇక ఆయన నుంచి నేను బయటికి వచ్చేసాను…నేను పెళ్లి చేసుకుంది కూడా నాకు ఎవరు లేరు అని చెప్పే చేసుకున్న, అమ్మ పెంచింది అని, నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అని చెప్పి పెళ్లి చేసుకొని హాయిగా బెంగళూరులో బతుకుతున్న. ఇది నాన్నకి కూడా తెలుసు. ఇక నా వల్ల కాదు, నాన్నని కలవాలి వెంటనే…నా భార్య నా రెండే ఏళ్ల కొడుకుతో సహా నెల్లూరు కి ఇప్పుడే పోవాలి. నాన్న వస్తున్న ఇక భయపడకు. నువ్వు వెతికేది నాకు అర్థమయ్యిపోయింది. వస్తున్న నాన్న…

Father Son
ఇంకో అరగంటలో నెల్లూరు ఒక 9 ఏళ్ళు తరువాత అడుగు పెడుతున్న నెల్లూరులో. ఎన్నో ఆలోచనలు, ఎన్నో గుర్తులు, అప్పుడు ఈ నాన్న వల్ల నెల్లూరు నచ్చేది కాదు, ఇప్పుడు ఆయన వల్లే.

నెల్లూరులో జీవించాలి అనిపిస్తుంది.నెల్లూరులో ఏదో ప్రాణం ఉంది. నాన్నకి ఆయన మనవడిని చూపించాలి. మనవడితో నాన్నకి ఫోటోలు తీస్తా. ఎంతగానో సంతోషిస్తాడు. నెల్లూరులో దిగి మా ఇంటికి చేరుకున్నాం, అక్కడికి వెళ్తే ఆయన అక్కడ లేరు అని చెప్పారు, చుట్టూ పక్క వాళ్ళని అడిగితే తెలీదు అని చెప్పారు. ఇంకా నాకు తెల్సింది ప్రకాష్ అంకుల్ ఒక్కడే. ఆయన నెంబర్ లేదు…అతి కష్టం మీద ఆయన అడ్రస్ తెలుసుకొని ఆయన ఇంటికి పొయ్యము. ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు. ప్రకాష్ అంకుల్ నన్ను చూడగానే గుర్తు పట్టలేదు, కానీ దగ్గరగా చూసేసరికి వెంటనే గుర్తుపట్టేసాడు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, నాకు ఏమి వినపడట్లేదు, నాన్న ఎక్కడ అని గట్టిగా అరిచ…నాన్న లేడు రా!

నాన్న లేడు అంటే? చనిపోయాడు రా…నాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు, గుండె బద్దలయ్యేలా ఏడుస్తున్న, కానీ శబ్దం లేదు, కంటి నుంచి ఒక్క నీటి చుక్క కూడా రాలట్లేదు. అసలికి నాకు ఏడ్చే హక్కు ఎక్కడ ఉంది! కాసేపు తరువాత తేరుకొని ఎప్పుడు జరిగింది అని అడిగా, ఎందుకంటే ఎలా జరిగిందో నాకు తెలుసు గా తాగి తాగి చనిపోయింటాడు. మీ నాన్న చనిపోయి ఒక 5 ఏళ్ళు అవుతుంది రా. అయితే అందరూ అనుకున్నట్టు తాగి తాగి చావలేదు, నవ్వి నవ్వి చచ్చిపోయ్యాడు. నవ్వి నవ్వి చచ్చిపోవడం ఏంటి? అదే రా నీ పెళ్లి అప్పుడు నాన్నకి కాల్ చేసి, అమ్మాయి వాళ్ళ ఇంట్లో నువ్వు చనిపోయావ్ అని చెప్పి పెళ్లి చేసుకుంటున్న అని చెప్పావు అంట కదా! అదే మాట నాకు వచ్చి చెప్పాడు, నవ్వుతూనే ఉన్నాడు, నవ్వుతూనే ఉన్నాడు, మీ నాన్న నవ్వు చూసే ఒక 30 ఏళ్ళు అవుతుంది. అలాంటిది ఆ రోజు నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతూనే ఉన్నాడు. అలా నవ్వి నవ్వి చచ్చిపోయ్యాడు రా…ఎంత మంది నవ్వుతూ పోతారు రా…చెప్పు…ఆయన నాకు ఎందుకు చెప్పలేదు ఈ విషయం… మీ నాన్ననే చెప్పవద్దు అన్నాడు…అయితే వచ్చాక ఆ MRF బ్యాట్ ఇవ్వమన్నాడు రా నీకు…ఆ బ్యాట్ తీసుకున్న దాని పై ఏదో రాసి ఉంది.

“నన్ను క్షమించు రా, నాకు ప్రేమంటే భయం.”

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR