వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పంచముఖేశ్వర ఆలయానికి ఉన్న శాపం ఏంటి?

0
2195

మన దేశంలో అతి పురాతన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఐదు శివలింగాలు ఉండగా ఒక్కో లింగానికి ఒక్కో పేరు ఉంది. ఒకే రోజు ఈ ఐదు శివలింగాలని దర్శించాలనే నియమం ఉంది. మరి ఈ పంచముఖేశ్వర ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

pamchalinga darshnamకర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో తలకాడు అనే ప్రాంతంలో పంచముఖేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ వైద్యేశ్వర, ఆర్కేశ్వర, వాసుకేశ్వర, సాయికటేశ్వర, మల్లికార్జున అనే ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నవి. శివుడిని ఈ ఆలయంల వైద్యనాధుడిగా కొలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతకుడా ఇసుకతో ఉంది ఒక ఎడారి వలె కనిపిస్తుంటుంది. ఈ ప్రాంతం అంత ఇసుక దిబ్బగా మారిపోవడానికి కూడా ఒక కారణం ఉందని చెబుతారు.

pamchalinga darshnamఒకప్పుడు ఈ ప్రాంతాన్ని విజయనగర రాజులూ, ఆ తరువాత మైసూరు రాజులూ పరిపాలించగా, అలమేలు అమ్మవారి నగలపైనా కన్నువేసిన మైసూర్ రాజు తన సైన్యంతో తలకాడు పైన దాడి చేయగా, ఈ ప్రాంతం అంతకుడా ఇసుక దిబ్బగా మారిపోవాలని, మైసూర్ రోజులకి వంశం అనేది లేకుండా పోతుందని శపించి తన నగలతో పాటుగా కావేరి నదిలో దూకి చనిపోయిందట.

pamchalinga darshnam

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, సోమదత్తుడు అనే ఒక ఋషి తన శిష్యులతో కలసి తీర్థయాత్ర చేస్తుండగా ఈ ప్రాంతానికి చేరుకోగానే అడవి ఏనుగులు వారిని చంపివేయగా, మరు జన్మలో సోమదత్తుడు అతడి శిష్యులు ఏనుగులుగా జన్మించి శివుడి కోసం ప్రార్థనలు చేస్తూ అక్కడ ఉన్న ఒక చెట్టులో శివుడిని చూసుకుంటూ ఆ చెట్టుకు పూజలు చేస్తుండేవారు. అయితే ఒకరోజు తలా, కాడ అనే ఇద్దరు ఆ చెట్టుని చూసి ఆశపడి గొడ్డలితో చెట్టుని నరకాలని భావించి గొడ్డలితో ఒక్క యెటు వేయగానే అందులో నుండి రక్తం వచ్చినది. అప్పుడు ఆకాశవాణి నుండి నేను శివుడిని నా భక్తుడి కోసం ఈ చెట్టులో ఉన్నానని మాటలు వినిపించాయట. అందుకే ఈ ప్రాంతానికి తలకాడు అని పేరు రాగ, శివుడు తన గాయాన్ని తానె నయం చేసుకోవడంతో వైద్యనాధుడిగా ఇక్కడ ప్రసిద్ధి చెందాడని పురాణం.

pamchalinga darshnam

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ పంచలింగ దర్శనం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఆ పంచలింగ దర్శనం కూడా కార్తీక పౌర్ణమి రోజున రెండు నక్షత్రాలు ఖుహ యోగ మరియు విశాఖ కలసినప్పుడు ఏర్పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా వరకు ఇసుక దిబ్బలతో కూరుకుపోయి ఉన్నది. ఇక్కడ ఒకప్పుడు ఎన్నో దేవాలయాలు ఉండగా, ఇప్పుడు మాత్రం వైద్యనాథ ఆలయం తో పాటు మరికొన్ని ఆలయాల లోకి మాత్రమే వెళ్లాడని వీలు ఉంది.

SHARE