Home Unknown facts రత్న సంపదలు కాపాడి గ్రామదేవతగా వెలసిన రాట్నాలమ్మ తల్లి ఆలయ చరిత్ర

రత్న సంపదలు కాపాడి గ్రామదేవతగా వెలసిన రాట్నాలమ్మ తల్లి ఆలయ చరిత్ర

0

శ్రీ రాట్నాలమ్మ తల్లి స్వయంభువుగా ఆవిర్భావం జరిగిందని తెలుస్తుంది. తూర్పు చాళుక్యుల కాలంలో వెలసిన ఈ అమ్మావారిని గ్రామదేవతగా కొలుస్తారు. మరి ఈ అమ్మవారి ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sri Ratnalamma Thalli

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, పచ్చిమగోదావరి జిల్లా, వేదగిరి మండలంలో రాట్నాల కుంట అనే గ్రామం లో రాట్నాలమ్మ తల్లి అనే గ్రామదేవత ఆలయం ఉంది. అయితే చుట్టూ పక్కల గ్రామాలలో గల రైతులు పండించిన పంట మొదటిసారిగా అమ్మవారికి సమర్పించుట ఈ క్షేత్రంలోని ప్రత్యేకతగా చెప్పుకోవాలి.

అయితే పూర్వం వేంగి రాజుల ఖజానాలు విశేషమైన రత్న సంపదలతో మణి మాణిక్యాలతో వజ్ర వైడుర్యాలతో తులతూగేది. ఈ సంపదను కాపాడటానికి ఓ మహాశక్తిని వేంగిరాజులు ఆశ్రయించారు. ఆ శక్తిని వారు ఇలవేల్పుగా కొలిచి పూజించి అధిపత్యమిచ్చారు. ఆ శక్తియే శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు. కాళీ ప్రభావంతో కొంత మంది దొంగలు ఈ సంపదను దోచుకోవాలని తలచి ఈ సంపదను ఒక శక్తి కాపాడుతుందని తెలుసుకొని వారు ఒక మాంత్రికుని ఆశ్రయించారు.

అయితే గ్రహణ సమయంలో దేవతలు అశక్తులు అవుతారని తెలిసిన ఆ మాంత్రికుడు ఒకానొక రోజున చంద్రగ్రహణం రోజున పూజ ప్రారంభించి దుష్టగ్రహ సముదాయం కొలువున్న సమయంలో మంత్రం ఖడ్గాన్ని సంపాదించి దానిని ఆ శక్తిపై ప్రయోగించాడు. అప్పుడు అది నేరుగా వచ్చి అమ్మవారి కంఠాన్ని తాకగా అమ్మవారి కోపాగ్నికి ఈ ప్రాంతంలోని అరణ్యం అంత దగ్ధం అయింది. ఆ అగ్నిలో మాంత్రికులు, ఆ దొంగలు మాడి మసైపోయారు.

అప్పుడు వేంగీమహారాజు రాజపురోహితులని పరిణామానికి కారణం ఏంటని అడుగగా, ఆ మహాపండితులు జరిగిన విషయం గ్రహించి ఆ రాజుకి చెప్పారు. అప్పుడు ఆ రాజు శక్తిని శరణువేడగా అందుకు శాంతించిన దేవి మహారాజుకి అభయమిచ్చి వరం కోరుకోమనగా, నీ దర్శన భాగ్యం మాకు ఎల్లప్పుడు ఉండాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి, నీ పాదసేవ చేసే భాగ్యం మాకు కల్పించామని కోరగా, అందుకు అమ్మావారు ఓ రాజా వజ్ర వైడూర్యాలు రత్నాలు అర్చించి నన్ను శాంతిపజేసావు, నేను ఈ ప్రాంతమునందు రత్నాలమ్మగా నిలిచి పూజలు అందుకుంటానని ఒక చేతిలో ఖడ్గముతో, మరొక చేతిలో అమృత కలశముతో పులివాహనంపైన వెలసింది.

ఈవిధంగా ఆనాడు వెలసిన రత్నాలమ్మే నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయం లో ప్రతి సంవత్సరం చైత్రశుద్ద పౌర్ణమి నుండి 5 రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవములు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

Exit mobile version