శివుడి చెమట నుండి జన్మించిన ఈ నది ఎప్పుడు ఎండిపోకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఎందుకు ?

0
1602

దేశంలో ఉన్న పవిత్ర నదులలో నర్మదానది ఒకటి. నర్మదానది జన్మస్థలం అయినా ఈ పవిత్ర స్థలంలో పూర్వం కపిల మహర్షి తపస్సు చేసాడు. ఇక్కడి కపిలధార మరియు ఆమర్ కంటక్ వంటి పవిత్ర క్షేత్రాలు భక్తులను మాత్రముగ్దల్ని చేస్తాయి. మరి నర్మదానది జన్మస్థలం ఎక్కడ? ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Temple

మధ్యప్రదేశ్ రాష్ట్రం, షాహ్ డోల్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో నర్మదాదేవి ఆలయం ఉంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ పుణ్యస్థలమే నర్మదాదేవి జన్మస్థలం అని చెబుతారు. శివుడి చెమట నుండి నర్మదా నది పుట్టిందని పురాణం. అందుకే ఈ నది దక్షిణ గంగా అని ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర పుణ్యస్థలం సముద్రమట్టానికి సుమారు మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఎన్నో ఆలయాలు ఉండగా అందులో, అమరకంటేశ్వర్, పార్వతీదేవి, నర్మదాదేవి ఆలయాలు ముఖ్యమైనవిగా చెబుతారు.

2-Nadhi

ఇక నర్మదాకుండ్ లో అమరకంటేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇదే నర్మదానది జన్మించిన స్థలం అని చెబుతారు. నర్మదాదేవి ఆలయాన్ని ఆనుకొని ఒక చిన్న కొలను ఉండగా, ఇందులో నీరు ఎప్పుడు ఊరుతూ ఉంటుంది. ఇలా ఊరుతున్న నీటి నుండి నర్మదానది ముందుకుసాగుతూ 70 అడుగుల ఎత్తునుండి జలపాతం వలె కిందకు దూకుతుంది. దీనినే కపిలధార అని అంటారు. కపిలమహర్షి పూర్వం ఇక్కడే తపస్సు చేసేవాడని పురాణం. ఇక్కడి నుండి మరికొంత దూరంలో దుగ్దధార అనే జలపాతం ఉంటుంది.

History of Narmada river

ఇక్కడ నర్మదను మేఖల మాతగా భక్తులు కొలుస్తారు. శ్రీచక్ర ఆకారంలో నిర్మించిన అమ్మవారి ఆలయం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈవిధంగా శివుడి చెమట నుండి జన్మించిన నర్మదా నది ఎప్పుడు ఎండిపోకుండా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే, దేశంలో ఏ నదికి కూడా ప్రదక్షిణ అనేది చేయరు కానీ ఒక్క నర్మదానది కి ప్రదక్షిణ చేస్తారు. ఇలా ప్రకృతి అందాల నడుమ నర్మదానది పుట్టిన పవిత్రస్థలాన్ని, అమరకంటేశ్వరుడిని దర్శించడం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

SHARE