Home Health చర్మం తెల్లగా మారడం కోసం సులువైన చిట్కా

చర్మం తెల్లగా మారడం కోసం సులువైన చిట్కా

0

కొంతమంది చామన ఛాయగా ఉన్నా జిడ్డు కారణంగా నల్లగా మారిపోతుంటారు. మరికొంతమంది ఎండా కారణంగానో, కాలుష్యం కారణంగానో మరే ఇతర కారణాలతోనే రంగు తగ్గిపోతుంటారు. సహజంగా ప్రతి ఒక్క అమ్మాయి తెల్లగా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం వివిధ రకాల బ్యూటీ ఎక్స్ పరమెంట్స్ చేస్తుంటారు. మార్కెట్లో వచ్చే కొత్త కొత్త క్రీమ్ లు, ఫేస్ వాష్ లు, ఉపయోగిస్తుంటారు. చర్మం తెల్లబడటం కోసం ఖరీదైన క్రీమ్స్, లోషన్స్ అంటూ వేలాది రూపాయిలను ఖర్చు చేస్తుంటారు.

Home Made Skin Whitening Tipsఇవన్నీ ఇన్ స్టాంట్ గా ప్రయోజనాలను అందించేవే కానీ, శాశ్వతంగా ఎలాంటి మార్పులు తీసుకురావు. అంతే కాదు మార్కెట్లో లభించే క్రీమ్స్ కెమికల్స్ తో తయారుచేయడం వల్ల చర్మానికి హాని కలిగిస్తాయి. కాబట్టి, కాస్త శ్రద్ద పెట్టి చూస్తే మన చుట్టూనే అనేక నేచురల్ రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో ఎలాంటి వారైనా కొన్నిరోజుల్లో తెల్లగా అవ్వడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.

దానికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. ఈ రెమెడీ కోసం మనం తీసుకోవాల్సినవి కేవలం రెండే రెండు పదార్ధాలు. ఒకటి బీట్ రూట్. రెండోది వరిపిండి. బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు అందానికి ఎంతో ఉపయోగపడుతుంది. చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్‌ బి బీట్‌రూట్‌‌లో దండిగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.

బీట్ రూట్ ని పొట్టు తీసి మెత్తని వేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి. దీనిని వడకట్టి దీని రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని స్టవ్ పై పెట్టి కొంచెం కలర్ మారేంతవరకు మరిగించాలి. తర్వాత స్టవ్ ఆపేసి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత దీనిలో ఒక కప్పు వరిపిండిని కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తం కలుపుకోవాలి. వరి పిండి కలిపేతే ఆ పేస్ట్ కాస్త డ్రైగా అయిపోతుంది. అప్పుడు దీనిని ఒక గంట సేపు ఎండలో పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండి జల్లించడం వలన మెత్తని పిండి వస్తుంది.

ఈ పౌడర్ ని గాజు గ్లాసులో నిల్వచేసుకొని నెల వరకూ స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న పిండిని నాచురల్ బాత్ పౌడర్ గా ఉపయోగించుకోవచ్చు. ఈ పౌడర్ను రెండు చెంచాలు తీసుకొని దీనిలో కొంచెం వాటర్ కలుపుకోని బాడీకి అప్లై చేసుకోవాలి. వరి పిండి కలుపుకున్నాం కాబట్టి ఇది చర్మానికి స్క్రబ్ చేసుకునే విధంగా ఉంటుంది. వాటర్ కలిపిన పౌడర్ ని బాడీ మొత్తం రాసుకొని నెమ్మదిగా మసాజ్ చేయాలి. కాసేపు అలా మసాజ్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఈ నాచురల్ పౌడర్ తో ఇలా రోజూ స్నానం చేయడం వలన శరీరం మొత్తం మంచి రంగు వస్తుంది. ఒకవేళ దీన్ని ముఖానికి అప్లై చేయాలి అనుకుంటే దీనిలో ఒక స్పూన్ పాలు ఒక స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి ప్యాక్లా అప్లై చేయాలి. ఎందుకంటే వరిపిండి స్క్రబ్ లా ఉంటుంది. ముఖంపై చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి హాని కలగకుండా పాలు, అలోవెరా జెల్ కలుపుకుంటే సరిపోతుంది. అయితే దీనిని మందంగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఆరిన తర్వాత వాటర్ తో మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలి.

ఈ ప్యాక్ ని ఒక్కసారి అప్లై చేసినప్పుడే మంచి ఫలితం కనిపిస్తుంది. తరచు చేస్తూ ఉంటే శరీరం మొత్తం మంచి రంగును సంతరించుకొంటుంది. ఇందులో నాచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగించాం కాబట్టి ఎటువంటి దుష్ప్రభావాలు కూడా లేకుండా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.

Exit mobile version