శరీరం మీద ఇతర భాగాల్లో వచ్చే మొటిమలు తగ్గించే ఇంటి చిట్కాలు

ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎదుర్కుంటున్న సమస్య మొటిమలు. మారుతున్న జీవన శైలితోపాటు హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్, దుమ్ము ధూళి, పొల్యుషన్, చుండ్రు, మానసిక ఒత్తిడి, మోనోపాజ్‌, కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రోడక్ట్స్, పీసీఓడీ, రిఫైన్డ్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలా రకరకాల కారణాలతో పింపుల్స్ వస్తాయి. మొటిమలు మొదలైన కొత్తలో నిర్లక్ష్యం చేస్తే ఇదో పెద్ద స్కిన్ ప్రాబ్లెమ్‌గా తయారవడం ఖాయం.

మన చర్మంపై సెబెషియస్ గ్రంధులు ఉంటాయి. ‘సీబం’ అనే పదార్థాన్ని ఈ గ్రంధులు రిలీజ్ చేస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో సెబెషియస్ గ్రంధులు అతిగా స్రవించడం వల్ల చర్మ రంధ్రాలు మూత బడిపోతాయి. ఫలితంగా మొటిమలు ఏర్పడతాయి. ఇవి ఎంతో బాధకు గురిచేసి వెంటాడి వేధిస్తుంటాయి. అంతేకాక, వాటి గుర్తులుగా మచ్చలను వదిలేస్తుంటాయి.

3-Mana-Aarogyam-780కొంద‌రికి మొటిమ‌లు చెంప‌ల‌పై వ‌స్తే కొంద‌రికి నుదిట‌పై, ఇంకొంద‌రికి గ‌డ్డంపై వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రికి వీపుపై సైతం మొటిమ‌లు వ‌స్తుంటాయి. గోడకో లేదో కుర్చీకో ఎక్కువ సేపు వీపును ఆన్చి కూర్చుంటే మొటిమల సమస్య తప్పదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారికి మొటిమలతోపాటు దద్దుర్లు కూడా ఏర్పడతాయి.ఈ వీపుపై వ‌చ్చే మొటిమ‌లు అంత త్వ‌ర‌గా పోవు. తీవ్ర అసౌక‌ర్యానికి గురిస్తాయి. వీపు మీద వచ్చే మొటిమలు చాలా నొప్పితో కూడుకుని, నివారణకు కష్టతరంగా ఉంటాయి.

2-Mana-Aarogyam-780అయితే శరీరం మీద ఇతర భాగాల్లో వచ్చే మొటిమల వలే వీటిని కూడా సులువుగా నివారించుకోవచ్చు. వంటగదిలో దొరికే ప్రకృతి సహజమైన పదార్థాలను వినియోగించుకోని వీటిని తగ్గించుకోవచ్చు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కలబంద. ఇది సహజమైన యాంటీమైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు కలిగివున్నందున, మొటిమలను కలుగజేసే బాక్టీరియాను నాశనం చేయడమే కాక, నష్టపోయిన చర్మాన్ని మెరుగుపరిచి, మచ్చలను తగ్గిస్తుంది.

అంతేకాక, దీనికి చర్మాన్ని చల్లబరిచే గుణం కూడా ఉంది. కలబంద ఆకును కత్తితో తెరచి, దానిలోని గుజ్జును వెలికితీసి ప్రభావిత ప్రదేశంలో నేరుగా రాసుకోవాలి. దీనిని రోజుకు రెండు సార్లు రాసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు.

4-Mana-Aarogyam-780పుదీనా పేస్ట్‌, అర స్పూన్ ఆరెంజ్ జ్యూస్‌, అర స్పూన్ లెమెన్ జ్యూస్, చిటికెడు ప‌సుపు వేసుకుని క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌ల‌పై అప్లై చేసి ఇర‌వై నిమిషాల అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్ర‌తి రోజు చేస్తే మొటిమ‌లే కాదు వాటి తాలూకు మ‌చ్చ‌లు కూడా తగ్గిపోతాయి.

టొమాటోలలో సాల్సిలిక్ యాసిడ్ మరియు విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇవి రెండు ప్రభావవంతంగా మొటిమలను తుడిచిపెట్టేసి, మేనిఛాయను తేలిక పరచి, చర్మాన్ని రిపేర్ చేస్తాయి. టొమాటోలో ఉండే కేరోటీన్ లో సహజమైన యాంటిఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫలమేటరీ ఏజంట్లు మన శరీరానికి ప్రయోజనాలు కలిగిస్తాయి.

7-Mana-Aarogyam-780అలాగే కొన్ని క్యారెట్ ముక్క‌ల‌ను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సంలో తీసుకోవాలి. రెండు స్పూన్ల క్యారెట్ ర‌సానికి ఒక స్పూన్ రోజ్ వాట‌ర్ క‌లిపి మొటిమ‌లు ఉన్న చోట‌ పూయాలి. బాగా డ్రై అయిపోయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో వీపును క్లీన్ చేసుకోవాలి. రెగ్యుల‌ర్‌గా ఇలా చేసినా వేధిస్తున్న మొటిమ‌లు మ‌టుమాయం అవుతాయి.

6-Mana-Aarogyam-780నిమ్మకాయలో మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది సహజమైన బ్లీచ్ గా పనిచేసి, మేనిఛాయను మరియు వీపుపై ఉండే వెంట్రుకల రంగును తేలిక పరుస్తుంది. ఇది చర్మంలో కొల్లాజన్ ను పెంచి, వీపుపై ఉన్న మచ్చలను తొలగించి, ఇకపై మొటిమలు ఏర్పడకుండా చేస్తాయి.

8-Mana-Aarogyam-780మరో సింపుల్ రెమెడీ పసుపు. దీనిలో ఉండే కుర్కుమిన్ మొటిమల వలన కలిగే నొప్పి మరియు మంటను తగ్గించి, మొటిమలను కలుగజేసే హానికారక బాక్టీరియాతో పోరాడుతుంది. మొటిమల నివారణకు రెండు టీ స్పూన్ల పసుపును, నువ్వులనూనెతో కలిపి ముద్దగా చేసి, ప్రభావిత ప్రాంతాల్లో రాసుకోండి. గంటసేపు ఆరనిచ్చి కడిగేయండి.

5-Mana-Aarogyam-780తేనె కూడా వీపు మీద మొటిమలను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. తేనెలో యాంటీబాక్టీరియల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు మొటిమలను తగ్గించి, వాటిని వ్యాప్తి చెందకుండా చేస్తాయి. దీనికై మీరు చేయవలసినదల్లా, ప్రభావిత ప్రాంతాల్లో తేనెను రాసుకుని, పావుగంటసేపు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకు రెండు,మూడుసార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

1-Mana-Aarogyam-780

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR