ఈ చిన్న చిట్కాలతో మూడు వారాల్లో మృదువైన పెదాలు మీ సొంతం

ముఖానికి అందాన్నిచ్చే అందమైన పెదవులు వాతావరణ మార్పుల వల్ల తరచూ పొడిబారుతుంటాయి. పెదవులు పగిలి అందవిహీనంగా కనబడటమే కాకుండా నొప్పి కూడా వస్తుంది. ఈ సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు పెదవుల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గులాబీ రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముళ్ళలా మారి ఇబ్బంది పెడతాయి. పొడి చర్మం ఉన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

Home tips for dry lipsదీనికోసం మార్కెట్లో దొరికే క్రీమ్స్, ఆయిల్స్ వంటివి వాడాల్సిన అవసరం లేదు ఇంటిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో పెదవులను మృదువుగా మార్చుకోవచ్చు. అందుకే కోమలమైన, మెరిసే పెదవుల కోసం కొన్ని ఇంటి చిట్కాలను చూసేద్దాం.

Home tips for dry lipsఆరిన పెదవులను తరచూ నాలుకతో తడపడం వల్ల పెదవులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది గానీ దీనివల్ల పెదవులకు వేగంగా తేమను కోల్పోయి సున్నితత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి ఆ అలవాటుని తగ్గించుకోవాలి.

Home tips for dry lipsబంగాళదుంప ముక్కలు కట్ చేసి ఆ ముక్కతో పెదాలను చుట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు రోజులపాటు చేస్తే పెదాలు మృదువుగా మారతాయి. పెదాలపై మృతకణాలు కూడా తొలగిపోతాయి.

Home tips for dry lipsమిగిలిన చర్మంపై ఉన్నట్టుగా పెదాలపై ఎలాంటి తైల గ్రంథులు ఉండవు కనుక ఇవి త్వరగా పొడిబారి బిరుసెక్కుతాయి. కాబట్టి వీటికి తాజా కలబంద గుజ్జు రాసి తేలిగ్గా మర్దన చేస్తే పెదవులకు తగినంత తేమ సమకూరి మెత్తబడతాయి.

Home tips for dry lipsఅలాగే మరో చిట్కా కూడా ఉంది రాత్రి పడుకునే ముందు పెదాలపై తేనె రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. గులాబీ రేకులను మెత్తని పేస్ట్ గా చేసి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసి ఐదు నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజూ పెదవులకు మీగడ రాసుకుంటే సున్నితంగా, మృదువుగా మారతాయి. లేత కీరా దోసముక్కతో తరచూ రుద్దితే కూడా పెదవులకు తగినంత తేమ అందుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR