Home Health జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే ఇంటి చిట్కాలు

0

సమయం సందర్భం లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా అనేక సమస్యలు చుట్టుముడతున్నాయి. చాలా మంది వైరల్ ఫీవర్‌‌తో బాధపడుతున్నారు. దీనికి ఆస్పత్రుల చుట్టూ తిరిగి టెస్ట్‌లు చేయించుకుని వైరల్ ఫీవర్ అని తెలియగానే భయపడి పోయి యాంటీ బయాటిక్స్ వాడుతున్నారు.

Home tips for feverఅయితే, రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే వైరల్ ఫీవర్స్ మనపై దాడి చేస్తాయి. అయితే, హై టెంపరేచర్ తో వచ్చే జ్వరాలు ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రమాదకరముగా ఉంటాయి. కాబట్టి వైరల్ ఫీవర్‌ని తగ్గించేందుకు యాంటీ బయాటిక్స్ కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్ ఫీవర్స్ కూడా వాకౌట్ చేస్తాయి. అలాంటి కొన్ని ఎపెక్టివ్ హోం రెమిడీస్ ఇప్పుడు చూద్దాం.

జ్వరానికి తక్షణ ఉపశమనం కలిగించే చిట్కాలు గోరు వెచ్చని స్నానపు నీటిలో అరకప్పు వెనిగర్ వేసి ఐదు నుంచి పది నిమిషాలు అయిన తర్వాత స్నానం చేయాలి

ఆర్టిచోకెస్ లను మృదువుగా అయ్యేవరకు ఉడికించాలి. ఆకుల యొక్క కింది భాగంను తినాలి. జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఒక కప్పు వేడినీటిలో కొన్ని తులసి ఆకులను వేసి 5 నిముషాలు ఉంచి,ఆ నీటిని రోజులో మూడు నుండి నాలుగు సార్లు త్రాగాలి. మరుసటి రోజు హై ఫీవర్ తగ్గుతుంది. ఇది చెమట పట్టుటను ప్రోత్సహించి జ్వరం తగ్గుతుంది. అలాగే పిప్పరమెంటు, పెద్ద పూలు మరియు యారో వంటి ఇతర మూలికలు కూడా ఉన్నాయి.

ఒక కప్పు వేడినీటిలో ఒక స్పూన్ ఆవాలు వేసి 5 నిముషాలు అయ్యాక త్రాగాలి. కొన్ని గంటల్లో జ్వరం తగ్గుముఖం పడుతుంది.

బంగాళదుంప ముక్కలను వెనిగర్ లో 10 నిముషాలు ఉంచండి. నుదురు పై ఒక తడి వస్త్రం వేసి దాని మీద బంగాళదుంప ముక్కలను ఉంచాలి. ఫలితాన్ని 20 నిమిషాల్లో చూడవచ్చు.

పాదం అడుగున నిమ్మకాయ ముక్కను పెట్టి తడిగా ఉన్న కాటన్ సాక్స్ తో కవర్ చేయాలి. దీనిని ఉన్ని సాక్స్ తో కవర్ చేయాలి. సాక్స్ చికిత్స కు ప్రత్యామ్నాయంగా గుడ్డు తెల్ల సోనలో రెండు వస్త్రాలను నానబెట్టాలి. వీటిని అరికాళ్ళపై ఉంచి సాక్స్ తో కవర్ చేయాలి.

రెండు స్పూన్ల ఆలివ్ నూనెలో రెండు పెద్ద వెల్లుల్లిపాయల పేస్ట్ ను కలిపి, రెండు పాదాల కింద పెట్టి క్లాత్ తో కప్పాలి. రాత్రి సమయం అంతా అలా ఉంచేయాలి. ఆలివ్ నూనె మరియు వెల్లుల్లి రెండూ జ్వరానికి అద్భుతమైన హోం రెమడీస్ గా ఉన్నాయి.

అధిక జ్వరం ఉన్నప్పుడు, అరకప్పు నీటిలో 25 ఎండు ద్రాక్షలను వేసి నానబెట్టాలి. బాగా నానాక నీటిలో ఎండు ద్రాక్షను క్రష్ చేయాలి. దీనిలో కొంచెం నిమ్మరసం కలిపి రోజులో రెండు సార్లు త్రాగాలి. జ్వరానికి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

పాదాల కింద పచ్చి ఉల్లిపాయ ముక్కలను పెట్టి ఒక వెచ్చని దుప్పటితో కప్పాలి. త్వరగా జ్వరం తగ్గుతుంది.

 

Exit mobile version