డయాబెటిస్‌, థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లుకు కారణమా ?

చలికాలంలో పాదాల పగుళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. చలి, పొడి గాలి, తేమ సరిగా లేకపోవడం, పాదాలకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పాదాల పగుళ్లు వస్తుంటాయి. ఆహార లోపాలు, పెరుగుతున్న వయసుతోపాటు ఎక్కువ సేపు గట్టి నేల మీద నిలబడి ఉండాల్సి రావడం కూడా మడమల పగుళ్లకు దారి తీస్తుంటాయి. డయాబెటిస్‌తోపాటు థైరాయిడ్ సమస్యలు కూడా పాదాల పగుళ్లను మరింత పెంచుతాయి. కొద్దిపాటి జాగ్రత్తతో పగిలిన పాదాలను ఇంట్లోనే మృదువుగా మార్చేసుకోవచ్చు.

Home Tips for Reducing Foot Cracksనిమ్మరసం సాల్ట్ స్ర్కబ్ :

Home Tips for Reducing Foot Cracksగోరువెచ్చని నీటిలో పాదాలను డిప్ చేసి కొద్ది సేపటి తర్వాత సాల్ట్ లో డిప్ చేసిన నిమ్మతొక్కతో పాదాలను స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ , ఇతర ఇన్ఫెక్షన్స్ తొలగిపోయి అందంగా కనబడుతాయి.

వెజిటేబుల్ ఆయిల్ :

Home Tips for Reducing Foot Cracksపగిలిన పాదాలకు వెజిటేబుల్ ఆయిల్ ను అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్, కోకనట్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ వీటిలో ఏవైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆయిల్ పాదాల పగుళ్లలోపలికి వేళ్ళి పగుళ్లను నయం చేయడానికి సహాయపడుతాయి. తగిన మాయిశ్చరైజింగ్ ను అందిస్తాయి.

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ :

Home Tips for Reducing Foot Cracksరోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ రెండూ మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు పాదాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా మారుతాయి. రెగ్యులర్ గా ఉపయోగిస్తే మరీ మంచిది.

పెట్రోలియం జెల్లీ:

Home Tips for Reducing Foot Cracksరాత్రి పడుకునే ముందు పగిలిన పాదాలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేసి, సాక్సులు వేసుకుని పడుకోవాలి. జెల్లీ బాగా పనిచేస్తుంది.

ఫ్రూట్ మాస్క్:

Home Tips for Reducing Foot Cracksబొప్పాయి మరియు అవొకాడో ను మెత్తగా పేస్ట్ చేసి పాదాలకు అప్లై చేయాలి. ఇది డ్రై స్కిన్ ను నివారించడంతో పాటు పగుళ్ళను కూడా మాయం చేస్తుంది.

పాలు మరియు తేనె:

Home Tips for Reducing Foot Cracksపాలు మరియు తేనె మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయడాలి. డ్రైగా మారిన తర్వాత రెండవసారి కోట్ వేయాలి. ఇది ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్ టాన్ నివారించి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

వేప ప్యాక్:

Home Tips for Reducing Foot Cracksవేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పసుపు అప్లై చేయాలి. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియాను నివారిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ తగ్గి పగుళ్ళు ఏర్పడకుండా ఎదుర్కొంటుంది. ఈపేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇన్ప్లమేషన్ తగ్గిస్తుంది.

వెనిగర్ :

Home Tips for Reducing Foot Cracksవేడి నీటిలో వెనిగర్ మిక్స్ చేసి అందులో పాదాలను డిప్ చేసి ఫ్యూమిస్ స్టోన్ తో రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి . తర్వాత స్ట్రాంగ్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

మస్టర్డ్ ఆయిల్:

Home Tips for Reducing Foot Cracksఆముదం నూనెతో మసాజ్ చేయాలి. ఆముదంను పాదాలకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం వేడి నీటిలో 10 నిముషాలు నాన్చి తర్వాత స్టోన్ తో రుద్దితే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోయి, పాదాలు సాప్ట్ గా కనబడుతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR