గొంతు ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు, అద్భుత చిట్కాలు

అసలే వర్షాకాలం అందులోనూ కరోనావైరస్. ఏ చిన్న లక్షణం కనిపించినా కరోనానెమో అనే భయం కలుగుతుంది. కావున ఆరోగ్యం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం.. కరోనా లక్షణాల్లో గొంతు నొప్పి కూడా ఒకటి. అయితే గొంతునొప్పి వస్తే కరోనా సోకినట్లు ఏం కాదు. సాధారణంగా వర్షాకాలం, శీతాకాలాల్లో గొంతు ఇన్ఫెక్షన్లు సాధారణంగా వస్తూవుంటాయి.

గొంతు ఇన్ఫెక్షన్కానీ నొప్పి తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే సాధారణ గొంతు నొప్పికి మీ ఇంట్లోనే సులభంగా చికిత్స చేసుకోవచ్చు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, దగ్గు ముందు గొంతులో మంట నుండే మొదలవుతాయి. ఈ కాలంలో చల్లటి పదార్థాలకు దూరంగా వుంటూ.. సాధ్యమైనంత వరకు వేడి పదార్థాలను తీసుకుంటూ శుభ్రమైన, గోరువెచ్చని నీటిని తాగుతూ వుండాలి. ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి వాటితో కషాయాన్ని తాయారు చేసుకుని సేవిస్తే గొంతు నొప్పి నుంచి నిమిషాల్లోనే ఉపశమనం పొందొచ్చు. మరి ఆ కషాయాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

గొంతు ఇన్ఫెక్షన్కొంచెం అల్లం తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక పాత్రలో నీటిని తీసుకోని అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి. ఫిల్టర్ అయిన వెచ్చని నీటిని గ్లాసులో తీసుకుని అందులో ఒక చెంచా తేనె కలిపి తాగాలి. ఈ నీటిని తాగడంతోపాటు, గార్గింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా గొంతుకు చాలా బాగా ఉపశమనం కలుగుతుంది. నొప్పి కూడా వీలైనంత త్వరగా నయమవుతుంది.

గొంతు ఇన్ఫెక్షన్గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీటిలో వెనిగర్ వేసి గార్గింగ్ చేస్తే గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ త్వరగా నయమవుతుంది. వెనిగర్ లేకపోయినా.. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి గార్గింగ్ చేసుకోవచ్చు.

గొంతు ఇన్ఫెక్షన్గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్ పసుపు వేసి కలిపి తాగాలి. కావాలంటే కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. గొంతులో గరగర మాయమవ్వడమే కాదు. గొంతులో హాయిగా అనిపిస్తుంది కూడా.

గొంతు ఇన్ఫెక్షన్ఉప్పు కూడా యాంటీ సెప్టిక్‌గా పని చేస్తుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్‌, ఇన్‌ఫెక్షన్‌నీ కూడా తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు వేసి పుక్కిలి పట్టండి. ఇలా రోజులు చాలా సార్లే చేయవచ్చు.

గొంతు ఇన్ఫెక్షన్ఒక కప్పు నీటిలో 4, 5 మిరియాలు, కొన్ని తులసి ఆకులను వేసి ఉడకబెట్టాలి. తర్వాత ఆ కషాయాన్ని తాగాలి. ఈ కషాయాన్ని రాత్రి నిద్రపోయేటప్పుడు తాగితే బాగా ప్రయోజనకరంగా ఉండటంతోపాటు.. గొంతునొప్పి త్వరగా నయమవుతుంది. మిరియాల‌తో చేసిన చారు, లేదంటే మిరియాలు వేసి మ‌రిగించిన పాల‌ను తాగుతుంటే గొంతు నొప్పి త‌గ్గుతుంది. గొంతు నొప్పికి మిరియాల పొడిలో కొంచెం నెయ్యి కలిపి సేవిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే నల్ల మిరియాలతోపాటు బాదంపప్పును కలిపి నూరి కొంచెం నీటిలో కలిపి సేవించడం వల్ల కూడా గొంతు వ్యాధులు నయమవుతాయి.

గొంతు ఇన్ఫెక్షన్గొంతు నోప్పికి పుదీనా చేసే మేలేంటో తెలిసే ఉంటుంది. పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి ఆకులు తీసివేసి వాటర్ తాగాలి. అంతే గొంతు నొప్పి అంతు చూస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ కి ఇది చక్కటి ఉపశమనం.

గొంతు ఇన్ఫెక్షన్గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ‌గా ఉంటే వేడి వేడిగా చికెన్ సూప్ తాగాలి. ఆయా స‌మస్యలకు చికెన్ సూప్ ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

గొంతు ఇన్ఫెక్షన్ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనెల‌ను క‌లుపుకుని తాగాలి. వీటిలో ఉండే స‌హ‌జ సిద్ధమైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు గొంతు నొప్పిని త‌గ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌లను పోగొడ‌తాయి.

గొంతు ఇన్ఫెక్షన్వెల్లుల్లిని మెత్తగా చేసి అందులో ఉప్పు..కారం కొంచెం కలిపి వేడి వేడి అన్నంలో తీసుకోవాలి. అరకప్పు వేడి నీళ్లలో చెంచా శొంఠి పొడి, అరచెంచా నిమ్మరసం, అల్లం రసం, తేనే కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే సరిపోతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR