తేనె, దాల్చిన చెక్క ఆరోగ్యానికి బెస్ట్ కాంబినేషన్!

  • ఆయుర్వేదంలో ఏ ఔషధం తయారుచేసిన అందులో కచ్చితంగా ఉండేది తేనె. సహజంగానే తేనెలో యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి. అలాగే అనేక పోషకాలు, ఎమినో యాసిడ్ ఉంటుంది.మన వంటింట్లో ఉండే మరో అదద్భుతమైన ఔషధం దాల్చిన చెక్క. దీన్ని పూర్వం నుంచి మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నాం.
  • చెక్కలో అనేక రకాల ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. దాల్చిన చెక్కలో ఇన్ల్ఫమేషన్ తగ్గించే గుణం, ఇమ్యునిటీని మెరుగుపరిచే సత్తా ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఈ రెండింటి కాంబినేషన్‌ అద్భుతంగా ఉంటుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, దగ్గు, జలుబు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఏ
  • ఈ రెండింటి మిశ్రమాన్ని ఏ విధంగా తీసుకుంటే ఏయే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
  • తేనె, దాల్చిన చెక్కల మిశ్రమాన్ని రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని బాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. ఈ రెండింటిలోనూ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ మిశ్రమం యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. జీర్ణాశయ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
  • దాల్చిన చెక్కని పొడి చేసుకొని తేనె కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. తేనె, దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రో బయాల్, యాంటి సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోకి అనేక రకాల వైరస్ ప్రవేశించకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వైరస్ బారిన పడకుండా చేస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.
  • అధిక బరువుతో బాధపడుతున్న వారు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలుపుకొని రోజుకు మూడు సార్లు తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి పోతుంది. శరీరం లో పేరుకుపోయిన విష వ్యర్థాలు బయటకు నెట్టి వేస్తుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. అంతే కాకుండా ఈ నీటిని తాగటం వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రాశయం లో ఉన్న క్రిములని మూత్రం ద్వారా బయటకు పోతాయి.
  • ఆర్థరైటిస్‌ నొప్పులను తగ్గించడంలో తేనె, దాల్చిన చెక్క మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ తేనె, అంతే మోతాదులో దాల్చిన చెక్క పొడిలను గోరు వెచ్చని నీటిలో వేసి బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. అలాగే ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, ఒక టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిలను కలిపి రోజూ ఒకసారి తాగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థరైటిస్‌ నొప్పులు తగ్గుతాయి.
  • దాల్చిన చెక్కలో పవర్ ఫుల్ సినామల్ డీహైడ్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల, ఇది శరీరంలో క్యాన్సర్ సెల్స్ ను తొలగిస్తుంది. శరీరంలో హెల్తీ సెల్స్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ముఖ్యంగా దాల్చిన చెక్క కోలన్ క్యాన్సర్ ను తగ్గించడంలో బాగా సహాయపడుతుందని కొన్ని పరిశోధనల ద్వారా కనుగొన్నారు
  • ఈ నీటిని తాగడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంచుతుంది. ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దంత సమస్యలను నివారిస్తుంది. చిగుళ్లు నుండి రక్తం కారడం, చిగుళ్ళవాపు, నొప్పులు, పంటి నొప్పి సమస్యలకు ఈ మిశ్రమం అద్భుతంగా సహాయపడుతుంది. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది నోటిలో ఉండే బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. ఈ మిశ్రమం అన్నిరకాల దంత సమస్యలకు చెక్ పెడుతుంది.
  • తేనె, దాల్చినచెక్క మిశ్రమం మొటిమలను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఒక టీస్పూన్‌ దాల్చినచెక్క పొడి, మూడు టేబుల్‌ స్పూన్ల తేనెను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. దీంతో మొటిమలు తగ్గుతాయి. రోజూ ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. దీంతోపాటు ఇతర చర్మ సమస్యలకు కూడా ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా గజ్జి, తామర, ఇతర చర్మ ఇన్‌ఫెక్షన్లు ఈ మిశ్రమంతో తగ్గుతాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR